తెలుగు న్యూస్ / ఫోటో /
Team India: చిన్న వయసులోనే టీమిండియాకు కెప్టెన్ అయిన క్రికెటర్లు వీళ్లే - శుభ్‌మన్ గిల్ ప్లేస్ ఇదే!
శనివారం జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌తో శుభ్‌మన్‌గిల్ కొత్తగా రికార్డును నెలకొల్పాడు. టీ ఫార్మెట్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అతి చిన్న వయస్కులలో ఒకరిగా నిలిచాడు.
(1 / 4)
యంగెస్ట్ టీమిండియా కెప్టెన్స్ లిస్ట్‌లో సురేష్ రైనా మొదటి స్థానంలో ఉన్నాడు. 23 ఏళ్ల 197 రోజుల వయసులో టీమిండియా కెప్టెన్‌గా సురేష్ రైనా నియమితుడయ్యాడు. 2010లో జరిగిన జింబాబ్వే సిరీస్ ద్వారా రైనా ఈ రికార్డ్ నెలకొల్పాడు.
(2 / 4)
సురేష్ రైనా తర్వాత టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతి పిన్న వయస్కుడిగా రిషబ్ పంత్ నిలిచాడు. పంత్ 24 ఏళ్ల 248 రోజుల వయసులో టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు
(3 / 4)
రైనా, పంత్ తర్వాత శుభ్‌మన్ గిల్ 24 ఏళ్ల 302 రోజుల వయసులో టీమిండియా సారథ్య బాధ్యతలను స్వీకరించాడు. జింబాబ్వేతో శనివారం జరిగిన టీ20 మ్యాచ్‌తో గిల్ ఈ రికార్డ్ సాధించాడు.
ఇతర గ్యాలరీలు