Ms Dhoni: వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్స్‌లో ధోనీ ఒకరు -ఈ మాజీ టీమిండియా కెప్టెన్ ఒక్కరోజు సంపాదన ఎంతంటే?
Ms Dhoni: వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్లలో ధోనీ ఒకరిగా కొనసాగుతోన్నాడు. ఈ మాజీ ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మొత్తం ఆస్తుల విలువ 1040 కోట్ల వరకు ఉంటుందని ఓ స్పోర్ట్స్ మ్యాగజైన్ తెలిపింది.
Ms Dhoni: సాధారణంగా రిటైర్‌మెంట్ ప్రకటించిన క్రికెటర్ల క్రేజ్‌తో పాటు వారి ఆదాయం కూడా తగ్గుతుంది. యాడ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్‌లో చాలా తక్కువగా రిటైరైనా క్రికెటర్లు కనిపిస్తుంటారు. యాడ్స్ కోసం రిటైర్డ్ క్రికెటర్స్ తీసుకునే రెమ్యూనరేషన్ కూడా తక్కువే ఉంటుంది. కానీ ఇవన్నీ ధోనీ విషయంలో మాత్రం మినహాయింపుగా చెప్పవచ్చు.
2020లో రిటైర్‌మెంట్...
ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు 2020లో రిటైర్‌మెంట్ ప్రకటించాడు. టీమిండియాకు దూరమై నాలుగేళ్లయినా ధోనీ క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. ప్రస్తుతం ఇరవైకిపైగా ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కు ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతోన్నాడు.
ఒప్పో, ఓరియో, కార్స్24, రెడ్‌బస్, కోల్గేట్ సహా పలు బ్రాండ్స్ యాడ్స్‌లో ధోనీనే కనిపిస్తోన్నాడు. రోజురోజుకు అతడి బ్రాండ్ వాల్యూ పెరుగుతోంది కానీ తగ్గడం లేదు.
1040 కోట్ల ఆస్తులు...
ధోనీ మొత్తం ఆస్తుల విలువ 1040 కోట్ల వరకు ఉంటుందని ఓ స్పోర్ట్స్ మ్యాగజైన్ ప్రకటించింది. వరల్డ్‌లోని రిచెస్ట్ క్రికెటర్లలో ధోనీ ఒకరని తెలిపింది. ఐపీఎల్ నుంచి ధోనీ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ హోదాలో ధోనీ ఏడాదికి 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.
ఐపీఎల్ ఫస్ట్ సీజన్‌లో ఆరు కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్న ధోనీ ఇప్పుడు అంతకు డబుల్ రెమ్యూనరేషన్ సొంతం చేసుకుంటున్నాడు. అంతే కాకుండా బీసీసీఐ నుంచి పెన్షన్ రూపంలో ధోనీ భారీగానే అందుకుంటున్నాడు.
ఏడాదికి ఎనభై కోట్లు...
ప్రస్తుతం ఐపీఎల్, యాడ్స్‌తో పాటు ఇతర బిజినెస్‌లు, ప్రమోషనల్ ఈవెంట్స్ ద్వారా ధోనీ ఏడాదికి 70 నుంచి ఎనభై కోట్ల వరకు ఆదాయం సంపాదిస్తోన్నట్లు సమాచారం. ఒక్కో యాడ్ కోసం ధోనీ మూడున్నర కోట్ల నుంచి ఆరు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటోన్నట్లు సమాచారం.
యాడ్స్ కోసం అత్యధిక రెమ్యూనరేషన్ అందుకొంటున్న ఇండియన్ క్రికెటర్లలో ధోనీ ఒకరిగా కొనసాగుతోన్నాడు. ధోనీ ఒక్క రోజు ఇన్‌కమ్ ఇరవై ఐదు లక్షలకుపైనే ఉంటుందని సమాచారం.
2025 ఐపీఎల్...
ధోనీ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. 2025 తర్వాతే ధోనీ ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సన్నిహితులు చెబుతోన్నారు. 2021 ఐపీఎల్‌లో 220 స్ట్రైక్ రేట్‌తో ధోనీ 161 పరుగులు చేశాడు. ఈ ఏడాది కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ చెన్నై కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత చెన్నై టీమ్ ధోనీ మెంటర్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
టాపిక్