Saurabh Netravalkar: ఐపీఎల్‌లోకి సౌరభ్ నేత్రవాల్కర్ ఎంట్రీ ఇస్తాడా? - ఫారిన్ ప్లేయర్‌గానే వేలంలో పోటీపడతాడా?
Saurabh Netravalkar: టీ20 వరల్డ్ కప్‌లో అదరగొడుతోన్న భారత సంతతికి చెందిక అమెరికా క్రికెటర్ సౌరభ్ నేత్రవాల్కర్ నెక్స్ట్ ఐపీఎల్‌లో బరిలో దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సౌరభ్ ఐపీఎల్ ఆడటం అనుమానమేనని సన్నిహిత వర్గాలు చెబుతోన్నాయి. కారణం ఏమిటంటే?
Saurabh Netravalkar: టీ20 వరల్డ్ కప్ ద్వారా ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయాడు అమెరికా పేసర్ సౌరభ్ నేత్రవాల్కర్. భారత సంతతికి చెందిన ఈ అమెరికన్ క్రికెటర్ పై మాజీ క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ కూడా ప్రశంసలు కురిపిస్తోన్నారు. అద్భుత బౌలింగ్‌తో పాకిస్థాన్‌ను వణికించిన ఈ క్రికెటర్ ఇండియాతో మ్యాచ్‌లోనూ రాణించాడు. కోహ్తి, రోహిత్‌లను ఔట్ చేశాడు. సౌరభ్ దెబ్బకు ఇండియా ఈ మ్యాచ్‌లో రెండు పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది.
సూపర్ 8 బెర్త్...
సౌరభ్‌తో పాటు మిగిలిన బౌలర్లు, బ్యాట్స్‌మెన్ జోరుతో అమెరికా సూపర్ 8పై కన్నేసింది. నేడు ఐర్లాండ్‌తో అమెరికా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో అమెరికా విజయం సాధిస్తే సూపర్ 8 వెళ్లేందుకు ఈ జట్టుకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఐర్లాండ్‌పై రికార్డ్ విజయంతో సూపర్ 8 బెర్త్‌ను కన్ఫామ్ చేసుకొని పాకిస్థాన్‌కు షాకివ్వాలని అమెరికా ఎదురుచూస్తోంది
ఐపీఎల్‌లో సౌరభ్...
వరల్డ్ కప్‌లో ప్రదర్శనతో నెక్స్ట్ ఐపీఎల్‌లోనూ సౌరభ్ నేత్రవాల్కర్ ఆడనున్నట్లు కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తోన్నాయి. ఇండియా పిచ్‌లపై ఆడిన అనుభవం సౌరభ్‌కు ఉంది.
ముంబయిలో జన్మించిన సౌరభ్ నేత్రవాల్కర్ టీమ్ ఇండియా తరఫున 2010లో అండర్ 19 వరల్డ్ కప్ ఆడాడు. ఈ వరల్డ్ కప్‌లో బౌలింగ్‌తో అదరగొట్టాడు. దేశవాళీలో ముంబయి జట్టుకు చాలా మ్యాచుల్లో సౌరభ్ ప్రాతినిథ్యం వహించాడు. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ తో పాటు పలువురు టీమిండియా ప్లేయర్లతో కలిసి సౌరభ్‌క్రికెట్ ఆడాడు.
ఒరాకిల్ సంస్థలో...
క్రికెటర్‌గా ఇండియాలో సరైన అవకాశాలు రాకపోవడంతో అమెరికా వెళ్లిన సౌరభ్ నేత్రవాల్కర్ చదువును పూర్తిచేసుకొని ఒరాకిల్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. జాబ్ చేస్తూనే లీగ్‌లో అదరగొట్టి అమెరికా టీమ్‌లో చోటు సంపాదించుకున్నాడు. అమెరికా క్రికెటర్‌తో అదరగొడుతోన్న సౌరభ్ ఐపీఎల్ ఆడుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఏజ్ మైనస్...
అయితే సౌరభ్ ఐపీఎల్ ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది. అతడి ఏజ్ ఇప్పటికే 32 ఏళ్లు దాటింది. లేట్ వయసులో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి రాణించిన క్రికెటర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో పేస్ బౌలర్లు పెద్దగా లేరు. వయసు సౌరభ్‌కు అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్‌లో అమెరికా టీమ్ తరఫున ఫారిన్స్ ప్లేయర్‌గానే వేలంలో సౌరభ్ పోటీపడాల్సివుంటుంది. ఐపీఎల్‌లో ప్రతి జట్టులో నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉండాలని బీసీసీఐ రూల్ పెట్టింది. అమెరికా తరఫున సౌరభ్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తే ఫారిన్ ప్లేయర్ రూల్ కారణంగా తుది జట్టులో ఆడే అవకాశాల కోసం పోటీపడాల్సివుంది. ఈ రూల్ కారణంగా సౌరభ్ ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచ్‌లు బెంచ్‌కు పరిమితమయ్యే అవకాశాలే కనిపిస్తోన్నాయి.
మూడు నెలలు ఇండియాలోనే...
మరోవైపు ఐపీఎల్ లీగ్ మూడు నెలల పాటు జరుగనుంది. ప్రాక్టీస్ కోసం ఓ నెల మొత్తం నాలుగు నెలల పాటు ఐపీఎల్ కోసం ఇండియాలోనే సౌరభ్ ఉండాల్సివస్తుంది. అయితే జాబ్ కోసం క్రికెట్ కెరీర్ వదులుకున్న సౌరభ్...ఐపీఎల్ కోసం మళ్లీ జాబ్ వదులుకోవడం కష్టమేనని అతడి సన్నిహితులు చెబుతోన్నారు.
ఒకవేళ ఐపీఎల్‌లో బరిలో దిగితే పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు ముంబై ఇండియన్స్‌లో ఓ జట్టును అతడు ఎంచుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
టాపిక్