Dhawan Retirement: రిటైర్మెంట్ తర్వాత శిఖర్ ధావన్ అడుగులు ఎటు వైపు? క్రికెటర్‌లో ఎవరూ ఊహించని కోణం-former india opener shikhar dhawan first interview after retirement ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Dhawan Retirement: రిటైర్మెంట్ తర్వాత శిఖర్ ధావన్ అడుగులు ఎటు వైపు? క్రికెటర్‌లో ఎవరూ ఊహించని కోణం

Dhawan Retirement: రిటైర్మెంట్ తర్వాత శిఖర్ ధావన్ అడుగులు ఎటు వైపు? క్రికెటర్‌లో ఎవరూ ఊహించని కోణం

Galeti Rajendra HT Telugu
Aug 24, 2024 11:12 AM IST

Shikhar Dhawan: భారత అగ్రశ్రేణి ఓపెనర్ శిఖర్ ధావన్ తన సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కి గుడ్ బై శనివారం ఉదయం గుడ్ బై చెప్పేశాడు. ఇప్పుడు ధావన్ తన అడుగులు ఎటువైపు వేయబోతున్నాడు? కామెంట్రీ వైపు వస్తాడా? ఆధ్యాత్మికం వైపు వెళ్తాడా?

శిఖర్ ధావన్ రిటైర్మెంట్
శిఖర్ ధావన్ రిటైర్మెంట్ (AP)

Shikhar Dhawan Retirement: టీమిండియాలో అత్యంత విజయవంతమైన వన్డే ఓపెనర్లలో ఒకరైన శిఖర్ ధావన్ అనూహ్య రీతిలో శనివారం ఉదయం అంతర్జాతీయ, దేశవాళి క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. అరంగేట్రం టెస్టులో ఆస్ట్రేలియాపై అత్యంత వేగవంతమైన సెంచరీతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఈ 38 ఏళ్ల ఆటగాడు తన భవిష్యత్తు గురించి హెచ్‌టీ సిటీతో ప్రత్యేకంగా మాట్లాడాడు.

రిటైర్మెంట్ ప్రకటించడం కఠినమైన నిర్ణయమా?


కఠినమైనది కాదు, కానీ ఇది భావోద్వేగ నిర్ణయమే. నా జీవితంలో సగభాగాన్ని క్రికెట్‌కే అంకితం చేశాను. వయసురిత్యా ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకోవడమా లేదంటే ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడమా అనేది నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. 

శిఖర్ ధావన్
శిఖర్ ధావన్

రిటైర్మెంట్ తర్వాత పేరు, ప్రతిష్టలు మాయమవుతాయని భయపడుతున్నారా?

నేను క్రికెట్‌ను వదిలేస్తే అవన్నీ ఎందుకు కోల్పోతాను? ఎవరికి తెలుసు నా కీర్తి ఇంకా పెరుగుతుందేమో. నా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా కూడా (నవ్వుతూ) నాపై అభిమానులు చూపించే ప్రేమ, అభిమానం పెరుగుతోంది.

ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తారా?

నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు.. కలలను నిజం చేసుకోవడానికి నిరంతరం ప్రాక్టీస్ చేశాను. రిటైర్మెంట్ తర్వాత బ్రహ్మకుమారీ మతానికి చెందిన సిస్టర్ శివానీ మనం పక్షుల్లా ఉండాలని చెప్పేవారు. నా కోసం కొన్ని వేచి ఉన్నాయని నేను నమ్ముతున్నా.

బ్రహ్మ కుమారి ఆశ్రమంలో శిఖర్ ధావన్
బ్రహ్మ కుమారి ఆశ్రమంలో శిఖర్ ధావన్ (Photo: Facebook/Shikhar Dhawan)

క్రికెట్‌లో మీకు నెరవేరని కల ఏదైనా ఉందా?

అస్సలు లేదు. నా సామర్థ్యంతో నేను ఆశించింది 100% సాధించాను. దేశం తరఫున టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోనూ ఆడి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాను. నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను.

మీ కెరీర్ లో మీకు అత్యంత ఇష్టమైన ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకోవాలంటే.

ఒకటి కంటే ఎక్కువగానే ఉన్నాయి. అయితే, 2013లో టెస్టు అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 187 పరుగులు చేశాను. 85 బంతుల్లోనే చేసినప్పుడు, ఒక అరంగేట్ర ఆటగాడు వేగవంతమైన సెంచరీగా ప్రపంచ రికార్డును నెలకొల్పానని నాకు తెలియదు.

2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై ఓవల్ మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాకు గాయమైంది. అప్పటికి నేను 25 పరుగులతో క్రీజులో ఉన్నాను. దాంతో డగౌట్‌కి వెళ్లకూడదని గట్టిగా నిర్ణయించుకుని.. పెయిన్ కిల్లర్ తీసుకుని అలానే బ్యాటింగ్ కొనసాగించాను. ఆ ఇన్నింగ్స్‌లో 109 బంతుల్లో 117 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాను.

క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు?

నా తల్లిదండ్రులు, కుటుంబం కెరీర్ సాంతం నాకు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా కెరీర్ ఆరంభం నుంచి నా కోచ్‌లు. మదన్ శర్మ సర్, తారిక్ సిన్హా సర్ నా కెరీర్‌కు పునాది వేశారు. అలానే కచ్చితంగా బీసీసీఐకి థ్యాంక్స్ చెప్పాలి. భారత జట్టు కోచ్‌లు, ఫిజియోల బృందం అందరూ నాకు ఎంతో సహకరించారు. నా ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మీరు ఇప్పటికే చాలా వెంచర్లు ప్రారంభించారు. డా వన్ గ్రూప్, మీ ఫౌండేషన్, మీ టాక్ షో ధావన్ కరేంగే, డబుల్ ఎక్స్ఎల్ సినిమాలో అతిథి పాత్ర... మీరు మీ స్పోర్ట్స్ టెక్నాలజీ ఫండ్ యషాలో భారీగా పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఒక జట్టును కూడా కొనుగోలు చేశారు. రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ సమయం ఎక్కడ కేటాయిస్తారు?

నాకు ఒక్కడికే కాదు.. నా వ్యాపారాల్లో నాతో అనుబంధం ఉన్న వారందరికీ సంపదను సృష్టించాలన్నదే నా ధ్యేయం. వ్యాపారం, వినోదం, రాజకీయాలు ఇలా అన్నింటికీ నేను సిద్ధంగా ఉన్నాను. నేను అందరితో కలిసి వెళ్లాలనుకుంటున్నాను. దేవుడు ఏమి చేయాలనుకుంటున్నానో అది చేయడానికి నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఇకపై ఏమి చేసినా నేను ఇప్పటికే చేరుకున్న స్థాయి కంటే ఒక మెట్టు పైకి ఎదిగేలా చేస్తాను.

క్రికెట్ కామెంట్రీ వైపు వెళ్తారా? 

నేను ఇప్పటికే నా వెంచర్ల ద్వారా మంచి రాబడిని పొందుతున్నాను. ఒక క్రికెటర్‌గా నా మాటతీరుతో కామెంట్రీ చేసే అవకాశం ఎప్పుడూ  నాకు ఉంటుంది. అయితే నేను  కొత్తగా, ఇంకా పెద్దది చేయడానికి ప్రయత్నించాలనుకుంటున్నాను. నేను పైకి ఎగరాలని అనుకుంటున్నాను. పడిపోతాననే భయం నాకు లేదు.

మీ బయోపిక్ తీస్తే అందులో మీరు నటిస్తారా? ఒకవేళ మీరు కాకపోతే ఎవరు నటిస్తే బాగుంటుంది?

బయోపిక్‌ను సినిమాగా తీస్తేనే అందరితో పాటు నాకు నచ్చుతుంది. ఇందులో నటించే విషయానికొస్తే సినిమాకు ఏదైనా అదనపు మసాలా జోడిస్తే హ్యాపీగా నేను చేస్తాను. ఒకవేళ నేను చేయలేకపోతే అక్షయ్ కుమార్ లేదా రణవీర్ సింగ్ నా పాత్ర పోషిస్తే బాగుంటుంది. 

మీ కొడుకు జొరావర్‌ గురించి చెప్తారా? ఎంతో మంది ఒంటరి తండ్రులకి మీరు స్ఫూర్తిగా ఉన్నారు. 

కొడుకు జొరావర్‌తో శిఖర్ ధావర్
కొడుకు జొరావర్‌తో శిఖర్ ధావర్ (Photo: Facebook/Shikhar Dhawan)

నా కొడుకు జొరావర్ వయసు ఇప్పుడు 11 ఏళ్లు. నా రిటైర్మెంట్ గురించి, నా క్రికెట్ జర్నీ గురించి అతనికి ఇప్పుడు తెలుసు అనుకుంటున్నా. కానీ ఒక క్రికెటర్‌గా కంటే నన్ను మంచి పనులు చేసే వ్యక్తిగా, తన చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల సానుకూలంగా ఉండే వ్యక్తిగా జొరావర్ నన్ను గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను.  (శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నాడు) 

Whats_app_banner