India vs England 3rd test: మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే.. మళ్లీ ఇద్దరు పేసర్లు.. పిచ్ అలా ఉన్నందుకేనా?-england xi for third test against india mark wood returns two pace bowlers in the side rajkot pitch report ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs England 3rd Test: మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే.. మళ్లీ ఇద్దరు పేసర్లు.. పిచ్ అలా ఉన్నందుకేనా?

India vs England 3rd test: మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే.. మళ్లీ ఇద్దరు పేసర్లు.. పిచ్ అలా ఉన్నందుకేనా?

Hari Prasad S HT Telugu
Feb 14, 2024 01:42 PM IST

India vs Engand 3rd test: టీమిండియాతో గురువారం (ఫిబ్రవరి 15) నుంచి జరగబోయే మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును అనౌన్స్ చేసింది. ఈ మ్యాచ్ కు ఆ టీమ్ మరోసారి ఇద్దరు పేస్ బౌలర్లతో బరిలోకి దిగుతోంది.

మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టులో ఇద్దరు పేస్ బౌలర్లు మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్
మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టులో ఇద్దరు పేస్ బౌలర్లు మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ (ANI)

India vs Engand 3rd test: ఇంగ్లండ్ టీమ్ మూడో టెస్టు కోసం తుది జట్టులో ఒక మార్పు చేసింది. రెండో టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు, ఒక పేస్ బౌలర్ తో బరిలోకి దిగగా.. రాజ్‌కోట్ టెస్టుకు మాత్రం యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ను తప్పించి పేసర్ మార్క్ వుడ్ ను ఎంపిక చేసింది. దీంతో మూడో టెస్టుకు ఇద్దరు పేస్ బౌలర్లతో బరిలోకి దిగుతోంది. రాజ్‌కోచ్ పిచ్ ఈ నిర్ణయం వెనుక కారణంగా కనిపిస్తోంది.

ఇంగ్లండ్ జట్టులో ఇద్దరు పేసర్లు

ఇండియాతో జరిగిన తొలి టెస్టులో పేస్ బౌలర్ మార్క్ వుడ్ తుది జట్టులో ఉన్నాడు. రెండో టెస్టుకు మాత్రం అతన్ని తప్పించి సీనియర్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ను తీసుకున్నారు. తొలి రెండు టెస్టుల్లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన ఆ టీమ్.. ఇప్పుడు అనూహ్యంగా మూడో టెస్టుకు మాత్రం ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో దిగనుండటం గమనార్హం.

మార్క్ వుడ్ ను తీసుకోవడానికి రెండో టెస్ట్ ఆడిన యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ను పక్కన పెట్టారు. మిగిలిన జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. సీనియర్ బ్యాటర్ జో రూట్ కూడా స్పిన్ బౌలింగ్ తో ఇండియన్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతుండటం కూడా ఈ నిర్ణయం వెనుక ఓ కారణంగా కనిపిస్తోంది.

ఇంగ్లండ్ తుది జట్టు ఇదే

జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, రేహాన్ అహ్మద్, టామ్ హార్ట్‌లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్

రాజ్‌కోట్ పిచ్ కారణమా?

ఇండియా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు రాజ్‌కోట్ లో జరగబోతోంది. ఇంగ్లండ్ ఇద్దరు పేస్ బౌలర్ల నిర్ణయం వెనుక ఇక్కడి పిచ్ కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. రాజ్‌కోట్ పిచ్ పై మంగళవారం వరకూ మంచి పచ్చిక కనిపించింది. అయితే బుధవారం (ఫిబ్రవరి 14) మాత్రం ఆ పచ్చిక మొత్తాన్నీ తొలగించారు. వికెట్ చాలా ఫ్లాగ్ గా కనిపిస్తోంది.

దీంతో ఈ పిచ్ పై పరుగుల వరద పారేలా ఉంది. దీనికితోడు పేస్ బౌలింగ్ కు కూడా కాస్త అనుకూలించే అవకాశం ఉండటంతో ఇంగ్లండ్ తమ ఇద్దరు సీనియర్ పేసర్లు మార్క్ వుడ్, ఆండర్సన్ లతో బరిలోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు ఇండియా మిడిలార్డర్ లో కూడా సీనియర్ బ్యాటర్లు లేక బలహీనంగా మారింది. వాళ్లకు పేస్ తో చెక్ పెట్టాలని చూస్తోంది.

గతంలో రాజ్‌కోట్ లో ఇండియా, ఇంగ్లండ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2016లో జరిగిన ఆ సిరీస్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 536 పరుగుల భారీ స్కోరు చేసింది. జో రూట్, స్టోక్స్ సెంచరీలు చేశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఇండియా మురళీ విజయ్ సెంచరీతో 488 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 3 వికెట్లకు 260 రన్స్ చేసి డిక్లేర్ చేయగా.. ఇండియా ముందు 310 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చివరికి 172 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన సందర్భంలో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Whats_app_banner