Chennai Super Kings Strongest XI: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ బలమైన తుది జట్టు ఇదే!-chennai super kings strongest xi in ipl 2024 csk team with dhoni ruturaj jadeja rachin ravindra rahane looking strong ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Chennai Super Kings Strongest Xi: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ బలమైన తుది జట్టు ఇదే!

Chennai Super Kings Strongest XI: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ బలమైన తుది జట్టు ఇదే!

Hari Prasad S HT Telugu
Mar 19, 2024 02:52 PM IST

Chennai Super Kings Strongest XI: ఐపీఎల్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగనున్న చెన్నై సూపర్ కింగ్స్ బలమైన తుది జట్టు ఏది? ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది.

ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ బలమైన తుది జట్టు ఇదే!
ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ బలమైన తుది జట్టు ఇదే! (PTI)

Chennai Super Kings Strongest XI: ఐపీఎల్ 2024 సీజన్ ను చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభించబోతోంది. ఆర్సీబీతో ఆ టీమ్ సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ శుక్రవారం (మార్చి 22) చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. మరి ఈ మ్యాచ్ తోపాటు ఈ కొత్త సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ బలమైన తుది జట్టు ఏదో మీరే చూడండి.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మార్పులు

చెన్నై సూపర్ కింగ్స్ గతేడాది మరోసారి ధోనీ కెప్టెన్సీలో ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. దీంతో ముంబై ఇండియన్స్ ఐదు టైటిల్స్ రికార్డును సీఎస్కే సమం చేసింది. ఇప్పుడు 42 ఏళ్ల వయసులో ధోనీయే మళ్లీ కెప్టెన్ గా డిఫెండింగ్ ఛాంపియన్ గా ఆ టీమ్ బరిలోకి దిగబోతోంది. గతేడాదికి ఇప్పటికీ ఆ టీమ్ లో కొన్ని కీలకమైన మార్పులు జరిగాయి.

ఈ వేలంలో స్టార్ న్యూజిలాండ్ ప్లేయర్స్ డారిల్ మిచెల్, రచిన్ రవీంద్రలతోపాటు శార్దూల్ ఠాకూర్, ముస్తఫిజుర్ రెహమాన్, సమీర్ రిజ్వీలాంటి ప్లేయర్స్ ను కొనుగోలు చేసింది. ఈ ప్లేయర్స్ రాకతో చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులో మార్పులు తప్పేలా లేవు. ఈ సీజన్ కు మరో న్యూజిలాండ్ ప్లేయర్ డెవోన్ కాన్వే కూడా దూరం కావడంతో తప్పనిసరిగా ఆ టీమ్ కాంబినేషన్ మారిపోనుంది.

కాన్వే లేకపోవడంతో అతని స్థానంలో రచిన్ రవీంద్ర లేదంటే అజింక్య రహానే.. రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత డారిల్ మిచెల్, శివమ్ దూబెలాంటి ఆల్ రౌండర్లు ఉన్నారు. ఆరో స్థానంలో వికెట్ కీపర్ ఎమ్మెస్ ధోనీ, ఏడో స్థానంలో రవీంద్ర జడేజా, 8వ స్థానంలో శార్దూల్ ఠాకూర్, 9వస్థానంలో దీపక్ చహర్, 10వస్థానంలో సాంట్నర్ లేదంటే మహీష తీక్షణ, 11వ స్థానంలో ముస్తఫిజుర్ రెహమాన్ ఉండే అవకాశాలు ఉన్నాయి.

నిజానికి గతేడాదితో పోలిస్తే కాన్వే, పతిరణలాంటి స్టార్స్ మిస్సయినా.. మిచెల్, శార్దూల్ ఠాకూర్, రచిన్ రవీంద్రలాంటి ప్లేయర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మరింత బలోపేతమైంది. బహుషా ధోనీకి ఇదే చివరి సీజన్ కానున్న నేపథ్యంలో మరోసారి ఆ టీమ్ టైటిల్ పై కన్నేసింది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ లోనే ఆర్సీబీపై తమకు అందుబాటులో ఉన్న అత్యంత బలమైన తుది జట్టును ఎంపిక చేయడం ఖాయం.

ఐపీఎల్ 2024లో ఇదే తొలి మ్యాచ్. అందులోనూ ప్రత్యర్థి ఆర్సీబీలాంటి బలమైన జట్టు. దీంతో విన్నింగ్ స్టార్ట్ చాలా ముఖ్యం. తమ సొంత గ్రౌండ్ లో ఆడుతుండటం చెన్నైకి కలిసి రానుంది. ఇప్పటికే ధోనీ రెండు వారాలుగా చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు ఇదేనా?

రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబె, ఎమ్మెస్ ధోనీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, సాంట్నర్/తీక్షణ, ముస్తఫిజుర్ రెహమాన్

Whats_app_banner