Babar Azam Wedding: తన పెళ్లి కోసం ఇండియాలో షేర్వాణీ కొన్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజం.. రేటెంతో తెలిస్తే షాకే-babar azam wedding pakistan captain spends 7 lakhs to buy sherwani designed by sabyasachi ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Babar Azam Wedding: తన పెళ్లి కోసం ఇండియాలో షేర్వాణీ కొన్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజం.. రేటెంతో తెలిస్తే షాకే

Babar Azam Wedding: తన పెళ్లి కోసం ఇండియాలో షేర్వాణీ కొన్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజం.. రేటెంతో తెలిస్తే షాకే

Hari Prasad S HT Telugu
Nov 03, 2023 07:36 PM IST

Babar Azam Wedding: తన పెళ్లి కోసం ఇండియాలో షేర్వాణీ కొన్నాడు పాకిస్థాన్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం. వరల్డ్ కప్ మధ్యలో అతడిలా పెళ్లి షాపింగ్ చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇండియాలోనే తన పెళ్లి షాపింగ్ పూర్తి చేసుకుంటున్న బాబర్ ఆజం
ఇండియాలోనే తన పెళ్లి షాపింగ్ పూర్తి చేసుకుంటున్న బాబర్ ఆజం

Babar Azam Wedding: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం.. ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నాడు. దీనికోసం అతడు ఇండియాలో లక్షల పెట్టి షాపింగ్ చేస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఖరీదైన షేర్వాణీ కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన షేర్వాణీని బాబర్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

బాబర్ ఆజం ఈ షేర్వాణీ కోసం ఏకంగా రూ.7 లక్షలు ఖర్చు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇండియాలో ప్రముఖులు తమ ఇళ్లలో పెళ్లిళ్లు, ఇతర సెలబ్రేషన్స్ సమయంలో సబ్యసాచి డిజైనర్స్ వేసుకోవడం సహజమే. అయితే పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ అయిన బాబర్ కూడా తన పెళ్లి కోసం ఇక్కడి షేర్వాణీ ధరించనుండటం విశేషమే.

షేర్వాణీయే కాదు.. తన పెళ్లి కోసం కొన్ని జువెలరీని కూడా బాబర్ ఇక్కడే కొంటున్నాడు. వరల్డ్ కప్ కోసం తొలిసారి ఇండియాలో అడుగు పెట్టిన అతడు.. షాపింగ్ మొత్తం ఇక్కడే పూర్తి చేస్తున్నాడు. అయితే ఓ వైపు కీలకమైన వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతుంటే.. అది వదిలేసి బాబర్ ఇలా పెళ్లి షాపింగ్ చేస్తుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

అందులోనూ పాకిస్థాన్ టీమ్ ఈ టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడి.. ఈ మధ్యే బంగ్లాదేశ్ పై ఓ విజయంతో ఊపిరి పీల్చుకుంది. అయినా ఆ టీమ్ సెమీఫైనల్ చేరాలంటే అద్భుతమే జరగాలి. ఇలాంటి సమయంలో బాబర్ టోర్నీని పక్కన పెట్టి.. ఏడాది చివర్లో జరగబోయే తన పెళ్లిపై దృష్టి సారించడం ఏంటని పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

వ్యక్తిగతంగా కూడా ఈ టోర్నీలో బాబర్ అంతగా ఫామ్ లో లేడు. ఈ నేపథ్యంలో శనివారం (నవంబర్ 4) పాక్ టీమ్ న్యూజిలాండ్ తో కీలకమైన మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ రెండు జట్లకూ కీలకమే. ఇందులో కచ్చితంగా గెలిస్తేనే పాక్ సెమీస్ పై ఆశలు పెట్టుకోవచ్చు. లేదంటే దాదాపు దారులు మూసుకుపోయినట్లే. అటు న్యూజిలాండ్ కూడా వరుసగా నాలుగు గెలిచినా.. తర్వాత హ్యాట్రిక్ ఓటములతో కుంగిపోయింది.

ఈ మ్యాచ్ కివీస్ కూడా కీలకమే. మరోవైపు శనివారమే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య కూడా మరో కీలకమైన మ్యాచ్ జరగబోతోంది. మొదట న్యూజిలాండ్ పై పాక్ గెలవడమే కాదు.. తర్వాత ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఓడించాలని కూడా ఆ టీమ్ కోరుకుంటోంది.

Whats_app_banner