Ashwin on Rohit Sharma: రోహిత్ కోసం ప్రాణాలైనా ఇస్తా.. ఆ రోజు అంత సాయం చేశాడు: అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్-ashwin praises rohit sharma recalls the day his mother fell ill during rajkot test against england thanks pujara too ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ashwin On Rohit Sharma: రోహిత్ కోసం ప్రాణాలైనా ఇస్తా.. ఆ రోజు అంత సాయం చేశాడు: అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ashwin on Rohit Sharma: రోహిత్ కోసం ప్రాణాలైనా ఇస్తా.. ఆ రోజు అంత సాయం చేశాడు: అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Mar 13, 2024 08:56 AM IST

Ashwin on Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోసం ఫీల్డ్ లో తాను ప్రాణాలైనా ఇస్తానని స్పిన్నర్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రాజ్‌కోట్ టెస్ట్ సమయంలో తన తల్లి హఠాత్తుగా అనారోగ్యం బారిన పడినప్పుడు రోహిత్ చేసిన సాయాన్ని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.

రోహిత్ కోసం ప్రాణాలైనా ఇస్తా.. ఆ రోజు అంత సాయం చేశాడు: అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రోహిత్ కోసం ప్రాణాలైనా ఇస్తా.. ఆ రోజు అంత సాయం చేశాడు: అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (ANI )

Ashwin on Rohit Sharma: టీమిండియా సీనియర్ స్పిన్నర్, ఈ మధ్యే వందో టెస్ట్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్ తన కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. అతని కోసం ఫీల్డ్ లో ప్రాణాలైనా ఇస్తానని అనడం గమనార్హం. రోహిత్ ఎంత మంచి మనిషో చెబుతూ.. తన తల్లి అనారోగ్యం బారిన పడినప్పుడు అతడు చేసిన సాయాన్ని గుర్తు చేసుకున్నాడు.

రోహిత్ చాలా గొప్పోడు: అశ్విన్

రాజ్‌కోట్ టెస్ట్ సందర్భంగా జరిగిన ఆ ఘటన గురించి అశ్విన్ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో వివరించాడు. ఈ సందర్భంగా రోహిత్ తోపాటు చెతేశ్వర్ పుజారాకు కూడా అతడు థ్యాంక్స్ చెప్పాడు.

"రెండో రోజు ఇది జరిగింది. నేను 499 వికెట్లతో ఉన్నాను. వైజాగ్ లోనే 500 వికెట్లు తీస్తాను అనుకున్నా కానీ అది జరగలేదు. కానీ రాజ్‌కోట్ టెస్ట్ రెండో రోజు జాక్ క్రాలీని ఔట్ చేసి ఆ మైలురాయిని చేరుకున్నాను. ఆ రోజు ముగిసిన తర్వాత నేను కొన్ని ఇంటర్వ్యూలు చేశాను. 500వ వికెట్ తీయడంతో నా భార్య లేదంటే నాన్న నుంచి కాల్ వస్తుందని భావించాను.

కానీ అలా జరగలేదు. రాత్రి 7 కావచ్చింది. కానీ వాళ్లు కూడా ఇంటర్వ్యూల్లో బిజీగా ఉంటారని అనుకున్నాను. అందుకే దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. మా పేరెంట్స్ ఫోన్ కలవకపోవడంతో నా భార్యకు ఫోన్ చేశాను. ఆమె వాయిస్ బ్రేక్ అవుతూ ఉంది. ఆమె నన్ను టీమ్మేట్స్ కు దూరంగా వెళ్లమని చెప్పింది. మా అమ్మ తీవ్ర తలనొప్పితో కుప్పకూలిందని చెప్పింది. నేను ఫోన్ ఎత్తకపోవడంతో ఆమె రోహిత్, ద్రవిడ్ లకు ఫోన్ చేసినట్లుంది. రోహిత్ నా దగ్గరికి వచ్చి.. ఇంకా ఏం ఆలోచిస్తున్నావ్.. వెంటనే బయలుదేరు.. బ్యాగ్ ప్యాక్ చేసుకొని వెళ్లు అన్నాడు" అని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.

పుజారా ఎంతో సాయం చేశాడు

అయితే అప్పటికప్పుడు రాజ్‌కోట్ నుంచి చెన్నై వెళ్లడం అంత సులువు కాలేదు. కానీ తన మాజీ టీమ్మేట్, లోకల్ బాయ్ చెతేశ్వర్ పుజారా ఈ విషయంలో తనకు చేసిన సాయాన్ని కూడా అశ్విన్ వెల్లడించాడు. "పుజారాకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. నాకు చార్టర్డ్ ఫ్లైట్ అరేంజ్ చేయడానికి అతడు చాలా మందితో మాట్లాడాడు" అని అశ్విన్ చెప్పాడు.

ఇక రోహిత్ వద్దంటున్నా కూడా ఒక ఫిజియోను తన వెంట పంపించాడని కూడా అతడు తెలిపాడు. "మా టీమ్ ఫిజియో కమలేష్ జైన్ ఓ మంచి ఫ్రెండ్. నాతోపాటు అతన్ని చెన్నైకి వెళ్లాల్సిందిగా రోహిత్ అతనికి చెప్పాడు. వద్దు ఇక్కడే ఉండమని కమలేష్ కు చెప్పాను. కానీ నేను ఫ్లైట్ ఎక్కే సమయానికే కమలేష్ తోపాటు ఓ సెక్యూరిటీ కూడా అక్కడ ఉన్నారు.

అంతేకాదు రోహిత్ ఎప్పటికప్పుడు కమలేష్ కు ఫోన్ చేసి నా బాగోగులు అడిగాడు. అది నన్ను బాగా కదిలించింది. తమ స్వార్థం తప్ప ఏమీ పట్టని సమాజంలో ఇతరుల క్షేమం గురించి ఆలోచించడం గొప్ప విషయం. రోహిత్ ప్రత్యేకమైన వ్యక్తి. మంచి మనసున్న వాడు. మొదట్లోనే ఇది గమనించాను. అతని కోసం నేను ఫీల్డ్ లో ప్రాణాలైనా ఇస్తాను. అలాంటి కెప్టెన్ అతడు.

అతనికి ఉన్న ఈ లక్షణాల వల్లే అన్ని టైటిల్స్ గెలిచారు. రోహిత్ తన కెరీర్లో ఇంకా ఎంతో సాధించాలి. అతనిపై నా గౌరవం మరింత పెరిగింది. ఓ ప్లేయర్ ను నమ్మితే అతనికి అండగా నిలుస్తాడు. ధోనీ కూడా ఇదే చేస్తాడు. కానీ రోహిత్ అతని కంటే పది అడుగులు ముందే ఉంటాడు" అని అశ్విన్ అన్నాడు.

Whats_app_banner