తెలుగు న్యూస్ / ఫోటో /
Ravichandran Ashwin: అనిల్ కుంబ్లేను దాటేసిన రవిచంద్రన్ అశ్విన్.. మురళీధరన్ రికార్డు కూడా బద్దలు
Ravichandran Ashwin: భారత స్టార్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్‍తో జరిగిన ఐదో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో 9 వికెట్లతో సత్తాచాటాడు. తన వందో టెస్టులోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. టీమిండియా భారీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో కొన్ని రికార్డులను బద్దలు కొట్టాడు అశ్విన్.
(1 / 6)
ఇంగ్లండ్‍తో జరిగిన ఐదో టెస్టులో మూడో రోజైన నేడు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటాడు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. దీంతో ఇంగ్లండ్ 195 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల భారీ తేడాతో మ్యాచ్ గెలిచి.. 4-1తో సిరీస్ దక్కించుకుంది. (AP)
(2 / 6)
ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ మ్యాచ్‍లో మొత్తంగా 9 వికెట్లు (9/128) దక్కించుకున్నాడు. అశ్విన్‍కు ఇది వందో టెస్టు కావడం మరో విశేషంగా ఉంది. ఈ మ్యాచ్‍లో అద్భుత ప్రదర్శనతో మరిన్ని రికార్డును అశ్విన్ సాధించాడు. (ICC - X )
(3 / 6)
భారత తరఫున టెస్టు క్రికెట్‍లో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అశ్విన్.. టెస్టుల్లో 36వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. (PTI)
(4 / 6)
దీంతో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (35సార్లు ఐదు వికెట్లు)ను అశ్విన్ దాటేశాడు. 132 టెస్టుల్లో కుంబ్లే 35సార్లు ఐదు వికెట్లను తీసుకుంటే.. 100 టెస్టుల్లోనే దాన్ని దాటేశాడు అశ్విన్. 36వ సారి ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తాచాటాడు. (ANI )
(5 / 6)
వందో టెస్టులో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సాధించిన బౌలర్‌గా శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ రికార్డును కూడా అశ్విన్ బద్దలుకొట్టాడు. (PTI)
(6 / 6)
తన వందో టెస్టులో మురళీధరన్ 141 పరుగులు ఇచ్చి 9 వికెట్లు తీస్తే.. అశ్విన్ ఈ టెస్టులో 128 పరుగులు ఇచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. దీంతో వందో టెస్టులో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. వందో టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్ (7)లను కూడా అధిగమించాడు అశ్విన్. (REUTERS)
ఇతర గ్యాలరీలు