Akash Deep: ఇంగ్లండ్ ఓపెనర్‌ను రెండుసార్లు క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాశ్ దీప్.. తొలి వికెట్ దక్కినట్లే దక్కి..-akash deep dream debut getst wicket of no ball but came back strongly cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Akash Deep: ఇంగ్లండ్ ఓపెనర్‌ను రెండుసార్లు క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాశ్ దీప్.. తొలి వికెట్ దక్కినట్లే దక్కి..

Akash Deep: ఇంగ్లండ్ ఓపెనర్‌ను రెండుసార్లు క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాశ్ దీప్.. తొలి వికెట్ దక్కినట్లే దక్కి..

Hari Prasad S HT Telugu
Feb 23, 2024 12:21 PM IST

Akash Deep: టీమిండియా తరఫున టెస్టు అరంగేట్రం చేసిన పేస్ బౌలర్ ఆకాశ్ దీప్ తొలి వికెట్ విషయంలో డ్రామా నెలకొంది. అతడు ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని రెండుసార్లు క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని రెండుసార్లు క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాశ్ దీప్
ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని రెండుసార్లు క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాశ్ దీప్ (X)

Akash Deep: మొన్న సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్.. ఇప్పుడు ఆకాశ్ దీప్.. టీమిండియా తరఫున మరో యువ ప్లేయర్ టెస్ట్ అరంగేట్రం చేసి అదరగొట్టారు. ఈ బెంగాల్ యువ పేసర్ తాను ఆడుతున్న తొలి టెస్టు తొలి సెషన్ లోనే మూడు వికెట్లు తీయడం విశేషం. అయితే తన తొలి టెస్ట్ వికెట్ విషయంలో మాత్రం హైడ్రామా క్రియేటైంది. ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని అతడు రెండుసార్లు బౌల్డ్ చేయాల్సి వచ్చింది.

ఆకాశ్ దీప్.. తొలి వికెట్.. నోబాల్

ఈ క్రికెటర్ కు అయినా టెస్టుల్లో తొలి వికెట్ చాలా ప్రత్యేకం. ఆకాశ్ దీప్ కు అది ఫీల్డ్ లో అడుగుపెట్టిన కాసేపటికే దక్కింది. తన కళ్లు చెదిరే ఇన్‌స్వింగర్ తో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలి వికెట్ ఆనందాన్ని టీమ్మేట్స్ పంచుకుంటున్న సమయంలో అంపైర్ దానిని నోబాల్ గా ప్రకటించడంతో టీమంతా ఉసూరుమంది.

అయితే ఆ షాక్ నుంచి ఆకాశ్ దీప్ త్వరగానే కోలుకున్నాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్లో అతనికి తొలి వికెట్ దక్కింది. ఈసారి మరో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (11)ను ఆకాశ్ ఔట్ చేశాడు. ఆ ఓవర్ రెండో బంతికి వికెట్ కీపర్ ధృవ్ జురెల్ కు క్యాచ్ ఇచ్చి డకెట్ ఔటయ్యాడు. ఇక అదే ఓవర్ నాలుగో బంతికి డేంజరస్ బ్యాటర్ ఓలీ పోప్ (0)ను కూడా ఆకాశ్ ఔట్ చేశాడు.

పోప్ వికెట్ల ముందుకు దొరికిపోయాడు. మొదట అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. కానీ ఇండియా రివ్యూ తీసుకోవడంతో బంతి మిడిల్ స్టంప్ పైన తగులుతున్నట్లు తేలింది. దీంతో పోప్ 2 బంతులకే డకౌట్ గా వెనుదిరిగాడు. తన తర్వాతి ఓవర్లో జాక్ క్రాలీ (42)ని కూడా ఆకాశ్ దీప్ పెవిలియన్ కు పంపించాడు. మొదట ఔట్ చేసినప్పుడు నోబాల్ కాగా.. ఈసారి ఆ తప్పు చేయలేదు.

మొదటిసారిలాగే ఈసారి కూడా క్రాలీని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో తొలి సెషన్ లోనే ఆకాశ్ దీప్ మూడు వికెట్లు తీసినట్లయింది. ఇంగ్లండ్ తన తొలి మూడు వికెట్లనూ అతనికే సమర్పించుకుంది. తన స్పీడుతో ఆకాశ్ అదరగొట్టాడు. బజ్‌బాల్ తో అతన్ని భయపెట్టాలని ఇంగ్లండ్ బ్యాటర్లు చూసినా.. ఆకాశ్ మాత్రం బెదరలేదు. ఈ మ్యాచ్ కు బుమ్రా లేకపోవడంతో ఆకాశ్ దీప్ కు అరంగేట్రం చేసే అవకాశం దక్కింది.

లంచ్‌లోపే 5 వికెట్లు

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి సెషన్ లోనే 5 వికెట్లు కోల్పోయింది. ఆకాశ్ దీప్ 3 వికెట్లు తీయగా.. జడేజా, అశ్విన్ చెరొక వికెట్ తీసుకున్నారు. రాంచీ పిచ్ తొలి రోజు తొలి సెషన్ లోనే అస్థిరమైన బౌన్స్ తో బ్యాటర్లను పరీక్షించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో క్రాలీ 42 రన్స్ చేయగా బెయిర్‌స్టో 38 రన్స్ చేశారు. పోప్ (0), స్టోక్స్ (3) ఫెయిలయ్యారు.

Whats_app_banner