IND vs ENG Test Series: ఇంగ్లండ్‌కు షాక్ - టెస్ట్ సిరీస్ మధ్యలోనే ఇంటికెళ్లిపోయిన స్పిన్నర్ రెహాన్ అహ్మద్
IND vs ENG Test Series: ఇండియాతో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు షాక్ తిగిలింది. ఇంగ్లండ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ సిరీస్ మధ్యలో నుంచి వైదొలిగాడు. కుటుంబ సమస్యల కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు.
IND vs ENG Test Series: ఇంగ్లండ్‌కు షాక్ తగిలింది. లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ సిరీస్ మధ్యలోనే వైదొలిగాడు. కుటుంబసమస్యల కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. అందుకే అతడి పేరును నాలుగో టెస్ట్ కోసం పరిగణనలోకి తీసుకోన్నట్లు తెలిసింది. రెహాన్ తిరిగి ఇండియా రావడం లేదని సమాచారం.
నో రీప్లేస్‌మెంట్...
రెహాన్ అహ్మద్‌కు నాలుగో టెస్ట్‌లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. షోయబ్ బషీర్ స్థానంలో రెహాన్‌ను తీసుకోవాలని ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెట్ భావించింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఇండియాను వదలిపెట్టాల్సివచ్చినట్లు తెలిసింది. శుక్రవారం అతడు ఇంగ్లండ్ బయలుదేరినట్లు సమాచారం. రెహాన్ స్థానంలో మరో క్రికెటర్ ఎవరిని ఇంగ్లండ్ బోర్డ్ సెలెక్ట్ చేయడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. పధ్నాలుగు మందితోనే ఇండియా టూర్‌ను ముగించేయాలని ఇంగ్లండ్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే రెండు ఓటములతో డీలా పడ్డా ఇంగ్లండ్ టీమ్‌కు రెహాన్ దూరమవ్వడంతో మరో షాక్ తగిలింది.
రాజ్‌కోట్ టెస్ట్‌లో...
2022 డిసెంబర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్‌తో రెహాన్ అహ్మద్ ఇంగ్లండ్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్ తరఫున నాలుగు టెస్ట్‌లు ఆడిన రెహాన్ 18 వికెట్లు తీసుకున్నాడు. ఆరు వన్డేలు, ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 10, టీ20లో 9 వికెట్లు తీశాడు. రాజ్‌కోట్ టెస్ట్‌లో రెహాన్ తొలి ఇన్నింగ్స్‌లో 2, రెండో ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ తీశాడు.
గాయాల బెడద...
ఇండియా, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో గాయాలు, వ్యక్తిగత సమస్యలతో చాలా మంది క్రికెటర్లు దూరమయ్యారు. కొడుకు పుట్టడంతో కోహ్లి ఈ సిరీస్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీతో మూడో టెస్ట్ జరుగుతోండగా మధ్యలోనే అశ్విన్ వైదొలిగాడు. నాలుగో టెస్ట్ కోసం తిరిగి జట్టులో చేరాడు. గాయాలతో రాహుల్, శ్రేయస్ అయ్యర్ టెస్ట్ సిరీస్ దూరంగా ఉండాల్సి వచ్చింది.
టీమిండియా ఆధిక్యం...
మొత్తం ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ప్రస్తుతం ఇండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపొందింది. ఆ తర్వాత వైజాగ్, రాజ్‌కోట్ టెస్ట్‌లలో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, రోహిత్‌శర్మ. గిల్, బౌలింగ్‌లో బుమ్రా, అశ్విన్ రాణిస్తూ టీమిండియాకు విజయాల్ని అందించారు.
అక్షదీప్ ఎంట్రీ...
నాలుగో టెస్ట్ రాంచీ వేదికగా శుక్రవారం మొదలైంది. ఈ నాలుగో టెస్ట్‌కు బుమ్రా దూరమయ్యాడు. అతడి స్థానంలో అక్షదీప్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి అదరగొట్టాడు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ వంద పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.