SRH vs MI: హైదరాబాద్, ముంబై ధనాధన్ మ్యాచ్‍లో బద్దలైన ముఖ్యమైన 6 రికార్డులు ఇవే.. పరుగుల నుంచి సిక్స్‌ల వరకు..-6 key records created during sunrisers hyderabad vs mumbai indians match in ipl 2024 srh vs mi ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Srh Vs Mi: హైదరాబాద్, ముంబై ధనాధన్ మ్యాచ్‍లో బద్దలైన ముఖ్యమైన 6 రికార్డులు ఇవే.. పరుగుల నుంచి సిక్స్‌ల వరకు..

SRH vs MI: హైదరాబాద్, ముంబై ధనాధన్ మ్యాచ్‍లో బద్దలైన ముఖ్యమైన 6 రికార్డులు ఇవే.. పరుగుల నుంచి సిక్స్‌ల వరకు..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 28, 2024 08:14 AM IST

SRH vs MI Match Records - IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‍లో రికార్డుల మోత మోగింది. ఈ హైస్కోరింగ్ గేమ్‍లో చాలా రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఈ మ్యాచ్‍లో బద్దలైన 6 రికార్డులు ముఖ్యమైన రికార్డులు ఇక్కడ చూడండి.

SRH vs MI: హైదరాబాద్, ముంబై ధనాధన్ మ్యాచ్‍లో బద్దలైన ముఖ్యమైన 6 రికార్డులు ఇవే.. పరుగుల నుంచి సిక్స్‌ల వరకు..
SRH vs MI: హైదరాబాద్, ముంబై ధనాధన్ మ్యాచ్‍లో బద్దలైన ముఖ్యమైన 6 రికార్డులు ఇవే.. పరుగుల నుంచి సిక్స్‌ల వరకు.. (AFP)

IPL 2024 SRH vs MI Match: ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‍ చరిత్రలో నిలిచిపోయింది. బ్యాటర్ల ధనాధన్ హిట్టింగ్‍తో పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‍లో పలు రికార్డులు బద్దలయ్యాయి. హైదరాబాద్‍లోనే ఉప్పల్ స్టేడియంలో బుధవారం (మార్చి 27) జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‍లో ఎస్‍ఆర్‌హెచ్ 31 పరుగుల తేడాతో గెలిచింది. ఈ పోరులో చాలా రికార్డులు క్రియేట్ అయ్యాయి.

సన్‍రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్ 24 బంతుల్లోనే 62 పరుగులతో దుమ్మురేపే ఆరంభం అందిస్తే.. అభిషేక్ శర్మ 23 బంతుల్లోనే 63 పరుగులతో రెచ్చిపోయాడు. ఈ ఇద్దరూ భారీ హిట్టింగ్‍తో పరుగుల వరద పారించారు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లోనే అజేయంగా 80 పరుగులు చేసి వీరబాదడు బాదేశారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఏకంగా రికార్డు స్థాయిలో 3 వికెట్లకు 277 రన్స్ చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ కూడా రాణించింది. తిలక్ వర్మ (64), ఇషాన్ కిషన్ (34), రోహిత్ శర్మ (26), నమన్‍ధీర్ (30), టిమ్ డేవిడ్ (42 నాటౌట్) అదగొట్టారు. అయినా, ముంబై గెలువలేకపోయింది. అయితే, పరుగుల సునామీ వచ్చిన ఈ మ్యాచ్‍లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. ఆ వివరాలివే..

అత్యధిక టీమ్ స్కోర్

ఐపీఎల్ చరిత్రలో ఓ మ్యాచ్‍లో అత్యధిక స్కోరు రికార్డును సన్‍రైజర్స్ హైదరాబాద్ బద్దలుకొట్టింది. 2013 సీజన్‍లో పుణెపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేసిన 5 వికెట్లకు 263 పరుగులు ఇప్పటి వరకు ఐపీఎల్‍లో హైయెస్ట్ స్కోరుగా ఉండేది. అయితే, ఈ మ్యాచ్‍లో 277 రన్స్ చేసి.. దాన్ని హైదరాబాద్ బద్దలుకొట్టి.. చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‍లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా రికార్డును తన పేరిట లిఖించుకుంది.

టీ20ల్లో ఓ మ్యాచ్‍లో అత్యధిక స్కోరు

ఐపీఎల్‍లోనే కాకుండా టీ20 ఫార్మాట్‍లోనే ఓ మ్యాచ్‍లో అత్యధిక పరుగులు నమోదైన రికార్డు కూడా ఈ మ్యాచ్‍కే దక్కింది. ఈ మ్యాచ్‍లో రెండు జట్లు కలిపి 523 పరుగులు చేశాయి. గతంలో ఈ రికార్డు 2023లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‍ (517 రన్స్)కు ఉండేది.

అత్యధిక సిక్సర్లు

ఓ టీ20 మ్యాచ్‍లో అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా నమోదైంది. హైదరాబాద్, ముంబై మధ్య జరిగిన ఈ పోరులో రెండు జట్ల బ్యాటర్లు కలిపి ఏకంగా 38 సిక్స్‌లు బాదేశారు.

‘500’ తొలిసారి

ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్‍లో 500 పరుగులు నమోదవడం ఇదే తొలిసారి. 2010లో చెన్నై, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‍లో 469 పరుగులు రాగా.. దాన్ని హైదరాబాద్, ముంబై బ్రేక్ చేసేశాయి.

ఛేజింగ్‍లో అత్యధికం

ఐపీఎల్ చరిత్రలో లక్ష్యఛేదనలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ముంబై రికార్డు సృష్టించింది. 246 పరుగులకు 5 వికెట్లు చేసినా.. ఆ జట్టుకు ఓటమి ఎదురైంది. ఈ రికార్డు గతంలో రాజస్థాన్ రాయల్స్ (223/5) పేరిట ఉండేది.

అర్ధ శతకాల్లో..

ఈ మ్యాచ్‍తోనే తొలిసారి ఎస్‍ఆర్‌హెచ్ బ్యాటర్ 20 బంతుల్లోగానే అర్ధ శకతం చేశారు. ముంబైతో జరిగిన ఈ మ్యాచ్‍లో ట్రావిస్ హెడ్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ చేరాడు. కాసేపటికే అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే అర్ధ శతకానికి చేరాడు. దీంతో ఎస్‍ఆర్‌హెచ్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు నమోదు చేశాడు. ఒకే ఐపీఎల్ మ్యాచ్‍లో 20 బంతుల్లోగా ఓ జోడీ అర్ధ శతకాలు పూర్తి చేయడం ఇదే తొలిసారి.

Whats_app_banner