Jio down : దేశవ్యాప్తంగా నిలిచిపోయిన జియో సేవలు- యూజర్ల ఆగ్రహం!-jio users across india report network outage ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jio Down : దేశవ్యాప్తంగా నిలిచిపోయిన జియో సేవలు- యూజర్ల ఆగ్రహం!

Jio down : దేశవ్యాప్తంగా నిలిచిపోయిన జియో సేవలు- యూజర్ల ఆగ్రహం!

Sharath Chitturi HT Telugu
Sep 17, 2024 01:27 PM IST

Jio down today : సెప్టెంబర్​ 17న దేశవ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ఎక్స్​లో #jiodown హ్యాష్​ట్యాగ్​ ట్రెండింగ్​లోకి వచ్చింది.

దేశవ్యాప్తంగా జియో సేవలు డౌన్​..
దేశవ్యాప్తంగా జియో సేవలు డౌన్​.. (Photographer: Dhiraj Singh / Bloomberg )

దేశవ్యాప్తంగా రిలయన్స్​ జియో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. జియో యూజర్లు.. సోషల్​ మీడియా వేదికగా సర్వీస్​ పనిచేయడం లేదని మంగళవారం పోస్ట్​లు చేయడం మొదలుపెట్టారు. ఫలితంగా #jiodown హ్యాష్​ట్యాగ్​ ఎక్స్​లో ట్రెడింగ్​లోకి వచ్చింది.

ట్రాకింగ్ వెబ్​సైట్​ “డౌన్ డిటెక్టర్” సైతం మధ్యాహ్నం సమయంలో జియో సేవలు పనిచేయట్లేదని గుర్తించింది.

డౌన్ డిటెక్టర్ ప్రకారం.. సెప్టెంబర్ 17, 2024 మధ్యాహ్నం 12.18 గంటల నాటికి జియో వినియోగదారుల నుంచి 10,367 నెట్వర్క్ ఇష్యూకి సంబంధించిన నివేదికలు ఉన్నాయి. ఉదయం 11.13 గంటలతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ!

వీటిల్లో 68 శాతం నివేదికలు 'నో సిగ్నల్'కు సంబంధించినవి కాగా, 18 శాతం మొబైల్ ఇంటర్నెట్​కి సంబంధించినవి, 14 శాతం జియో ఫైబర్​కి సంబంధించినవి ఉన్నాయి.

ఇతర టెల్కో నెట్వర్క్​లు ఎయిర్​టెల్​, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ యథావిధిగా పనిచేస్తున్నట్లు డౌన్ డిటెక్టర్ డేటా తెలిపింది.

వాస్తవానికి దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్​ జియో సేవలకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. దీనిపై దృష్టిపెట్టాలని వినియోగదారులు చెబుతున్నారు.

“నా స్మార్ట్​ఫోన్​లో రెండూ జియో సిమ్ములే ఉన్నాయి,” అని మరొకరు వెల్లడించారు.

నెటిజన్ల ఆగ్రహం..

పలువురు యూజర్లు మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫామ్ ఎక్స్​లో ఈ సమస్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తాము కాల్స్ చేయలేకపోతున్నామని చెప్పగా, మరికొందరు తమ జియో నంబర్ల నుంచి మెసేజ్​లు పంపడం/రిసీవ్ చేసుకోవడం జరగట్లేదని అన్నారు. ఇంకొందరు వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్​ను ఉపయోగించలేకపోతున్నామని ఫిర్యాదు చేశారు.

""జియో నెట్ వర్క్ అంతరాయాన్ని చూసి, వొడాఫోన్ మరియు ఎయిర్​టెల్ వినియోగదారులు నవ్వుతున్నారు #jiodown," అని ఒకరు కామెంట్​ చేశారు.

"ముకేశ్ అంబానీ నారజ్ హై (ముకేశ్​ అంబానీ కోపంగా ఉన్నారు) #JioDown #JioOutage," అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు.

“ఈ మధ్య కాలంలో జియోలో సమస్యలు పెరిగిపోతున్నాయి,” అని మరొకరు అభిప్రాయపడ్డారు.

“ఫోన్​లో జియో సిమ్​ ఉంది. ఇంట్లో జియో ఫైబర్​ ఉంది. ఏదీ పనిచేయడం లేదు,” అని మరొకరు చెప్పుకొచ్చారు.

రూ.2799 ధరతో జియో 4జీ ఫోన్ లాంచ్..

మరోవైపు.. జియో సంస్థ ఇటీవలే ఒక కొత్త 4జీ ఫోన్​ని లాంచ్​ చేసింది. దీని పేరు జియోఫోన్​ ప్రైమా 2 4జీ. గత ఏడాది వచ్చిన జియోఫోన్ ప్రైమాకు ఇది అప్‌డేట్ వెర్షన్. ఈ లేటెస్ట్ ఫోన్‌లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ ఉన్నాయి. జియోఫోన్ ప్రైమా 2 4జీ వెనుక భాగంలో లెదర్ లాంటి ఫినిషింగ్‌తో సరికొత్త కర్వ్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. దీని ధర కేవలం రూ. 2799. ఇది ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్ అమెజాన్​లో అందుబాటులో ఉంది. త్వరలో జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్‌తో పాటు ఇతర రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను అందించే కై-ఓఎస్ ప్లాట్ ఫామ్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియోసావన్, ఇంకా అనేక ఇతర ఎంటర్టైన్మెంట్ యాప్స్ ఉన్నాయి. జియోచాట్ కోసం రియర్ అండ్ సెల్ఫీ కెమెరా, యాప్ లేకుండా వీడియో కాలింగ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం