JioPhone Prima 2 4G Launched : రూ.2799 ధరతో జియో 4జీ ఫోన్ లాంచ్.. ఇందులో గతంలో లేనన్ని ఫీచర్లు
JioPhone Prima 2 4G Launched : జియో తన నూతన స్మార్ట్ ఫోన్ జియోఫోన్ ప్రైమా 2 4జీని భారత్‌లో లాంచ్ చేసింది. యూట్యూబ్, ఫేస్‌బుక్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను అందించే కై-ఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
వినియోగదారులను ఆకట్టుకునేందుకు జియోఫోన్ ప్రైమా 2 4జీ అనే కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదలైంది. గత ఏడాది వచ్చిన జియోఫోన్ ప్రైమాకు ఇది అప్‌డేట్ వెర్షన్. ఈ లేటెస్ట్ ఫోన్‌లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ ఉన్నాయి. జియోఫోన్ ప్రైమా 2 4జీ వెనుక భాగంలో లెదర్ లాంటి ఫినిషింగ్‌తో సరికొత్త కర్వ్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఫోన్ గురించి వివరాలు తెలుసుకోండి..
జియోఫోన్ ప్రైమా 2 4జీ ధర
జియోఫోన్ ప్రైమా 2 లక్స్ బ్లూ కలర్‌లో పరిచయం చేశారు. ఈ ఫోన్ ధరను రూ.2799గా నిర్ణయించారు. ఇది ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్ అమెజాన్లో అందుబాటులో ఉంది. త్వరలో జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్‌తో పాటు ఇతర రిటైల్ స్టోర్లలో లభిస్తుంది.
జియోఫోన్ ప్రైమా 2 4జీ ఫీచర్లు
యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను అందించే కై-ఓఎస్ ప్లాట్ ఫామ్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియోసావన్, ఇంకా అనేక ఇతర ఎంటర్టైన్మెంట్ యాప్స్ ఉన్నాయి. జియోచాట్ కోసం రియర్ అండ్ సెల్ఫీ కెమెరా, యాప్ లేకుండా వీడియో కాలింగ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.
జియోపే, సౌండ్ అలర్ట్ సదుపాయంతో యూపీఐ, స్కాన్ క్యూఆర్ పేమెంట్ ఆప్షన్ కూడా ఈ ఫోన్లో ఉంది. జియో ఫోన్లో 2000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌లో వినోదం కోసం ఎఫ్ఎం రేడియో కూడా ఉంది. ఈ ఫోన్ 23 భాషలను సపోర్ట్ చేస్తుంది.
కెమెరా కూడా
320×240 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 2.4 అంగుళాల క్యూవీజీఏ కర్వ్డ్ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఈ ఫోన్‌లో ఎల్ఈడీ టార్చ్, రియర్ కెమెరా కూడా ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 0.3 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. జియో లేటెస్ట్ ఫోన్ 512 ఎంబీ ర్యామ్‌ను కలిగి ఉంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 128 జీబీ వరకు మెమరీని పెంచుకోవచ్చు. రౌండ్ ఎడ్జ్ డిజైన్ ఉన్న ఈ ఫోన్ ఏఆర్ ఎం కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.