HMD Crest smart phones: భారత్ లో హెచ్ఎండీ క్రెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్: ధర ఎంతంటే?-hmd crest hmd crest max phones launched in india check design specifications price and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hmd Crest Smart Phones: భారత్ లో హెచ్ఎండీ క్రెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్: ధర ఎంతంటే?

HMD Crest smart phones: భారత్ లో హెచ్ఎండీ క్రెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్: ధర ఎంతంటే?

HT Telugu Desk HT Telugu
Jul 27, 2024 10:12 PM IST

హ్యూమన్ మొబైల్ డివైజెస్ (HMD) కొత్తగా హెచ్ఎండీ క్రెస్ట్, హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లను భారతదేశంలో విడుదల చేసింది. అందుబాటు ధరలో, అడ్వాన్స్డ్ ఫీచర్లతో వీటిని వినియోగదారులకు అందిస్తున్నామని హెచ్ఎండీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్స్ ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఇక్కడ తెలుసుకోండి.

భారత్ లో హెచ్ఎండీ క్రెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్
భారత్ లో హెచ్ఎండీ క్రెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ (HMD)

హ్యూమన్ మొబైల్ డివైజెస్ (HMD) తన మొదటి సిరీస్ స్మార్ట్ఫోన్లు అయిన హెచ్ఎండీ క్రెస్ట్ (HMD Crest), హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ (HMD Crest Max) లను భారతదేశంలో విడుదల చేసింది. హెచ్ఎండీ ఫిన్ లాండ్ కు చెందిన స్మార్ట్ డివైజెస్ తయారీ సంస్థ. హెచ్ఎండీ క్రెస్ట్, హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ లను భారతదేశంలోనే తయారు చేస్తోంది. ఇప్పుడు భారత్ లో తయారైన హెచ్ఎండీ క్రెస్ట్, హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ లను ఇతర దేశాలకు ఎగుమతి చేయనుంది. తాజా హెచ్ఎండీ ఫోన్లు రిపేరబుల్ బ్యాక్ కవర్, బ్యాటరీ, ఛార్జింగ్ పోర్ట్ తో వస్తున్నాయి.

హెచ్ఎండీ క్రెస్ట్ వివరాలు

హెచ్ఎండీ క్రెస్ట్ (HMD Crest) లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది.ఉంది. బేసిక్ హెచ్ఎండీ క్రెస్ట్ మోడల్ లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ రియర్ లెన్స్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. హెచ్ ఎండి క్రెస్ట్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. స్మార్ట్ ఫోన్ తో పాటు బాక్స్ లోపల 33 వాట్ ఛార్జర్ ఉంటుంది. హెచ్ఎండీ క్రెస్ట్ లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంటాయి. ఇందులో యూనిసోక్ టి 760 ప్రాసెసర్ ను అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. ఈ (HMD Crest) ఫోన్ రెండేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో వస్తుంది. హెచ్ఎండీ క్రెస్ట్ రాబోయే అమెజాన్ ఫ్రీడమ్ సేల్ లో అందుబాటులో ఉంటుంది. అలాగే, హెచ్ఎండీ వెబ్సైట్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. హెచ్ఎండీ క్రెస్ట్ ను రూ.14,499కు కొనుగోలు చేయవచ్చు.

హెచ్ ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ వివరాలు

హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ (HMD Crest Max) లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ఓఎల్ ఈడీ డిస్ ప్లే ఉంటుంది. హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ వెనుకవైపు 5 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ తో 64 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. బాక్స్ లో ఫోన్ తో పాటు 33 వాట్ ఛార్జర్ కూడా వస్తుంది. హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంటుంది. HMD Crest Max లో యూనిసోక్ టీ760 చిప్ సెట్ ను అమర్చారు. లభిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ రెండేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో వస్తుంది. హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ రూ.16,499 లకు త్వరలో ప్రారంభం కాబోయే అమెజాన్ (Amazon) ఫ్రీడమ్ సేల్ లో అందుబాటులో ఉంటుంది. అలాగే, హెచ్ఎండీ వెబ్సైట్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.

Whats_app_banner