Samsung Galaxy M35 5G: ఎక్సినోస్ 1380 చిప్ సెట్ తో శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ లాంచ్: ధర, స్పెసిఫికేషన్లు ఇవే..-samsung galaxy m35 5g launched in india with exynos 1380 chipset price specs ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy M35 5g: ఎక్సినోస్ 1380 చిప్ సెట్ తో శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ లాంచ్: ధర, స్పెసిఫికేషన్లు ఇవే..

Samsung Galaxy M35 5G: ఎక్సినోస్ 1380 చిప్ సెట్ తో శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ లాంచ్: ధర, స్పెసిఫికేషన్లు ఇవే..

HT Telugu Desk HT Telugu
Jul 17, 2024 08:40 PM IST

శాంసంగ్ నుంచి మరో 5 జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ స్మార్ట్ ఫోన్ లో 6.6 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఎక్సినోస్ 1380 చిప్సెట్, 8 జీబీ వరకు ర్యామ్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, డాల్బీ అట్మాస్ స్పీకర్లు వంటి ప్రత్యేకతలున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ లాంచ్
శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ లాంచ్ (Samsung)

Samsung Galaxy M35 5G launch: శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో బుధవారం కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ లాంచ్ చేసింది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ డివైజ్ నేటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా అత్యాధునిక ఫీచర్లు, అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్లతో వస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ స్పెసిఫికేషన్లు

శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ స్మార్ట్ ఫోన్ లో 6.6 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్ డీ+ రిజల్యూషన్ తో, ఆకట్టుకునే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో అద్భుతమైన విజువల్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇందులో శాంసంగ్ సొంత ఎక్సినోస్ 1380 చిప్ సెట్ ను అమర్చారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఇది లభిస్తుంది.

కెమెరా సెటప్

శాంసంగ్ గెలాక్సీ ఎం 35 5 జీ లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ముందువైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇమేజింగ్ నైపుణ్యానికి మించి, ఈ స్మార్ట్ ఫోన్ డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లతో వస్తుంది. ఇది అద్భుతమైన ఆడియో క్వాలిటీని అందిస్తుంది. 5 జీ కనెక్టివిటీతో పాటు వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ ఆధారిత ట్యాప్ & పే ఫంక్షనాలిటీ వంటి ఇతర కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

నాక్స్ సెక్యూరిటీ ప్లాట్ ఫామ్

వినియోగదారుల డేటా సంరక్షణ కోసం శాంసంగ్ తన నమ్మకమైన నాక్స్ సెక్యూరిటీ ప్లాట్ ఫామ్ ను గెలాక్సీ ఎం 35 5 జీ (Samsung Galaxy M35 5G) లో పొందుపర్చింది. అలాగే, ఇందులో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంటుంది. డేబ్రేక్ బ్లూ, మూన్ లైట్ బ్లూ, థండర్ గ్రే వంటి ఆకర్షణీయమైన రంగుల్లో గెలాక్సీ ఎం35 5జీ లభిస్తుంది. రూ.15,999 ప్రారంభ ధరతో ఈ స్మార్ట్ ఫోన్ వినియోగ దారులకు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫాం అమెజాన్ , శాంసంగ్ అధికారిక వెబ్ సైట్ , దేశ వ్యాప్తంగా ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇన్ స్టంట్ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆప్షన్స్ తో సహా ఆకర్షణీయమైన లాంచ్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు.

Whats_app_banner