Ambani wedding: అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా రిలయన్స్ ఉద్యోగులకు అందిన గిఫ్ట్ బాక్స్ లో ఏమున్నాయో తెలుసా..?-haldirams aloo bhujia sweets what reliance employees got for ambani wedding ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా రిలయన్స్ ఉద్యోగులకు అందిన గిఫ్ట్ బాక్స్ లో ఏమున్నాయో తెలుసా..?

Ambani wedding: అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా రిలయన్స్ ఉద్యోగులకు అందిన గిఫ్ట్ బాక్స్ లో ఏమున్నాయో తెలుసా..?

HT Telugu Desk HT Telugu
Jul 12, 2024 04:33 PM IST

Ambani wedding: తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం సందర్భంగా రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులందరికీ ముకేశ్ అంబానీ, నీతా అంబానీ ఒక గిఫ్ట్ బాక్స్ పంపించారు. ఆ బాక్స్ లో హల్దీరామ్ స్నాక్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. అలాగే, ఒక సిల్వర్ కాయిన్ ఉంది.

రిలయన్స్ ఉద్యోగులకు అందిన గిఫ్ట్ బాక్స్
రిలయన్స్ ఉద్యోగులకు అందిన గిఫ్ట్ బాక్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్ తో ఈ రోజు (జూలై 12) అంగరంగ వైభవంగా జరగనుంది. పెళ్లికి వచ్చిన అతిథులను ఫైవ్ స్టార్ హోటల్ బసలు, లగ్జరీ గిఫ్ట్ లతో రాయల్టీలా ట్రీట్ చేస్తుండగా, రిలయన్స్ ఉద్యోగులు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గిఫ్ట్ బాక్స్ ను కూడా అందుకున్నారు.

yearly horoscope entry point

సోషల్ మీడియాలో గిఫ్ట్ బాక్స్ ఫొటోలు

జూలై 12 న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్ కు ముందు తమకు వచ్చిన గిఫ్ట్ బాక్స్ ఫోటోలు, వీడియోలను పలువురు రిలయన్స్ ఉద్యోగులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎరుపు రంగు గిఫ్ట్ బాక్స్ లో "మా దేవతలు, దేవుళ్ల దివ్య అనుగ్రహంతో, మేము అనంత్ మరియు రాధికల వివాహాన్ని జరుపుకుంటున్నాము . ఇట్లు మీ నీతా అంబానీ, ముకేష్ అంబానీ’’ అని బంగారు అక్షరాలు ఉన్నాయి. బాక్స్ లోపల హల్దీరామ్ నమ్కీన్ నాలుగు ప్యాకెట్లు, ఒక స్వీట్ బాక్స్, ఒక వెండి నాణెం ఉన్నాయి. నమ్కీన్ ప్యాకెట్లలో హల్దీరామ్ ఆలూ భుజియా సేవ్, లైట్ చివ్డా ఉన్నాయి.

ఉద్యోగుల స్పందన

రెడ్ గిఫ్ట్ బాక్స్ వీడియోను షేర్ చేసిన తాన్యా రాజ్ 'రిలయన్స్ లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది' అని రాశారు. నీతా అంబానీ, ముకేష్ అంబానీ (Mukesh ambani) తమ చిన్న కుమారుడి వివాహానికి ముందు 50 నిరుపేద జంటలకు సామూహిక వివాహాలను జరిపించారు. ఆ జంట అంబానీల నుంచి రూ.లక్ష చెక్కుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు, కిరాణా సామాగ్రి, ఇతర గృహోపకరణాలు అందుకున్నారు. మరోవైపు, పలువురు అతిథులు తమకు అందిన లగ్జరీ వెడ్డింగ్ ఇన్విటేషన్ విజువల్స్ ను షేర్ చేశారు. జులై 12న పెళ్లి, 15న రిసెప్షన్ జరగనుంది. ఆహ్వానంలో భాగంగా అతిథులకు వెండి "ట్రావెలింగ్ మందిరం", పష్మినా శాలువా తదితరాలు అందజేశారు.

ప్రి వెడ్డింగ్ వేడుకలు

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చిలో మూడు రోజుల పాటు గుజరాత్ లోని జామ్ నగర్ లో వైభవంగా జరిగాయి. ఆ ఉత్సవాల్లో పాప్ స్టార్ రిహానా, దిల్జిత్ దోసాంజ్ తదితరులు ప్రదర్శనలు ఇచ్చారు. జామ్ నగర్ లో జరిగిన ఈ వేడుకల అనంతరం లండన్ లో వధూవరుల స్నేహితులకు ప్రైవేట్ పార్టీలు జరిగాయి. తరువాత, జూన్ ప్రారంభంలో, అంబానీ కుటుంబం యూరోప్ లో లగ్జరీ క్రూయిజ్ ను పార్టీ నిర్వహించింది.

సంగీత్ హంగామా

గత వారంలో, అసలు వివాహానికి ముందు, అంబానీ కుటుంబం సంగీత్ (జస్టిన్ బీబర్ ప్రదర్శనతో), మామేరు వేడుక, గర్బా రాత్రి, హల్దీ, బుధవారం, శివ శక్తి పూజతో మెహందీ వేడుకను నిర్వహించింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం వీరి వివాహం జరగనుంది. రాబోయే రోజుల్లో కనీసం మూడు రౌండ్ల రిసెప్షన్ కు అంబానీలు ఆతిథ్యం ఇవ్వనున్నారు.

Whats_app_banner