తెలుగు న్యూస్ / ఫోటో /
Justin Bieber: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ నైట్ ఫొటోలు షేర్ చేసిన జస్టిన్ బీబర్
- Justin Bieber: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారిన కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్ ఆ ఫొటోలను షేర్ చేశాడు. ఇండియాలో గడిపిన ఆ రోజును అభిమానులతో పంచుకున్నాడు.
- Justin Bieber: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారిన కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్ ఆ ఫొటోలను షేర్ చేశాడు. ఇండియాలో గడిపిన ఆ రోజును అభిమానులతో పంచుకున్నాడు.
(1 / 9)
Justin Bieber: షెహనాజ్ గిల్, దిశా పటానీలాంటి సెలబ్రిటీలు కూడా ఈ క్షణాన్ని తమ ఫోన్లలో బంధించడానికి ప్రయత్నిస్తున్న ఫొటోను బీబర్ షేర్ చేశాడు.
(2 / 9)
Justin Bieber: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ లో జస్టిన్ బీబర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అతన్ని చూడటానికి ఆ వేడుకలో ఉన్న వాళ్లంతా ఎగబడ్డారు.
(3 / 9)
Justin Bieber: ఈ కెనడియన్ సింగర్.. బేబీ, పీచెస్, లవ్ యువర్సెల్ఫ్, సారీ లాంటి తన చార్ట్ బస్టర్లతో ఉర్రూతలూగించాడు.
(4 / 9)
Justin Bieber: అనంత్ అంబానీ సంగీత్ కోసం జస్టిన్ బీబర్ శుక్రవారం (జులై 5) ఉదయం భారత్ చేరుకున్నాడు.
(5 / 9)
Justin Bieber: ఒక ఫోటోలో, జస్టిన్ తన ప్రైవేట్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తన సహచరులతో మాట్లాడుతూ కనిపించాడు.
(6 / 9)
Justin Bieber: సంగీత్ వేడుకలో ప్రదర్శన ఇవ్వడానికి అంబానీ ఫ్యామిలీ.. జస్టిన్ బీబర్ కు ఏకంగా 10 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు తెలుస్తోంది.
(7 / 9)
Justin Bieber: జస్టిన్, అతని భార్య హెయిలీ తమ మొదటి ప్రెగ్నెన్సీ గురించి అనౌన్స్ చేసిన కొన్ని నెలల తర్వాత జస్టిన్ బీబర్ ప్రదర్శన ప్రాధాన్యత సంతరించుకుంది.
(8 / 9)
Justin Bieber: రెండుసార్లు గ్రామీ విజేతగా నిలిచిన అతడు.. చివరిసారిగా 2017లో తన తొలి కాన్సర్ట్ కోసం ఇండియాకు వచ్చాడు. 2022లో తన 'జస్టిస్ వరల్డ్ టూర్' ఇండియా షో కోసం తిరిగి రావాల్సి ఉండగా, ఆరోగ్య కారణాల రీత్యా రద్దు చేసుకున్నాడు.
ఇతర గ్యాలరీలు