Delhi liquor scam: ఈడీ విచారణకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గైర్హాజరు-ysr congress mp magunta reddy fails to appear before ed agency to issue fresh summons ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Ysr Congress Mp Magunta Reddy Fails To Appear Before Ed; Agency To Issue Fresh Summons

Delhi liquor scam: ఈడీ విచారణకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గైర్హాజరు

వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (HT_PRINT)

Delhi liquor scam: ఒంగోలు ఎంపీ, వైఎస్సార్సీపీ నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Sreenivasulu Reddy) శనివారం ఈడీ విచారణకు హాజరు కాలేదు.

Delhi liquor scam: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఆర్థిక అక్రమలకు సంబంధించిన కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (MP Magunta Sreenivasulu Reddy) శనివారం ఉదయం 11 గంటలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate ED) విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, సమీప బంధువు ఆరోగ్యం బాగా లేనందున, అతడిని పరామర్శించడానికి చెన్నై వెళ్తున్నానని, అందువల్ల ఈ రోజు విచారణకు హాజరు కాలేనని మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈడీకి తన న్యాయవాది ద్వారా సమాచారం పంపించారు. దాంతో మరో సారి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ (ED) సమన్లు జారీ చేయనుంది.

ట్రెండింగ్ వార్తలు

Delhi liquor scam: అరుణ్ పిళ్లై తో కలిపి..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని (MP Magunta Sreenivasulu Reddy) ఇతర నిందితులైన అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramchandra Pillai) సహా సౌత్ గ్రూప్ మెంబర్స్ గా పేర్కొనే పలువురితో కలిపి ఒకేసారి విచారించాలని ఈడీ (ED) యోచిస్తోంది. ఇదే కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ (Raghav Magunta)ను ఈడీ ఫిబ్రవరి 11 న అరెస్ట్ చేసింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరికొందరితో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi liquor scam) లో కీలకంగా వ్యవహరించాడని ఈడీ విశ్వసిస్తోంది. ఈ గ్రూప్ ను సౌత్ గ్రూప్ గా పరిగణిస్తోంది.

Delhi liquor scam: కేజ్రీవాల్ తో భేటీ..

మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్వయంగా ఈ సౌత్ గ్రూప్ తో ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో లావాదేవీల గురించి వివరించాడని, ఈ మొత్తం వ్యవహారాన్ని తన కుమారుడు రాఘవ చూసుకుంటాడని హామీ ఇచ్చాడని ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. తాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (CM Kejriwal) తో స్వయంగా సమావేశమై, ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో అడుగుపెట్టనున్నట్లు చెప్పానని, దాన్ని ఆయన స్వాగతించారని, ఢిల్లీ ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాలా సహాయం అందుతుందని ఆ సౌత్ గ్రూప్ (SOUTH GROUP) సభ్యులకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి హామీ ఇచ్చారని ఈడీ పేర్కొంది.

Delhi liquor scam: సౌత్ గ్రూప్ లో ఎవరు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ గా పేర్కొంటున్న బృందంలో వైఎస్సార్సీపీ నేత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ, శరత్ రెడ్డి, కే కవిత, సమీర్ మహేంద్రు ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వంలోని సంబంధిత వ్యక్తులతో సంప్రదింపుల కోసం వీరికి అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబు ప్రతినిధులుగా వ్యవహరించారని ఈడీ ఆరోపిస్తోంది.

WhatsApp channel