Bheemili Beach : మనసు దోచేస్తున్న భీమిలి బీచ్- విశాఖలోని టూరిస్ట్ ప్రదేశాలివే!-visakhapatnam tourist places summer trip bheemili beach how to reach ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bheemili Beach : మనసు దోచేస్తున్న భీమిలి బీచ్- విశాఖలోని టూరిస్ట్ ప్రదేశాలివే!

Bheemili Beach : మనసు దోచేస్తున్న భీమిలి బీచ్- విశాఖలోని టూరిస్ట్ ప్రదేశాలివే!

Bandaru Satyaprasad HT Telugu
May 08, 2024 01:29 PM IST

Bheemili Beach : ఈ సమ్మర్ లో మీరు విశాఖ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే విశాఖలో చూడదగిన ప్రదేశాలు, బీచ్ ల గురించి మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా భీమిలి బీచ్ ను విజిట్ చేయడం మర్చిపోవద్దు.

విశాఖలోని టూరిస్ట్ ప్రదేశాలివే!
విశాఖలోని టూరిస్ట్ ప్రదేశాలివే!

Bheemili Beach : మీరు విశాఖలో ఉంటున్నా లేదా సమ్మర్ లో అలా విశాఖ ట్రిప్ వేసినా భీమిలి బీచ్ ను చూడడం మాత్రం మర్చిపోకండి. సాయంత్రం సమయంలో అలా బీచ్ లో కాసేపు గడిపితే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. బీచ్ లో నైట్ స్టే చేస్తే ఆ అనుభూతి మరింత అద్భుతంగా ఉంటుంది. భీమిలి లేదా భీమునిపట్నం వైజాగ్ సమీపంలోని ఒక ఫిషింగ్ గ్రామం. ఇది ఒకప్పటి డచ్ వాళ్ల సెటిల్మెంట్. భీమిలి బీచ్‌లు చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. సముద్రం వంపులో భీమిలి బీచ్ ఎంతో అందంగా కనిపిస్తుంది.

భీమిలి బీచ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో డచ్ స్థావరం, శిథిలమైన కోట, బెల్ ఆఫ్ ఆర్మ్స్, 17వ శతాబ్దానికి చెందిన డచ్ స్మశానవాటిక, హోలాండర్ అవశేషాలు చూడవచ్చు. మీరు బీచ్‌కి వెళ్లే దారిలో ఎర్ర మట్టి దిబ్బలు కనిపిస్తాయి. దీనిని 'ఎర్ర ఇసుక దిబ్బలు' అని పిలుస్తారు. ఎర్రమట్టి దిబ్బలను వారసత్వ ప్రదేశంగా రక్షిస్తున్నారు. భీమిలి బీచ్... బీచ్ రోడ్డుకు ఉత్తరం వైపున ప్రయాణ సమయంలో చూడడానికి ఉత్కంఠ భరితంగా కనిపిస్తుంది. బీచ్ లో వరుసగా కొబ్బరి, తాటి చెట్లు ఉంటాయి.

ఎలా చేరుకోవాలి

  • భీమిలికి సమీప విమానాశ్రయం విశాఖపట్నం, ఇక్కడి నుంచి భీమిలి 46 కి.మీ దూరంలో ఉంది.
  • భీమిలికి సమీప రైల్వే స్టేషన్ విశాఖపట్నం, ఇక్కడ నుంచి 32 కి.మీ దూరంలో భీమిలి ఉంది.
  • విశాఖపట్నం బస్టాండ్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ భీమిలికి అనేక బస్సులు ఉంటాయి.

విశాఖ సమీపంలోని టూరిస్ట్ ప్రదేశాలు

  • రుషికొండ బీచ్- ఇది ప్రశాంతతకు కేంద్రంగా చెబుతారు. ఈ బీచ్ లో రాళ్లు ఉంటాయి. సముద్రం శివారులో ఆ రాళ్లపై నిలబడి అలాల తాకిడిని ఎంజాయ్ చేయవచ్చు. దీనికి బ్లూ ప్లాగ్ బీచ్ గుర్తింపు లభించింది.
  • ఆర్కే బీచ్ - ఇది విశాఖ ప్రధాన నగరమంతటా విస్తరించి ఉంది. నగరానికి దగ్గరగా ఉండడంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
  • డాల్ఫిన్ నోస్ - ఇది ఒక పెద్ద కొండ, హెడ్‌ ల్యాండ్ డాల్ఫిన్ నోస్ ఆకారాన్ని కలిగి ఉండడంతో దీనికి ఆ పేరు వచ్చింది. దీని సమీపంలో లైట్ హౌస్ ఉంటుంది. విశాఖకు ఇది ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.
  • సబ్ మెరెన్ మ్యూజియం- ఆర్కే బీచ్ రోడ్‌లో కుర్సురా సబ్ మెరెన్ మ్యూజియం ఉంది. పర్యాటకులు దీని లోపలికి వెళ్లి చూడవచ్చు.
  • విశాఖ మ్యూజియం -ఆర్కే బీచ్ సమీపంలోని పాత డచ్ బంగ్లా, దీనిని కార్పొరేషన్ మ్యూజియం అని కూడా పిలుస్తారు.
  • కైలాసగిరి - కైలాసగిరిపై ఉన్న పార్క్ నుంచి విశాఖ నగర అద్భుతాలను వీక్షించవచ్చు. సిటీ మొత్తం కైలాసగిరి కొండపై నుంచి చూడవచ్చు.
  • సింహాచలం ఆలయం - విశాఖ నుంచి 16 కి.మీ దూరంలో సింహాచలం ఆలయం ఉంది. భక్తులు సింహాచలం లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకోవచ్చు.
  • యారాడ బీచ్ -విశాఖ నుంచి సుమారు 15 కి.మీ దూరంలో డాల్ఫిన్స్ నోస్‌కు సమీపంలో ఉన్న సుందరమైన యారాడ బీచ్ రోడ్ ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం