Trains Information : రైల్వే ప్రయాణికుల‌కు శుభ‌వార్త, నాలుగు రైళ్లకు అద‌న‌పు కోచ్ లు-visakhapatnam east coast railway add more coaches to nanded hirakud express trains ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Information : రైల్వే ప్రయాణికుల‌కు శుభ‌వార్త, నాలుగు రైళ్లకు అద‌న‌పు కోచ్ లు

Trains Information : రైల్వే ప్రయాణికుల‌కు శుభ‌వార్త, నాలుగు రైళ్లకు అద‌న‌పు కోచ్ లు

HT Telugu Desk HT Telugu
Aug 28, 2024 06:11 PM IST

Trains Information : రైలు ప్రయాణికులకు ఈస్ట్ కోస్టు రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ మార్గంలో నడిచే నాలుగు రైళ్ల స్లీపర్, ఏసీ కోచ్ లు పెంచింది. విశాఖ- అమృతసర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్, విశాఖ- నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కోచ్ లు పెంచినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

రైల్వే ప్రయాణికుల‌కు శుభ‌వార్త, నాలుగు రైళ్లకు అద‌న‌పు కోచ్ లు
రైల్వే ప్రయాణికుల‌కు శుభ‌వార్త, నాలుగు రైళ్లకు అద‌న‌పు కోచ్ లు

Trains Information : ప్రయాణికుల‌కు ఈస్ట్‌కోస్టు రైల్వే శుభ‌వార్త చెప్పింది. నాలుగు రైళ్లకు స్లీప‌ర్‌, ఏసీ కోచ్‌లు పెంచింది. ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే అదనపు స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లతో ముఖ్యమైన సుదూర రైళ్లకు పెంచాలని నిర్ణయించింది.

అద‌న‌పు స్లీప‌ర్‌, ఏసీ కోచ్‌లు పెంచిన రైళ్లు

విశాఖ‌ప‌ట్నంలో బ‌య‌లుదేరే విశాఖపట్నం- అమృతసర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20807) రైలు అదనపు స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లతో శాశ్వత ప్రాతిపదికన అమ‌లులోకి రానుంది. సెప్టెంబ‌ర్ 3 నుంచి ఈ కోచ్‌లు అందుబాటులోకి వస్తాయి.

అమృత్‌స‌ర్‌లో బ‌య‌లుదేరే అమృత్‌సర్-విశాఖపట్నం హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20808) రైలు అదనపు స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లతో శాశ్వత ప్రాతిపదికన అమ‌లులోకి రానుంది. సెప్టెంబ‌ర్ 7 నుంచి ఈ కోచ్‌లు అందుబాటులోకి వస్తాయి.

పెంచిన కోచ్‌ల‌తో హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సెకండ్ ఏసీ-1, థర్డ్ ఏసీ-4, థర్డ్ ఏసీ ఎకానమీ-1, స్లీపర్-7, జనరల్ సెకండ్ క్లాస్-4, సెకండ్ క్లాస్ లగేజీ కమ్ దివ్యాంగన్ కోచ్-1, ఏసీ ప్యాంట్రీ కార్-1, జనరేటర్ మోటార్ కార్-1 కోచ్‌లు ఉంటాయి.

విశాఖ‌ప‌ట్నంలో బ‌య‌లుదేరే విశాఖపట్నం- నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20811) రైలు అదనపు స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లతో శాశ్వత ప్రాతిపదికన అమ‌లులోకి రానుంది. సెప్టెంబ‌ర్ 3 నుంచి ఈ కోచ్‌లో అమలులోకి వస్తాయి.

నాందేడ్‌లో బ‌య‌లుదేరే నాందేడ్-విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20812) రైలు అదనపు స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లతో శాశ్వత ప్రాతిపదికన అమ‌లులోకి రానుంది. సెప్టెంబ‌ర్ 4 నుంచి ఈ కోచ్‌లో అమలులోకి వస్తాయి.

పెంచిన కోచ్‌ల‌తో ఈ సూప‌ర్ ఫాస్ట్ రైలుకు 2వ ఏసీ-1, 3వ ఏసీ-4, 3వ ఏసీ ఎకానీ-1, స్లీపర్-7, జనరల్ సెకండ్ క్లాస్-4, సెకండ్ క్లాస్ లగేజీ కమ్ దివ్యాంగన్ కోచ్-1, ఏసీ ప్యాంట్రీ కార్-1, జనరేటర్ మోటార్ కార్-1 కోచ్‌లు ఉంటాయి. ప్రజ‌లు ఈ సౌక‌ర్యాన్ని వినియోగించుకోవాల‌ని వాల్తేర్ డివిజ‌న్ సీనియ‌ర్ డివిజ‌న‌ల్ క‌మ‌ర్షియ‌ల్ మేనేజ‌ర్ కే. సందీప్ సూచించారు.

రైలు రద్దు

భారీ వర్షాల కారణంగా పశ్చిమ రైల్వేలోని వడోదర డివిజన్‌లోని బజావా-రానోలి మధ్య ఐటీఏ వంతెన వద్ద నీరు నిలిచిపోవడంతో పూరీ-గాంధీధామ్ రైలు రద్దు చేశారు. పూరీ నుంచి బ‌య‌లుదేరే పూరీ - గాంధీధామ్ వీక్లీ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (22974) రైలును ర‌ద్దు చేశారు. ఆగ‌స్టు 31న ఈ రైలు ర‌ద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజ‌న్ సీనియ‌ర్ డివిజ‌న‌ల్ క‌మ‌ర్షియ‌ల్ మేనేజ‌ర్ తెలిపారు.

జ‌గదీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం