Kendriya Vidyalaya : నకిలీ సర్టిఫికేట్లతో 193 మంది విద్యార్థులకు అడ్మిషన్లు, వాల్తేరు కేవీ ప్రిన్సిపల్ పై సీబీఐ కేసు-visakhapatnam cbi filed case on waltair kendriya vidyalaya principal admission to students with fake certificates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kendriya Vidyalaya : నకిలీ సర్టిఫికేట్లతో 193 మంది విద్యార్థులకు అడ్మిషన్లు, వాల్తేరు కేవీ ప్రిన్సిపల్ పై సీబీఐ కేసు

Kendriya Vidyalaya : నకిలీ సర్టిఫికేట్లతో 193 మంది విద్యార్థులకు అడ్మిషన్లు, వాల్తేరు కేవీ ప్రిన్సిపల్ పై సీబీఐ కేసు

Bandaru Satyaprasad HT Telugu
Sep 21, 2023 08:41 PM IST

Waltair Kendriya Vidyalaya : వాల్తేరు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. నకిలీ సర్టిఫికేట్లతో అర్హత లేదని విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయలో ప్రవేశాలు కల్పించారు. ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది.

వాల్తేరు కేంద్రీయ విద్యాలయ
వాల్తేరు కేంద్రీయ విద్యాలయ

Waltair Kendriya Vidyalaya : నకిలీ ధ్రువపత్రాలతో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించినందుకు విశాఖపట్నంలోని వాల్తేరు కేంద్రీయ విద్యాలయ పాఠశాల ప్రిన్సిపల్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసు నమోదు చేసింది. ఈ మేరకు సీబీఐ అధికారులు గురువారం కేసు వివరాలను వివరించారు. వాల్తేరులోని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస రాజా అనే వ్యక్తి గత రెండేళ్లలో పలువురు విద్యార్థులకు ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా అడ్మిషన్లు కల్పించాడు. ఇందుకోసం ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్దమొత్తంగా నగదు తీసుకున్నట్లు సీబీఐ తెలిపింది. వివిధ కేంద్ర విద్యాసంస్థల పేరుతో నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి 193 మంది విద్యార్థులకు వాల్తేరు కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో అక్రమంగా అడ్మిషన్లు కల్పించినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.

193 మంది విద్యార్థులకు అక్రమంగా ప్రవేశాలు

2022-23లో 69 మంది విద్యార్థులకు, 2021-22లో 124 మొత్తంగా 193 మందికి నకిలీ ధ్రువపత్రాలతో పాఠశాలలో ప్రవేశాలు కల్పించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది మే 3, 4 తేదీల్లో సీబీఐ అధికారులు వాల్తేరు కేంద్రీయ విద్యాలయ స్కూల్ లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ప్రిన్సిపల్‌ శ్రీనివాస రాజా ఫేక్ సర్టిఫికేట్లతో అర్హతలేని విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించినట్లు గుర్తించారు. ప్రిన్సిపల్ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన సీబీఐ అధికారులు... విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నగదు బదిలీ అయినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఈ విషయంపై ఆరా తీసిన సీబీఐ అధికారులు... ప్రిన్సిపల్ పై కేసు నమోదు చేసింది. కేంద్రీయ విద్యాలయ కమిషనర్‌ నుంచి అనుమతి పొందిన తీసుకున్న ప్రినిపల్ శ్రీనివాస రాజాపై తదుపరి చర్యలు తీసుకుంటామని సీబీఐ అధికారులు పేర్కొన్నారు.

Whats_app_banner