PM Vishwakarma Status : పీఎం విశ్వకర్మ పథకానికి అప్లై చేసుకున్నారా? అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!
PM Vishwakarma Status : ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకానికి దరఖాస్తుకున్నారా? అయితే మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఈ స్టేప్స్ ఫాలో అవ్వండి.
PM Vishwakarma Status : 18 రకాల వర్గాలకు చేతి వృత్తుల్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన(PM Vishwakarma Status ) పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి మూడు లక్షల బ్యాంకు రుణం(Bank Loan), రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తుంది. దీంతో పాటు రూ.15 వేల టూల్ కిట్ అందిస్తుంది. ఈ పథకం కింది తొలుత రూ. 13 వేల కోట్ల వ్యయంతో దాదాపు 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 1.06 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. వీటిల్లో 30 లక్షలకు పైగా స్టేజీ-1 వెరిఫికేషన్ పూర్తికాగా, స్టేజీ-2 కింద 12 లక్షలకు పైగా దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు తెలుస్తోంది. 4 లక్షలకు పైగా స్క్రీనింగ్ కమిటీ వెరిఫికేషన్ స్టేజీ-3 వెరిఫికేషన్ లో ఉన్నాయి.
అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి?
పీఎం విశ్వకర్మ యోజనలో దరఖాస్తు చేసుకున్న వారు తమ అప్లికేషన్ స్టేటస్ (PM Vishwakarma Status)ను సులభంగా చెక్ చేసుకోవచ్చు. మీ దరఖాస్తు ఏ స్టేజ్ లో ఉందో తెలుసుకోవచ్చు. దీంతో పాటు పీఎం విశ్వకర్మ అప్లికేషన్, ఐడీ కార్డు, సర్టిఫికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
- ముందుగా పీఎం విశ్వకర్మ అధికారిగా వెబ్ సైట్ పై క్లిక్ చేయండి (https://www.pmvishwakarmagov.com/)
- హోంపేజ్ లోని 'Login' ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇందులో 'అప్లికెంట్/బెనిఫియరీ లాగిన్' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత అప్లికెంట్ ఫోన్ నెంబర్ తో లాగిన్ అవ్వండి.
- అనంతరం దరఖాస్తు దారుడి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
- అప్లికేషన్ ఎడిట్ లో లోన్ కు సంబంధించిన వివరాలు ఎడిట్ చేసుకోవచ్చు.
ఈ పథకానికి అర్హులెవరు
ఈ పథకానికి ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన 18 రకాల కులస్తులు అర్హులు. ముఖ్యంగా సంప్రదాయ కులవృత్తులైన వడ్రంగి, బంగారు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు, శిల్పాలు విగ్రహాలు తయారు చేసే వారు, బుట్టలు, చాపలు, మట్టి పాత్రలు తయారు చేసే కుమ్మరి వారు, చీపుర్లు తయారీదారులు, దోబీ, టైలర్, చేప వలను తయారు చేసేవాళ్లు, చెప్పులు కుట్టేవారు, తాపీ కార్మికులు, క్షురకులు, సంప్రదాయ బొమ్మలు,పూల దండలు, రజకులు పడవల తయారీదారులు, ఇంటి తాళాలు తయారీదారులు అర్హులు.
దరఖాస్తు ఎలా?
- అర్హులైన వాళ్లు ధ్రువపత్రాలతో మీసేవా(MeeSeva) , సీఎస్సీ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తుదారులు ఆధార్(Aadhaar), రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్ పుస్తకం వెంట తీసుకెళ్లాలి.
- ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- ఇంతకు ముందు ఎలాంటి రుణాలు తీసుకుని ఉండకూడదు. ఇంటిలో ఒకరు మాత్రమే అర్హులు. ఇంటిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే పథకానికి అనర్హులు.
- దరఖాస్తు చేసుకున్నాక మూడు దశల్లో స్క్రీనింగ్ చేసి ఎంపిక చేస్తారు. అర్హత పొందిన వారికి 15 రోజుల శిక్షణ ఉంటుంది. శిక్షణలో రోజుకు 500 రూపాయలు ఉపకార వేతనం అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికెట్ అందజేస్తారు.
- కులవృత్తుల వారికి పనిముట్లు (టూల్స్) కొనుక్కునేందుకు రూ.15,000 రూపాయలు అందిస్తారు.
- తొలివిడతగా 5 శాతం వడ్డీతో లక్ష రూపాయలు అందిస్తారు. ఈ రుణాన్ని 18 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రెండో దశలో రెండు లక్షల రూపాయలను అందిస్తారు. మీరు తీసుకున్న రుణాన్ని 30 నెలలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం