TS Govt Meeseva Centres : మీసేవా సెంటర్ ఖాళీలు - భర్తీకి నోటిఫికేషన్ జారీ, అర్హతలు, కావాల్సిన పత్రాలివే
Meeseva Centres in Telangana : మీసేవా సెంటర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు నారాయణపేట జిల్లాలోని ఈ- గవర్నెన్స్ సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. దరఖాస్తు ఫారమ్ ను కూడా అందుబాటులో ఉంచింది.
Meeseva Centres in Telangana : మీ సేవా సెంటర్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారా…? అయితే నారాయణపేట జిల్లాలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 20 ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదలైంది. రాతపరీక్ష, ఇంటర్వూ ఆధారంగా…. ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఫిబ్రవరి 14,2024వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ముఖ్య వివరాలు:
ప్రకటన - ఈ- గవర్నెన్స్ సొసైటీ, నారాయణపేట జిల్లా.
సెంటర్లు - మీసేవా.
మొత్తం ఖాళీలు - 20 మీసేవా సెంటర్లు.
అర్హతలు - డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ - రాతపరీక్ష, ఇంటర్వూ ఉంటుంది.
మొత్తం మార్కులు - 100( 90 మార్కులు - ప్రశ్నలు, విద్యా అర్హతలు, సాంకేతిక ధ్రువపత్రాలు -05,ఇంటర్వూ -05 మార్కులు).
దరఖాస్తు రుసుం - రూ. 500.
వయసు - 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - ఫిబ్రవరి 14,2024.
పరీక్ష కోసం కాల్ లెటర్ - 21 ఫిబ్రవరి, 2024. ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా పంపుతారు.
పరీక్ష తేదీ - 25 ఫిబ్రవరి 2024.
అధికారిక వెబ్ సైట్ - https://narayanpet.telangana.gov.in/
అర్హతలు:
- అభ్యర్థి స్థానికుడై ఉండాలి.
- దరఖాస్తుదారుడి వయసు 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి.
- డిగ్రీ పాసై ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
- ఐటీపై రాత పరీక్ష ఉంటుంది.
- ఇంటర్వూ ఉంటుంది.
- District E-Governnance Society,Narayanpet పేరు మీద రూ. 500 డీడీ తీయాలి.
దరఖాస్తు ఫారమ్…
IDBI Recruitment 2024: ఐడీబీఐ బ్యాంక్ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తారు. మార్చి 17వ తేదీన ఆన్ లైన్ పరీక్ష ఉంటుంది. https://www.idbibank.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ముఖ్యవివరాలు:
రిక్రూట్ మెంట్ ప్రకటన - ఐడీబీఐ(Industrial Development Bank of India).
ఉద్యోగాల పేరు - జూనియర్ అసిస్టెంట్ మేనేజర్
మొత్తం ఖాళీలు -500
వయో పరిమితి - 20- 25 ఏళ్ల లోపు ఉండాలి.
అర్హతలు - ఏదైనా వర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం - ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వూ
దరఖాస్తు ఫీజు - ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 200 చెల్లించాలి. మిగతావారు రూ. 1000 దరఖాస్తు రుసుం చెల్లించాలి.
దరఖాస్తు విధానం - ఆన్ లైన్
దరఖాస్తులు ప్రారంభం - 12 ఫిబ్రవరి, 2024చ
దరఖాస్తులకు తుది గడువు - 26 ఫిబ్రవరి, 2024.
పరీక్ష తేదీ - మార్చి 17, 2024.
అధికారిక వెబ్ సైట్ - https://www.idbibank.in/