PM Vishwakarma : గ్యారెంటీ లేకుండానే రూ. 3లక్షల లోన్​​- 'పీఎం విశ్వకర్మ' పథకాన్ని ప్రారంభించిన మోదీ!-rs 3 lakhs loan without any guarantee pm modi launches vishwakarma scheme ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Vishwakarma : గ్యారెంటీ లేకుండానే రూ. 3లక్షల లోన్​​- 'పీఎం విశ్వకర్మ' పథకాన్ని ప్రారంభించిన మోదీ!

PM Vishwakarma : గ్యారెంటీ లేకుండానే రూ. 3లక్షల లోన్​​- 'పీఎం విశ్వకర్మ' పథకాన్ని ప్రారంభించిన మోదీ!

Sharath Chitturi HT Telugu
Sep 17, 2023 05:17 PM IST

PM Vishwakarma : పీఎం విశ్వకర్మ పథకాన్ని తాజాగా లాంచ్​ చేశారు ప్రధాని మోదీ. కళాకారుల కోసం ఈ స్కీమ్​లో రూ. 3లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్టు మోదీ వెల్లడించారు.

కళాకారులతో మాట్లాడుతున్న మోదీ..
కళాకారులతో మాట్లాడుతున్న మోదీ.. (ANI)

PM Vishwakarma : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజుతో పాటు విశ్వకర్మ జయంతి నేపథ్యంలో.. ఆదివారం నాడు ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ 'పీఎం విశ్వకర్మ' స్కీమ్​ను మోదీ స్వయంగా లాంచ్​ చేశారు. కళాకారులు, హస్తకళాకారులు అభ్యున్నతే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించినట్టు ప్రధాని అన్నారు.

ఈ పీఎం విశ్వకర్మ కోసం కేంద్రం రూ. 13వేల కోట్లను ఖర్చు చేయనుందని మోదీ తెలిపారు. ఈ పథకం.. కళాకారులకు ఓ ఆశాకిరణం అని అభిప్రాయపడ్డారు.

PM Vishwakarma scheme : "18 విభాగాలపై దృష్టిసారించి.. రూ. 13వేల కోట్లను ఖర్చు చేస్తాము. ఈ పథకంలో చేరే వారిని విశ్వకర్మ పార్ట్​నర్స్​ అని పిలుస్తాము. వీరికి అన్ని విధాలుగా సాయం చేస్తాము. ఈ దేశంలోని కళాకారుల అభివృద్ధే లక్ష్యంగా మా ప్రభుత్వం అడుగులు వేస్తోంది," అని దిల్లీలోని ద్వారకాలో ఆదివారం జరిగిన.. స్కీమ్​ లాంచ్​ ఈవెంట్​లో మాట్లాడారు మోదీ.

కేంద్రం చెబుతున్న దాని ప్రకారం.. విశ్వకర్మ పార్ట్​నర్స్​కు తొలుత ట్రైనింగ్​ ఇస్తారు. ఆ సమయంలోనే రూ. 500 ఇస్తారు. రూ. 1500 విలువ చేసే టూల్​ కిట్​ని కూడా అందిస్తారు. కళాకారులు తయారు చేసిన ఉత్పత్తుల బ్రాండింగ్​, ప్యాకేజింగ్​, మార్కెటింగ్​కు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. పార్ట్​నర్స్​కు విశ్వకర్మ సర్టిఫికేట్​, ఐడీ కార్డ్​ వంటివి లభిస్తాయి.

ఇదీ చూడండి:- Modi birthday wishes : ప్రధాని మోదీకి స్వయంగా బర్త్​ డే విషెస్​ చెప్పాలని ఉందా? ఇలా చేయండి..

"ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ. 3లక్షల వరకు లోన్​ ఇస్తాము. తొలుత రూ. 1లక్ష ఇస్తాము. దానిని సకాలంలో రీపేమెంట్​ చేస్తే, మరో రూ. 2లక్షల రుణానికి అర్హత పొందుతారు. దీని వడ్డీ కూడా చాలా తక్కువగానే ఉంటుంది," అని విశ్వకర్మ పథకం గురించి ప్రధాని మోదీ వివరించారు.

What is PM Vishwakarma : స్కీమ్​ అమల్లో భాగంగా.. తొలి సంవత్సరంలో 5లక్షల కుటుంబాలను కవర్​ చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. 2028 ఆర్థిక ఏడాది నాటికి 30లక్షల కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోంది.

కార్పెంటర్​​, పడవ తయారీ, శిల్పి, బ్లాక్​స్మిత్​, సుత్తి వంటి ఆయుధాల తయారీ, లాక్​స్మిత్​, గోల్డ్​స్మిత్​, రాళ్లు కొట్టే వారు, కాబ్లర్​, తాపి మేస్త్రీ, చీపురు తయారీ చేసేవారు, బార్బర్​, ఆట వస్తువులు తయారీ చేసేవారు, బట్టలు కడిగే వారు, టైలర్​, చేపల వేటకు ఉపయోగించే నెట్​ను తయారు చేసే వారితో పాటు మొత్తం మీద 18 విభాగాలకు చెందిన వారు.. ఈ పీఎం విశ్వకర్మ పథకానికి అర్హులుగా కేంద్రం గుర్తించింది.