PM Vishwakarma Scheme : రూ.3 లక్షల లోన్... పీఎం విశ్వకర్మ పథకానికి ఇలా దరఖాస్తు చేసుకోండి
PM Vishwakarma Online Application: విశ్వకర్మ జయంతి సందర్భంగా పీఎం విశ్వకర్మ స్కీమ్ ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం, సాంప్రదాయ చేతిపనులు, చేతివృత్తుల్లో నిమగ్నమైన వారికి ఆర్థిక సాయం, కావాల్సిన శిక్షణ అందించడమే ఈ పథకం ఉద్దేశ్యం.ఈ స్కీమ్ ద్వారా రూ.3 లక్షల లోన్ తీసుకోవచ్చు. ప్రాసెస్ ఇక్కడ చూడండి…
PM Vishwakarma Yojana Online Application: వేగంగా పురోగమిస్తున్న సాంప్రదాయవృత్తుల్లో విప్లవత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఆయా రంగాల్లో కొత్త విజ్ఞానం, అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం, యాంత్రికరణ పెరుగుతుంది. మరి ఆయా పోకడలను అందిపుచ్చుకోవాలంటే ఆర్థిక దన్ను, నైపుణ్యాలు చాలా అవసరం. హిందువుగాను ఆ వర్గాలకు పూతం ఇచ్చి ఆదుకునే దిశగా ఆలోచించి, జీవన ప్రమాణాలు మెరుగు పరుచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 76వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం రోజున… విశ్వకర్మ జయంతి సందర్భంగా పీఎం విశ్వకర్మ అనే పథకాన్ని ప్రారంభించారు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలు వెచ్చించనున్నది. ఈ స్కీమ్ ద్వారా 3 లక్షల లోన్ తీసుకోవచ్చు. అయితే ప్రాసెస్ ఏంటి..? అర్హులు ఎవరు..? వంటి అంశాలను ఇక్కడ తెలుసుకుందాం…..
ఈ పథకానికి అర్హులు ఎవరు :
- ఈ పథకానికి ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన 18 రకాల కులస్తులు అర్హులు. (ప్రధానంగా సాంప్రదాయ కులవృత్తులైన వడ్రంగి, బంగారు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు, శిల్పాలు విగ్రహాలు తయారు చేసే వారు, బుట్టలు, చాపలు, మట్టి పాత్రలు తయారు చేసే కుమ్మరి వారు, చీపిర్లు తయారీదారులు, దోబీ, టైలర్, చేపవలను తయారు చేయు వారు, చెప్పులు కుట్టేవారు, తాపీ కార్మికులు క్షవుర వృత్తిదారులు, సంప్రదాయ బొమ్మలు,పూల దండలు, రజకులు పడవల తయారీదారులు, ఇంటి తాళాలు తయారీదారులు అర్హులు)
మీసేవా, సీఎస్ సీ కేంద్రాల్లో దరఖాస్తు;
-పైన పేర్కొన్న వృత్తి కులస్తులు తమ తమ ధ్రువపత్రాలను తీసుకెళ్లి మీసేవా , సిఎస్ సి కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
-దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల దృవీకరణ పత్రం, బ్యాంకు పాస్ పుస్తకం వెంట తీసుకెళ్లాలి.
-ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
-18 సంవత్సరాలు నిండి ఉండాలి.
-ఇంతకుముందు ఎలాంటి రుణాలు తీసుకుని ఉండకూడదు.
-ఇంటిలో ఒకరు మాత్రమే అర్హులు. ఇంటిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే పతకానికి అనర్హులు.
-దరఖాస్తు చేసుకున్నాక మూడు దశల్లో స్క్రీనింగ్ చేసి సెలెక్ట్ చేస్తారు.
-అర్హత పొందిన వారికి 15 రోజుల శిక్షణ ఉంటుంది. శిక్షణ లో రోజుకు 500 రూపాయలు ఉపకార వేతనం అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికెట్ అందజేస్తారు,
-కులవృత్తుల వారికి పనిముట్లు (టూల్స్) కొనుక్కునేందుకు 15,000 రూపాయలు అందిస్తారు.
-తొలివిడతగా 5శాతం రైతుతో వడ్డీ పై లక్ష రూపాయలను అందిస్తారు. ఈ రుణాన్ని 18 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
-రెండో విడతగా రెండు లక్షల రూపాయలను అందిస్తారు. మీరు తీసుకున్న 30 నెలలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విశ్వకర్మ పథకం కింద దేశవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా.
రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఆదిలాబాద్
సంబంధిత కథనం