AP TET Hall Tickets : రేపట్నుంచి ఏపీ టెట్ హాల్ టికెట్లు జారీ, డౌన్ లోడ్ లింక్ ఇదే!
AP TET Hall Tickets : రేపటి నుంచి ఏపీ హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
AP TET Hall Tickets : ఏపీ టెట్ హాల్ టికెట్ల(AP TET Hall Tickets) విడుదలకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి టెట్ హాల్ టికెట్లు అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో ఇటీవల టెట్(AP TET 2024) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8 నుంచి టెట్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 18వ తేదీతో ముగిసింది. టెట్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రేపటి నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 27 నుంచి మార్చి 9వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ హాల్ టికెట్లను అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
ఈ నెల 19వ తేదీన టెట్ అభ్యర్థులు మాక్ టెస్ట్ రాసేందుకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్స్‌లో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ ప్రాథమిక కీ(TET Key) మార్చి 10న విడుదల చేస్తారు. ఈ కీపై అభ్యంతరాలను మార్చి 11 వరకు స్వీకరిస్తారు. టెట్ తుది కీని మార్చి 13న రిలీజ్ చేస్తారు. మార్చి 14న టెట్ తుది ఫలితాలు విడుదల చేస్తారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్, డీఎస్సీ పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా నిర్వహించనున్నారు.
టెట్ పరీక్షా విధానం
ఏపీ టెట్ పరీక్షను నాలుగు పేపర్లలోని నిర్వహించనున్నారు.
- పేపర్-1A : 1 నుంచి 5 తరగతి వరకు బోధించే ఉపాధ్యాయ అభ్యర్థులకు
- పేపర్-1B : 1 నుంచి 5 తరగతి వరకు బోధించే స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ అభ్యర్థులకు
- పేపర్-2A : 6వ తరగతి నుంచి 8 తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు
- పేపర్-2B : 6 నుంచి 8 తరగతి వరకు బోధించే స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ అభ్యర్థులకు
సిలబస్, పరీక్షా విధానం
ఏపీ టెట్ పేపర్–1A, 1B, పేపర్–2A, 2Bలను 150 మార్కులకు నిర్వహిస్తారు. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం ఇస్తారు. ఏపీ టెట్‌లోని అన్ని పేపర్లలోనూ అభ్యర్థులు తప్పనిసరిగా కనీస ఉత్తీర్ణత మార్కులు పొందాలి. ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయవచ్చు. ఇక టెట్(AP TET) లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో మార్కులు యాడ్ అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు.
పేపర్–2A చూస్తే ఇందులో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి నుంచి 30 మార్కులు వస్తాయి. ఇక లాంగ్వేజ్-1 నుంచి 30 మార్కులు, లాంగ్వేజ్- 2 ఇంగ్లీష్ నుంచి 30 మార్కులు, సంబంధిత సబ్జెక్ట్ నుంచి 60 మార్కులు ఇస్తారు. మొత్తం 150 మార్కులకు గానూ పరీక్ష నిర్వహిస్తారు. నాలుగో విభాగంగా నిర్వహించే సంబంధిత సబ్జెక్ట్ విషయంలో..మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్, సైన్స్ విభాగాన్ని, సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. పేపర్–2Bలో(AP TET Syllabus) చూస్తే చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి నుంచి 30 మార్కులు, లాంగ్వేజ్1 నుంచి 30, గ్వేజ్ 2(ఇంగ్లిష్)-30, డిజేబిలిటీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అండ్ పెడగాజి నుంచి 60 మార్కులు ఇస్తారు. మొత్తం 150 మార్కులకుగానూ పరీక్ష నిర్వహిస్తారు. పేపర్–2Bలో నాలుగో విభాగంలో అభ్యర్థులు స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులో చదివిన సబ్జెక్ట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం