Tirumala Tickets Schedule : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్- సెప్టెంబర్ కోటా దర్శనం, వసతి టికెట్ల షెడ్యూల్ విడుదల
Tirumala Tickets Schedule : తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదుల సెప్టెంబర్ కోటా టికెట్ల విడుదల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18 నుంచి జూన్ 24 మధ్య టికెట్లు విడుదల కానున్నాయి.
Tirumala Tickets Schedule : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శనం, వసతి టికెట్ల కోటా విడుదల సమాచారాన్ని టీటీడీ ప్రకటించింది. టీటీడీ యాప్, వెబ్ సైట్ లో సెప్టెంబర్ కోటా వివరాలను వెల్లడించింది.
సెప్టెంబర్ కోటా దర్శనం, వసతి టికెట్లు
- శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ - జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు
- శ్రీవారి ఆర్జి సేవల టికెట్లు(కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహశ్ర దీపాలంకార సేవ) విడుదల - జూన్ 21, ఉదయం 10 గంటలకు
- శ్రీవారి ఆర్జిక సేవ(వర్చువల్), కనెక్టడ్ దర్శనం కోటా టికెట్లు(కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహశ్ర దీపాలంకార సేవ) విడుదల - జూన్ 21, మధ్యాహ్నం 3 గంటలకు
- తిరుమల అంగ ప్రదక్షిణ టికెట్లు విడుదల- జూన్ 22, ఉదయం 11 గంటలకు
- వృద్ధులు, వికలాంగుల కోటా టికెట్లు - జూన్ 22, మధ్యాహ్నం 3 గంటలకు
- తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు(రూ.300) - జూన్ 24, ఉదయం 10 గంటలకు
- తిరుమల, తిరుపతి వసతి గృహాల టికెట్లు విడుదల - జూన్ 24, మధ్యాహ్నం 3 గంటలకు
- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్లు(రూ.200) జులై కోటా -జూన్ 24, ఉదయం 10 గంటలకు
- టీటీడీ స్థానిక ఆలయాల్లో సేవల టికెట్లు (జులై కోటా)- జూన్ 25, ఉదయం 10 గంటలకు
తిరుమలలో జ్యేష్ఠాభిషేకం- పలు సేవలు రద్దు
తిరుమల శ్రీవారికి జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు. ప్రతీ ఏటా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసే విధంగా శ్రీవారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గల కల్యాణ మండపంలో జ్యేష్ఠాభిషేకం చేస్తారు. దీనినే అభిధేయక అభిషేకం అని కూడా పిలుస్తారు. ఈ సేవలో మొదటిరోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి అభిషేకాలు, హోమాలు పంచామృత స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత స్వామి, అమ్మవార్లకు వజ్రకవచం అలంకరించి మాఢవీధుల్లో ఊరేగిస్తారు.
రెండో రోజు స్వామి, అమ్మవార్లకు ముత్యాల కవచం సమర్పించి ఊరేగిస్తారు. మూడో రోజు తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి మాఢ వీధుల్లో ఊరేగిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. సంవత్సరం పొడవునా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు కవచంతోనే భక్తులకు దర్శనం ఇస్తారు. అయితే జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 21న కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు.
సంబంధిత కథనం