Tirumala Arjitha Seva Tickets : మార్చి, ఏప్రిల్, మే నెల ఆర్జిత సేవా టికెట్లు.. ఇలా బుక్ చేసుకోండి !-tirumala arjitha seva tickets quota for march april may to be released on february 22 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tirumala Arjitha Seva Tickets Quota For March April May To Be Released On February 22

Tirumala Arjitha Seva Tickets : మార్చి, ఏప్రిల్, మే నెల ఆర్జిత సేవా టికెట్లు.. ఇలా బుక్ చేసుకోండి !

HT Telugu Desk HT Telugu
Feb 21, 2023 04:59 PM IST

Tirumala Arjitha Seva Tickets : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి, ఏప్రిల్, మే నెల ఆర్జిత సేవా కోటా టికెట్లను ఫిబ్రవరి 22న సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది టీటీడీ. లక్కీడిప్ నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 22 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

Tirumala Arjitha Seva Tickets : తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం నిత్యం లక్షల మంది ఆలయానికి వస్తుంటారు. ఏడుకొండల వాడిని కనులారా దర్శించుకొని.. తన్మయత్వం పొందుతారు. స్వామివారిని ప్రశాంతంగా చూసే అదృష్టం.. ప్రార్థించే అవకాశం కోసం కోట్ల మంది ఎదురు చూస్తుంటారు. శ్రీవారి సేవలో పాల్గొనే సదావకాశం దక్కాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో.. తిరుమల శ్రీవారి భక్తులకి.. కీలక అప్డేట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి మార్చి, ఏప్రిల్, మే నెలల కోటాను ఫిబ్రవరి 22న సాయంత్రం 4 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది టీటీడీ. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

అదే విధంగా.... మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ ఫిబ్రవరి 22న ఉదయం 10 గంట‌ల‌ నుంచి ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల వరకు ఉంటుందని టీటీడీ తెలిపింది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గుర్తించి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను బుక్ చేసుకోవాల‌ని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది.

బుకింగ్ ప్రాసెస్….

టికెట్లు బుక్ చేసుకునేందుకు https://tirupatibalaji.ap.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలి. సైట్లో సైన్ అప్ ఆప్షన్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత లాగిన్ పేజీకి వెళ్తుంది. లాగిన్ తర్వాత తేదీలు అందుబాటులో ఉంటాయి. డ్యాష్ బోర్డును చూసి.. మీ తేదీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సిన తేదీ స్లాట్ ను చెక్ చేసుకుంటే.. ఖాళీలు ఉంటే.. గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఆ తర్వాత.. అక్కడ నొక్కితే.. టికెట్ మెుత్తానికి డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. మీకు టికెట్ బుక్ అవుతుంది. బుకింగ్ ప్రక్రియ.. సాధారణంగా ఇతర వెబ్ సైట్లలో చేసిన విధంగానే ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ లడ్డూలు కావాలంటే కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు.

టీటీడీ దేవస్థానమ్స్ అనే మొబైల్ అప్లికేషన్‌ ద్వారా కూడా వివిధ రకాల సేవా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. జియో సంస్థ సహకారంతో టిటిడి ఐటి విభాగం ఈ యాప్‌ను రూపొందించింది. సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్లైన్‌ ద్వారా క్లౌడ్‌ టెక్నాలజీని వాడుతున్నారు. తద్వారా ప్రతినెలా దర్శనం, సేవలు, శ్రీవాణి టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో వసతి కూడా ముందుగానే బుక్‌ చేసుకోవచ్చు.

IPL_Entry_Point