Minister RK Roja : చంద్రబాబు జీవితాంతం జైలులోనే- త్వరలో లోకేశ్, భువనేశ్వరి అరెస్ట్ - మంత్రి రోజా-tirupati minister rk roja sensational comments on chandrababu family lokesh bhuvaneswari arrest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Minister Rk Roja : చంద్రబాబు జీవితాంతం జైలులోనే- త్వరలో లోకేశ్, భువనేశ్వరి అరెస్ట్ - మంత్రి రోజా

Minister RK Roja : చంద్రబాబు జీవితాంతం జైలులోనే- త్వరలో లోకేశ్, భువనేశ్వరి అరెస్ట్ - మంత్రి రోజా

Bandaru Satyaprasad HT Telugu
Oct 24, 2023 02:00 PM IST

Minister RK Roja : పవన్ కల్యాణ్, లోకేశ్ రాజమండ్రిలో పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించారని మంత్రి రోజా సెటైర్లు వేశారు. చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉంటారని, త్వరలో లోకేశ్, భువనేశ్వరి కూడా అరెస్టు అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రి రోజా
మంత్రి రోజా

Minister RK Roja : ఏపీలో టీడీపీ-జనసేన పొత్తుతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఉమ్మడి కార్యాచరణతో ముందు వెళ్లాలని టీడీపీ, జనసేన రాజమండ్రిలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. టీడీపీ-జనసేన కలయికపై అధికార వైసీపీ మాటల దాడి చేస్తుంది. తాజాగా మంత్రి రోజా టీడీపీ, జనసేన పొత్తు, చంద్రబాబు కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... పవన్, లోకేశ్ ఇద్దరు కలిసి రాజమండ్రిలో పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించారని ఎద్దేవా చేశారు. రెండు అర సున్నలు కూర్చొని జైలులో ఉన్న గుండు సున్న కోసం చర్చించారని సెటైర్లు వేశారు. వై ఏపీ నీడ్స్ పవన్ కల్యాణ్, చంద్రబాబు అనే నినాదంతో టీడీపీ, జనసేన ప్రజల్లోకి వెళ్లే దమ్ముందా అని మంత్రి రోజా ప్రశ్నించారు. చంద్రబాబు ఇక జైలు నుంచి బయటకు రారని, జీవితాంతం జైలులోనే ఉంటారన్నారు.

yearly horoscope entry point

యువగళానికి మంగళం

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరిట యాత్ర చేపడుతున్నారు. భువనేశ్వరి యాత్రపై మంత్రి రోజా విమర్శలు చేశారు. లోకేశ్ యువగళం పాదయాత్రకు మంగళం పాడారన్నారు. భువనేశ్వరి, లోకేశ్ ఫ్యాషన్ షోకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. లోకేశ్, పవన్ కల్యాణ్ లను చిత్తుగా ఓడించి ప్రజలు చీకొట్టారన్నారు. భువనేశ్వరి నిజం గెలవాలని గట్టిగా దేవుడికి పూజలు చేశారని, చంద్రబాబు జైలులోనే శాశ్వతంగా ఉండాలని తిరుమల శ్రీవారికి పూజలు చేసినట్లు ఉన్నారని మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజమే గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉంటారన్నారు. చంద్రబాబుతో పాటు లోకేశ్, భువనేశ్వరి కూడా జైలుకు వెళ్తారన్నారు. నిజం గెలవాలని భువనేశ్వరి మనస్ఫూర్తిగా కోరుకుంటే సీబీఐ దర్యాప్తునకు కోరుకోవాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఐఆర్ఆర్ కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు భువనేశ్వరి డిమాండ్ చేయాలని మంత్రి రోజా అన్నారు.

జగనన్న వన్స్ మోర్

ఫ్యాషన్ షోకు వెళ్తున్నట్లు భువనేశ్వరి నిజం గెలవాలంటూ బస్సు యాత్ర చేస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. తన తండ్రి ఎన్టీఆర్ పై చెప్పులు వేసినప్పుడు, టీడీపీని లాకునప్పుడు, తండ్రి చావుకు కారణం అయినప్పుడే వీళ్లంతా ఆనందంగా ఉన్నారన్నారు. అలాంటి వాళ్లకు ఇప్పుడెందుకు భాధ వస్తుందన్నారు. భువనేశ్వరి కోరుకున్న నిజం గెలవాలి అనేది చంద్రబాబు లోపల ఉండాలని అనే విధంగా ఉందన్నారు. ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్, రాజధాని భూములు, ఐఆర్ఆర్ లో ఎన్నో స్కాంలు చంద్రబాబు చేశారన్నారు. ఇప్పటికైనా దోచిన డబ్బులు వెనక్కి ఇచ్చి, ప్రజలకు క్షమాపణ‌ కోరితే చంద్రబాబుకు బెయిల్ వస్తుందన్నారు. అధికారంలో ఉన్నట్లుగా భావిస్తూ వైసీపీపై ఆరోపణలు చేస్తూ ప్రజలు ఊరుకోరన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్న వన్స్ మోర్ అని‌ ప్రజలు డిసైడ్ అయ్యారని మంత్రి రోజా అన్నారు.

Whats_app_banner