Tractors Theft: నాలుగున్నర కోట్ల విలువైన 57 ట్రాక్టర్ల చోరీ.. లీజు పేరుతో బురిడీ.. నిందితుల్ని పట్టుకున్న పోలీసులు-theft of 57 tractors worth four and a half crores fraud in the name of lease police arrested the accused ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tractors Theft: నాలుగున్నర కోట్ల విలువైన 57 ట్రాక్టర్ల చోరీ.. లీజు పేరుతో బురిడీ.. నిందితుల్ని పట్టుకున్న పోలీసులు

Tractors Theft: నాలుగున్నర కోట్ల విలువైన 57 ట్రాక్టర్ల చోరీ.. లీజు పేరుతో బురిడీ.. నిందితుల్ని పట్టుకున్న పోలీసులు

Sarath chandra.B HT Telugu
Apr 18, 2024 06:37 AM IST

Tractors Theft: లీజు పేరుతో రైతుల్ని బురిడీ కొట్టించి కోట్లాది రుపాయల విలువైన ట్రాక్టర్లను అపహరించిన ముఠాను సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నాలుగున్నర కోట్ల రుపాయల విలువైన 57 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

సీజ్ చేసిన ట్రాక్టర్లతో సత్యసాయి జిల్లా పోలీసులు
సీజ్ చేసిన ట్రాక్టర్లతో సత్యసాయి జిల్లా పోలీసులు

Tractors Theft: ట్రాక్టర్ లీజుతో lease fraud అధిక లాభాల పేరుతో రైతులను మోసగించి ట్రాక్టర్లను అపహరించిన నిందితుల్ని శ్రీ సత్యసాయి Satyasai District జిల్లా పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. పోలీస్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగున్నర కోట్ల రుపాయల RS.4.5crores విలువైన 57 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. లీజు పేరుతో అద్దెకు తీసుకోవడం రెండు మూడు నెలలు అద్దె చెల్లించి ఆ తర్వాత వాటిని అమ్మేసుకుంటున్నట్లు గుర్తించారు.

yearly horoscope entry point

జల్సాల కోసం అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు రైతుల్ని మోసం Cheating చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేవారు. రైతుల వద్ద ఉన్న ట్రాక్టర్లను లీజుకు తీసుకొని వాటిని ఇతరుల వద్ద తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటూ, రైతులను మోసం చేస్తున్నట్టు గుర్తించారు.

ఈ కేసులో రైతుల నుండి ఫిర్యాదు అందడంతో పోలీస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తక్కువ సమయంలోనే ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి వారి నుంచి రూ .4,56,00,00 లక్షల విలువచేసే ,57 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి వివరించారు.

తాడిమర్రి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ధర్మవరం డిఎస్పీ శ్రీనివాసులతో కలిసి వివరాలు వెల్లడించారు.. తాడిమర్రి గ్రామానికి చెందిన రైతు దేవర రామమోహన్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ట్రాక్టర్లు మాయం చేస్తున్న ముఠాను పట్టుకున్నారు.

బొమ్మిరెడ్డిపల్లి గ్రామము, నల్లచెరువు మండలానికి చెందిన నల్లజంగరి రవికుమార్, పులివెందుల టౌన్ కు చెందిన లోమడ బయారెడ్డి లు తాడిమర్రి, కనేకల్ మండలానికి చెందిన రైతుల వద్దనుండి ప్రొద్దుటూరులో NRK Brik Indastries లో పని చేయటానికి లీజుకు ట్రాక్టర్ లు కావాలని రైతులను నమ్మించి ట్రాక్టర్ లను లీజు పేరుతో తీసుకున్నారు. లీజుకు తీసుకున్న ట్రాక్టర్‌లను పులివెందుల పరిసర ప్రాంతాలలో అమ్మేశారు. రైతులకు అనుమానం రాకుండా మూడు నెలల పాటు నెలకు 25,000 రూపాయల ప్రకారం ఇచ్చారు. తరువాత రైతులకు కనబడకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.

ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు రవికుమార్, బయారేడ్డి లను పట్టుకుని విచారించడంతో వారితో పాటు మరికొందరు ముఠా సభ్యులు ఉన్నట్టు గుర్తించారు. కాకర్ల హాజిపిరా, బోగిరెడ్డి చంద్ర ఓబులరెడ్డి, పెసల నాగమల్లారెడ్డి ,తలారి రామలింగేశ్వరరావు, చిన్న జయచంద్ర రెడ్డి , మధుసూదన రెడ్డి, సాకే రామమోహన్, సుదర్శన్ రెడ్డిలు ఒక ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేక గ్రామాల రైతుల వద్ద నుండి ట్రాక్టర్ లను లీజుకు తీసుకుని వాటిని కడప, నెల్లూరు, ప్రకాశం, కర్నూల్, నంద్యాల, గుంటూరు జిల్లాలలోని వివిధ గ్రామాలలో తక్కువ రేటుకు మీ పేరు మీద రిజిస్టర్ చేస్తామని అగ్రిమెంట్ వ్రాసుకుని తరువాత రిజిస్టర్ చేయిస్తామని డబ్బులు తీసుకుని అంటగటటేవారు. ఇలా రైతుల్ని మోసం చేసేవారు. వచ్చిన డబ్బుతో అందరు పంచుకునే వాటాలు పంచుకున్నారు. విచారంలో భాగంగా ముద్దాయిలు ఇతర జిల్లాలలోని ట్రాక్టర్ లను అమ్మిన వ్యక్తుల వద్ద నుండి 57 ట్రాక్టర్ లను రికవర్ చేశారు.

ముద్దాయిల వివరాలు..

1). నల్లజంగరి రవికుమార్,వయస్సు 42 సంవత్సరాలు, తండ్రి నారాయణ,బొమ్మిరెడ్డిపల్లి గ్రామము, నల్లచెరువు మండలము, శ్రీ సత్య సాయి జిల్లా,

2). లోమడ బయారెడ్డి వయస్సు 48 సంవత్సరాలు తండ్రి రామసుబ్బారెడ్డి, మెయిన్ రోడ్,పవర్ ఆఫీస్ ఎదురుగా,పులివెందుల టౌన్.

3)కాకర్ల హాజిపిరా వయస్సు 65 సంవత్సరాలు తండ్రి కాకర్ల హాజీ, లోమడ గ్రామము,సింహాద్రిపురము మండలము, కడప జిల్లా

ఈ కేసులో వీరితో పాటు ముద్దాయిలు :

4) బోగిరెడ్డి చంద్ర ఓబులరెడ్డిని,వయస్సు 50 సంవత్సరములు తండ్రి late నడిపి గురివిరెడ్డి, కందిమల్లయ్యపల్లి.గ్రామము, బ్రహ్మం గారిమటము మండలము,YSR కడప జిల్లా,

5) పెసల నాగమల్లారెడ్డి తండ్రి రామిరెడ్డి, మద్దిరెడ్డిపల్లి గ్రామము, H/O సోమిరెడ్డిపల్లి, బ్రహ్మంగారిమటం మండలము YSR కడప జిల్లా

6) తలారి రామలింగేశ్వరరావు, చిన్నతండ్రి T.రామారావు, శ్రీనివాసపురం గ్రామము, గోస్పాడు మండలము నంద్యాల జిల్లా,

7) జయచంద్ర రెడ్డి తండ్రి నరసింహారెడ్డి చాక వేలు గ్రామము,చోలూరు తాలుకా,చిక్బలాపూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం

8) ) మధుసూదన రెడ్డి తండ్రి వెంకటరమణ రెడ్డి తీగలపల్లి గ్రామము, పతపాల్యం హుబ్లి, చిక్బలాపూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం

9) సాకే రామమోహన్ తండ్రి లేట్ గంగాద్రి, వంకమద్ది గ్రామము, NP కుంట మండలము,శ్రీ సత్య సాయి జిల్లా

10) సుదర్శన్ రెడ్డి, తండ్రి లక్ష్మిరెడ్డి, యాలురు గ్రామము, గోస్పాడు మండలము నంద్యాల జిల్లా,

11) పాణ్యం మల్లిఖార్జున రెడ్డి,తండ్రి ఓబుల రెడ్డి, చెన్నంపల్లి గ్రామము, ఆవుకు మండలము, నంద్యాల జిల్లా

Whats_app_banner

సంబంధిత కథనం