CBN Quash Petition : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా-supreme court adjourns chandrababu quash petition ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn Quash Petition : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా

CBN Quash Petition : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 13, 2023 04:50 PM IST

Chandrababu Cases News :చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈనెల 17న మరోసారి వాదనలు వింటామని తెలిపింది. మరోవైపు ఫైబర్ నెట్ కేసు విచారణను కూడా వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. స్కిల్‌ కేసు విచారణకు ఫైబర్‌నెట్‌ కేసుతో సంబంధం ఉందన్నారు. సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం…. విచారణను అక్టోబరు 17వ తేదీకి వాయిదా వేశారు.

yearly horoscope entry point

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే ఇరువైపు వాదనలు విన్నది సుప్రీంకోర్టు. అయితే ఇవాళ తీర్పు వచ్చే అవకాశం ఉందని అంతా భావించినప్పటికీ… మరోసారి వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం. ప్రధానంగా 17ఏపైనే మరోసారి చంద్రబాబు తరపు న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. దాదాపు గంటకు పైగా ఆయన వాదనలు కొనసాగించారు. అన్నిరకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు సెక్షన్‌ 17ఎతో రక్షణ లభించిందని గుర్తు చేశారు. ఇందుకు పలు కేసులను కూడా ఉదహరించారు. స్కిల్‌ కేసులోనూ చంద్రబాబుపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ చట్టబద్ధం కాదని పునరుద్ఘాటించారు.  మరోవైపు ఏపీ సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. స్కిల్ కేసులో చంద్రబాబు పాత్రకు సంబంధించి  తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారని వాదించారు. కేసులో చంద్రబాబును ఎప్పుడు చేర్చినప్పటికీ విచారణ కొనసాగుతున్నట్లుగానే పరిగణించాలన్నారు. 

17ఏ అన్నది అవినీతికి రక్షణ కాకూడదన్నారు ముఖల్ రోహత్గీ.  అవినీతిపరులను రక్షించేందుకు 17ఏ చట్టసవరణ పరికరం కాకూడదని వాదించారు. చట్టం అమలులో ఉన్నప్పుడు జరిగిన నేరాలకు పాత చట్టంలోని సెక్షన్స్ వర్తిస్తాయన్నారు. చట్టాన్ని రద్దు చేసినా వెనక్కి తీసుకున్నప్పటికీ నేరం జరిగినప్పటి చట్టమే వర్తిస్తుందని చెప్పారు.  నేరమే చేయనప్పుడు ఎస్ఎల్‌పీ ఎందుకు వేశారని రోహిత్గీ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. మా వాదనలు ఏపీ హైకోర్టు ఆమోదించిందని…  విధాన నిర్ణయాల్లో ముందస్తు ప్రణాళిక ప్రకారం అవినీతికి పాల్పడితే దానికి 17ఏను వర్తింపచేయలేము అని అన్నారు. ఇరువైపు వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం… తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసుపై విచారణ…

మరోవైపు ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది. అయితే తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాది లూథ్రా వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… మంగళవారం వరకు  చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని చెప్పింది.  ఈ కేసులో ఒక వేళ రాష్ట్రప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలనుకుంటే సోమవారం చేయవచ్చని కోర్టు తెలిపింది. 

 

Whats_app_banner