Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... ఆగస్టు నెల మొత్తం పుష్క‌రిణి మూసివేత - విశేష ఉత్సవాలు ఇవే-special festivals in the month of august in tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... ఆగస్టు నెల మొత్తం పుష్క‌రిణి మూసివేత - విశేష ఉత్సవాలు ఇవే

Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... ఆగస్టు నెల మొత్తం పుష్క‌రిణి మూసివేత - విశేష ఉత్సవాలు ఇవే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 26, 2023 01:29 PM IST

TTD Latest News: ఆగస్టు నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను వెల్లడించింది టీటీడీ. ఈ మేరకు ఆయా తేదీలు, ఉత్సవాలను పేర్కొంది. మరోవైపు ఆగస్టు నెల మొత్తం శ్రీవారి పుష్కరిణిని మూసివేయనున్నట్లు

తిరుమల
తిరుమల

Special Festivals at Tirumala: ఆగస్టు నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను ప్రకటించింది టీటీడీ. ఈ మేరకు పూర్తి వివరాలను వెల్లడించింది. ఆగస్టు 1న పౌర్ణమి గరుడ సేవ ఉండగా… ఆగస్టు 12న మతత్రయ ఏకాదశి నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే….

విశేష ఉత్సవాలు:

– ఆగస్టు 1న పౌర్ణమి గరుడ సేవ.

– ఆగస్టు 12న మతత్రయ ఏకాదశి.

– ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం.

– ఆగస్టు 21న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ.

– ఆగస్టు 22న కల్కి జయంతి.

– ఆగస్టు 25న తరిగొండ వెంగమాంబ వర్ధంతి, వరలక్ష్మీ వ్రతం.

– ఆగస్టు 26న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.

– ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు.

– ఆగస్టు 30న శ్రీ విఖనస మహాముని జయంతి. శ్రావణపౌర్ణమి. రాఖీ పండుగ.

– ఆగస్టు 31న హయగ్రీవ జయంతి. తిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు.

శ్రీవారి పుష్క‌రిణి మూత

CLOSURE OF SRIVARI PUSHKARNI: తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్క‌రిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు పుష్క‌రిణిని మూసివేస్తారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్క‌రిణి హార‌తి ఉండ‌దు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

సాధారణంగా స్వామి పుష్క‌రిణిలో నీరు నిల్వ ఉండే అవ‌కాశం లేదు. పుష్క‌రిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్త‌మ రీసైక్లింగ్ వ్య‌వ‌స్థ‌ అందుబాటులో ఉంది. నిరంత‌రాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్క‌రిణిలో నీటిని తొల‌గించి చిన్న చిన్న మ‌ర‌మ్మ‌తుల‌ను పూర్తి చేస్తారు.

పుష్క‌రిణి మ‌ర‌మ్మ‌తుల కోసం మొద‌టి ప‌ది రోజుల పాటు నీటిని తొల‌గిస్తారు. ఆ త‌రువాత ప‌ది రోజులు మ‌ర‌మ్మ‌తులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివ‌రి ప‌ది రోజులు పుష్క‌రిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్క‌రిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. టీటీడీ వాట‌ర్ వ‌ర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు.

Whats_app_banner

సంబంధిత కథనం