TTD Revenue: తిరుమల శ్రీవారికి 2023లో కాసుల వర్షం
TTD Revenue: తిరుమల శ్రీవారికి 2023లో భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. కోవిడ్ కారణంగా వరుసగా రెండేళ్ల పాటు ఆంక్షలతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోయింది. ఈ ఏడాది ఆ లోటు పూర్తిగా తీరిపోయింది.
TTD Revenue: 2023 ఏడాది చివరి నెలలో కూడా తిరుమల శ్రీవారి ఆదాయం రూ.100కోట్ల మార్కును దాటేసింది. 2020, 21లో టీటీడీ ఆదాయం అంతంత మాత్రంగా సమకూరింది. వరుసగా రెండేళ్ల పాటు కోవిడ్ కారణంగా తిరుమల దేవదేవుడిని దర్శించుకోడానికి భక్తులను పూర్థి స్థాయిలో అనుమతించక పోవడంతో టీటీడీ ఆదాయం గణనీయంగా పడిపోయింది. గత ఏడాది కాస్త మెరుగు పడింది. 2022 మార్చి నుంచి తిరుమలలో ప్రతి నెల రూ.100కోట్ల ఆదాయం నమోదవుతోంది.
ఏడాది చివరిలో డిసెంబర్ నెలలో శ్రీవారి ఆదాయం రూ.100 కోట్లను దాటింది. వరుసగా 22వ నెల కూడా శ్రీవారికి భక్తులు సమర్పించే హుండీ ఆదాయం రూ.100 కోట్లను అధిగమించింది.
డిసెంబర్ నెలలో శ్రీవారికి హుండి ద్వారా 120 కోట్ల ఆదాయం సమకూరింది. 2023 సంవత్సరంలో శ్రీవారిని 2.52 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. 2023 సంవత్సరంలో శ్రీవారికి హుండి ద్వారా 1402 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.
ఈ ఏడాది ప్రతి నెల 100 కోట్లకు పైగా శ్రీవారికి హుండీ ఆదాయం అభించింది. జూలై మాసంలో అత్యధికంగా 129 కోట్ల హుండి ఆదాయం లభిచింది. నవంబర్ నెలలో అత్యల్పంగా రూ.108 కోట్ల హుండి ఆదాయం లభించిందని టీటీడీ ప్రకటించింది.