AP Rains: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో శనివారం వరకు ఏపీలో వానలే వానలు..-rains in ap till saturday with series of low pressures in bay of bengal ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rains: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో శనివారం వరకు ఏపీలో వానలే వానలు..

AP Rains: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో శనివారం వరకు ఏపీలో వానలే వానలు..

Sarath chandra.B HT Telugu
Jul 16, 2024 06:25 AM IST

AP Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో పాటు వరుసగా మరో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు ఉండటంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ఏపీలో మరో ఐదు రోజుల పాటు వానలే వానలు
ఏపీలో మరో ఐదు రోజుల పాటు వానలే వానలు (PTI)

AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగాsa వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్ అంతట వర్షాలుకురుస్తున్నాయి. సోమవారం ఉత్తర కోస్తా, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఎడతెరిపి లేని వర్షాలతో ఆంధ్రప్రదేశ్ తడిచి ముద్దవుతోంది. సోమవారం కృష్ణాజిల్లా, అనకాపల్లి, నంద్యాల, విజయనగరం, కర్నూలు, ఎన్టీఆర్, కోనసీమ, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కృష్ణాజిల్లా బంటుమిల్లిలో అత్యధికంగా 65.75 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.

జూలై 19వ తేదీన బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండి అమరావతి పేర్కొంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. గురు, శుక్ర వారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

భారీ వర్షాల నేపధ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించామని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసర సహాయక చర్యల కోసం విపత్తుల నిర్వహణ సంస్థలో 24గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలన్నారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

Whats_app_banner