Prakasam Accident : ప్రకాశం జిల్లాలో విషాదం, స్కూటీపై తెగిపడిన కరెంట్ తీగ -ముగ్గురు యువకులు మృతి-prakasam district current line wire fell down on bike three youth died ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Prakasam Accident : ప్రకాశం జిల్లాలో విషాదం, స్కూటీపై తెగిపడిన కరెంట్ తీగ -ముగ్గురు యువకులు మృతి

Prakasam Accident : ప్రకాశం జిల్లాలో విషాదం, స్కూటీపై తెగిపడిన కరెంట్ తీగ -ముగ్గురు యువకులు మృతి

Bandaru Satyaprasad HT Telugu
Jul 23, 2024 07:03 PM IST

Prakasam Accident : ప్రకాశం జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తో్న్న ముగ్గురు యువకులపై కరెంట్ వైర్ తెగిపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రకాశం జిల్లాలో విషాదం, స్కూటీపై తెగిపడిన కరెంట్ తీగ -ముగ్గురు యువకులు మృతి
ప్రకాశం జిల్లాలో విషాదం, స్కూటీపై తెగిపడిన కరెంట్ తీగ -ముగ్గురు యువకులు మృతి

Prakasam Accident : ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు ఎస్టీ కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తోన్న ముగ్గురు యువకులపై కరెంటు తీగ తెగిపడింది. విద్యుత్ షాక్ తో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటీలో ఉన్న పెట్రోల్ వలన స్కూటీకి మంటలు అంటుకోవడంతో ముగ్గురు యువకుల మృతదేహాలు 40 శాతానికి పైగా కాలిపోయాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు వద్ద బైక్ పై వెళ్తోన్న ముగ్గురు విద్యార్థులపై కరెంట్ తీగలు తెగిపడ్డాయి. ఇవి 11 కేవీ మెయిన్ లైన్ విద్యుత్ తీగలు కావటంతో... ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మంటలు చెలరేగి వారి మృతదేహాలు పాక్షికంగా దహనమయ్యాయి. కనిగిరి నుంచి పునుగోడు గ్రామానికి ముగ్గురు స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు విద్యార్థులు గ్రామానికి సమీపంలోని చెరువులో ఈతకు వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు యువకులు కనిగిరి విజేత కళాశాలకు చెందిన గౌతమ్, బాలాజీ, నజీర్ లుగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు... ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సు గేదెల‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక‌రు మృతి చెంద‌గా, ఏడుగురికి గాయాలు అయ్యాయి. మృతుడు అనంత‌పురం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండ‌లంలోని తిప్పాయ‌పాలెం స‌మీపంలో జాతీయ ర‌హ‌దారిపై ఈ ప్రమాదం జ‌రిగింది. విజ‌య‌వాడ‌కు చెందిన శ్రీ‌వెంక‌ట క‌న‌క‌దుర్గ ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సు 32 మందితో ప్రయాణికుల‌తో శ‌నివారం రాత్రి అనంత‌పురానికి బ‌య‌లుదేరింది.

అయితే ఆదివారం తెల్లవారు జామున ప్రకాశం జిల్లా, మార్కాపురం మండ‌లం, తిప్పాయ‌పాలెం స‌మీపంలో జాతీయ ర‌హ‌దారిపైన‌ బ‌స్సు అదుపుత‌ప్పి గేదెల‌ను ఢీకొట్టింది. వెంట‌నే బ‌స్సు ప‌క్కనే ఉన్న పొలంలోకి బోల్తా ప‌డింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని క్రేన్ స‌హాయంతో బ‌స్సును తీశారు. అయితే బ‌స్సు నుజ్జునుజ్జు అయింది. బ‌స్సులోని ప్రయాణికుల‌ను అతిక‌ష్టం మీద బ‌య‌ట‌కు తీశారు. ఈ రోడ్డు ప్రమాదంలో అనంత‌పురం జిల్లా ధ‌ర్మవ‌రం టౌన్‌కు చెందిన గ‌జ్జ‌ల శివ‌య్య (42) అక్కడిక‌క్కడే మృతి చెందాడు. ఏడుగురు గాయ‌ప‌డ్డారు.

Whats_app_banner

సంబంధిత కథనం