NRI Deaths: అమెరికా ప్రమాదాలు, స్విమ్మింగ్‌ పూల్‌లో ప‌డి యువ‌కుడు, రోడ్డు ప్రమాదంలో ఆంధ్రా యువతి మృతి-american accidents young man fell in swimming pool andhra young woman died in road accident ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nri Deaths: అమెరికా ప్రమాదాలు, స్విమ్మింగ్‌ పూల్‌లో ప‌డి యువ‌కుడు, రోడ్డు ప్రమాదంలో ఆంధ్రా యువతి మృతి

NRI Deaths: అమెరికా ప్రమాదాలు, స్విమ్మింగ్‌ పూల్‌లో ప‌డి యువ‌కుడు, రోడ్డు ప్రమాదంలో ఆంధ్రా యువతి మృతి

HT Telugu Desk HT Telugu
Jul 22, 2024 07:05 AM IST

NRI Deaths: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఇద్ద‌రు యువ‌తి, యువ‌కులు అమెరికాలో మృతి చెందారు. యువ‌కుడు స్విమింగ్ పూల్‌లోపి చ‌నిపోగా, యువ‌తి రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందింది.

అమెరికాలో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు ప్రవాసాంధ్రుల దుర్మరణం
అమెరికాలో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు ప్రవాసాంధ్రుల దుర్మరణం (HT_PRINT)

NRI Deaths: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఇద్ద‌రు యువ‌తి, యువ‌కులు అమెరికాలో మృతి చెందారు. యువ‌కుడు స్విమింగ్ పూల్‌లోపి చ‌నిపోగా, యువ‌తి రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందింది. ఇద్ద‌రూ గుంటూరు జిల్లా తెనాల‌కి చెందిన‌వారే. ఉన్న‌త చ‌దువుల కోసం రెండు వేర్వేరు కుటుంబాల నుంచి అమెరికా వెళ్లిన యువ‌తి, యువ‌కుడు ప్ర‌మాద‌వ‌శాత్తు మృతి చెందాడు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతా న‌గ‌ర్‌కు చెందిన తాడిబోయిన ర‌వితేజ (28) ఎంఎస్ చేసేందుకు అమెరికాకు గ‌తేడాది ఆగ‌స్టులో వెళ్లాడు. టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ న‌గ‌రంలోని ఓ యూనివ‌ర్శిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. ఈనెల 18న స్నేహితుల‌తో క‌లిసి ఎంజాయ్ చేసేందుకు ర‌వితేజ స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లాడు. స్నేహిత‌లంద‌రూ స్విమ్మింగ్ పూల్‌లోకి దిగ‌గా, ర‌వితేజ కూడా స్విమ్మింగ్ పూల్‌లోకి దిగాడు. అయితే ర‌వితేజ‌కు ఈత రాక‌పోవ‌టంతో నీటి మునిగాడు. ఆయ‌న‌ను స్నేహితులు కాపాడి బ‌య‌ట‌కు తీశారు.

వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించిన స్నేహితులు చికిత్స పొందుతూ తెల్లారితే ఆదివారం చ‌నిపోయాడు. దీంతో కుటుంబ స‌భ్యుల‌కు స్నేహితులు స‌మాచారం ఇచ్చారు. కుటుంబ స‌భ్యులు ఈ విషాద వార్త విని విల‌విల్లాడుతున్నారు. ర‌వితేజ తండ్రి ఏడేళ్ల క్రిత‌మే మ‌ర‌ణించారు. అప్ప‌టి నుంచి త‌ల్లి జ‌య‌ల‌క్ష్మి వ్య‌వ‌సాయ కూలీ ప‌నులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది.

ప‌నులు చేసి దాచుకున్న సోమ్ముతో పాటు కొంత బ్యాంకు రుణం తీసుకొని కుమారుడిని ఉన్న‌త చ‌దువుల‌కు పంపింది. అయితే మ‌ధ్య‌లో తన కుమారుడు కాన‌రాని లోకానికి వెళ్లిపోవ‌డంతో త‌ల్లి జ‌య‌ల‌క్ష్మి రోదిస్తుంది. అంతేకాకుండా స్థానికులు కూడా క‌న్నీరు మున్నీరు అయ్యారు. మృత దేహాన్ని స్వ‌స్థ‌లానికి తెప్పించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను కుటుంబ స‌భ్యులు వేడుకుంటున్నారు.

రోడ్డు ప్ర‌మాదంలో యువ‌తి మృతి

రోడ్డు ప్ర‌మాదంలో తెనాలికి చెందిన యువ‌తి అమెరికాలో మృతి చెందింది. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతాన‌గ‌ర్‌కు చెందిన జెట్టి హారిక (25) వెట‌ర్న‌రీ సైన్స్ పూర్తి చేసి ఫుడ్ అండ్ న్యూట్రిష‌న్‌లో పీజీ చేసేందుకు అమెరికా వెళ్లారు. గ‌తేడాది ఆగ‌స్టులో అమెరికా వెళ్లిన ఆమె ఒక్ల‌హోమా సెంట్రల్ యూనివ‌ర్శిటీలో చ‌దువుతున్నారు.

ఆదివారం తెల్ల‌వారు జామున త‌న తోటి స్నేహితులతో క‌లిసి కాలేజీకి కారులో వెళ్తుండ‌గా ద్విచ‌క్ర‌వాహ‌న‌దారుడు ఒక్క సారిగా కింద ప‌డిపోయాడు. దీంతో హారిక ప్ర‌యాణిస్తున్న కారును వెంట‌నే ఆపేశారు. వెనుక నుంచి వ‌చ్చిన మూడు వాహ‌నాలు ఒక‌దాని త‌రువాత ఒక‌టి హారిక కారును ఢీట్టాయి. దీంతో హారిక అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, కారులో ఉన్న న‌లుగురికి గాయాలు అయ్యాయి. వారికి స్థానికి ఆసుప‌త్రిలో చేర్చారు. ఈ విష‌యాన్ని యూనివ‌ర్శిటీ అధికారులు జెట్టి హారిక త‌ల్లిదండ్రులు జెట్టి శ్రీ‌నివాస‌రావు, నాగ‌మ‌ణికి స‌మాచారం ఇచ్చారు.

దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. త‌ల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. త‌మ కుమార్తె మృత దేహాన్ని స్వ‌స్థ‌లానికి తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మ‌సారి చంద్ర‌శేఖ‌ర్‌, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌, తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ చొరవ తీసుకోవాల‌ని హారిక త‌ల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner