Pawan Kalyan : అలాంటి వారిని వైసీపీ కోవర్టులుగానే చూడండి - పవన్ కల్యాణ్ కామెంట్స్-pawan kalyan slams ycp govt at party meeting at mangalagiri office ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : అలాంటి వారిని వైసీపీ కోవర్టులుగానే చూడండి - పవన్ కల్యాణ్ కామెంట్స్

Pawan Kalyan : అలాంటి వారిని వైసీపీ కోవర్టులుగానే చూడండి - పవన్ కల్యాణ్ కామెంట్స్

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 01, 2023 05:26 PM IST

Janasena Party Latest News : వైసీపీ కులాలను విడగొట్టి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన పవన్… భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్

Janasena Party Latest News :మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో ప్రసంగించిన ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్…. 150 మందితో మొదలైన పార్టీ ఈరోజు 6.5 లక్షల క్రియాశీలక సభ్యులతో బలంగా తయారైందన్నారు. మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మన జనసైనికుల ఉత్సాహం, వారి నిబద్దత చూసి మన పార్టీ కండువా అడిగి మరీ వేయించుకున్నారని గుర్తు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్దిష్టమైన గమ్యం వైపు అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కేవలం 100 రోజులు, 3 నెలల సమయం ఉందన్నారు. సరికొత్త ప్రభుత్వం తీసుకొచ్చేందుకు అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

మనం నిలబడ్డాం…

“మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు, ప్రస్తుత ముఖ్యమంత్రి సోదరి కూడా పార్టీ పెట్టి మరీ పోటీ చేయలేకపోయారు, కానీ జనసేన పోటీ చేయగలిగింది, అది మన భావజాలం తాలూకు బలం.ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకమైన బీజేపీ ఈరోజు మన పార్టీ పట్ల గౌరవం చూపిస్తుంది, అది మన కమిట్మెంట్ కోసం ఇస్తున్న గౌరవం.వైసీపీ పార్టీకి ఒక స్పష్టమైన భావజాలం లేదు, వారికి జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి అని తప్ప వేరే భావజాలం లేదు, జనసేన బలమైన భావజాలం ఉన్న పార్టీ, బలమైన నూతన నాయకత్వం తీసుకురావాలి అని పనిచేసే పార్టీ.స్వార్థం వదిలేసినప్పుడు మాత్రమే బలమైన నాయకులు అవుతారు, మన నేల కోసం మనం పోరాటం చేయాలి, అలా చేసినప్పుడు మాత్రమే ఇతరులు గౌరవిస్తారు.వైసీపీ నాయకులను తరిమేసేందుకు జనసేన - టీడీపీ కలిసి పనిచేస్తున్నాయి, ఇది ప్రజల నుండి, మా పార్టీ లోకల్ నాయకుల నుండి మా దృష్టికి వచ్చింది, అప్పుడే నిర్ణయించుకున్నాం.అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరవాత రాష్ట్ర ప్రయోజనాలపై ఒకరిద్దరు తప్ప ఎవరూ మాట్లాడలేదు, ఆంధ్రులు అనే భావన లేదు, ఉండి ఉంటే మనకు అన్యాయం జరగకుండా అందరూ మాట్లాడేవారు, ఎంత సేపు కులాలుగా విడిపోవడం కాదు, కులాలను కలుపుకుంటూ వెళ్ళాలి, అందరికి అభివృద్ధిలో భాగస్వామ్యం కలిపించాలి” అని పవన్ అన్నారు.

వైసీపీ కులాలను విడగొట్టి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు పవన్ కల్యాణ్. “మనం కులాలను కలుపుకుంటూ అన్ని కులాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం.2019 లో ఓడిపోయిన తరవాత చాలా మంది వెళ్ళిపోయారు. నాదెండ్ల మనోహర్లాం టి వారి, మీలాంటి వారు నాతో నిలబడ్డారు, వెళ్లిపోయిన వారికి ఒక్కటే చెప్తున్నా... 2 పార్లమెంట్ సీట్లతో వచ్చిన బీజేపీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉంది, ఓపిక లేనివారు వదిలేసి వెళ్ళిపోయి నాపై విమర్శలు చేస్తున్నారు, అలాంటివి నేను పట్టించుకోను.2014 రాష్ట్ర విభజన సమయంలో నేను పార్టీ పెట్టకపోయి ఉంటే రాష్ట్రానికి ద్రోహం చేసిన వాడిని అవుతాను, అందుకే పెట్టాను, ఆరోజు పరిస్థితుల్లో టీడీపీకి మద్దతు ఇచ్చాను, రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాను.జగన్ మహాత్మా గాంధీ, వాజ్ పాయ్ లాంటి గొప్ప వ్యక్తి కాదు, ఒక ప్రజా కంఠకుడు అలాంటి వాడు రాష్ట్రానికి మంచిది కాదు.మీరు మంచి పాలన చేయండి మీకు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాను అని వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్తే, జగన్ చాలా నీచంగా వ్యవహరించాడు.ఈ మధ్య ఒక ఇద్దరు, ముగ్గురు మన పార్టీ నాయకులు వైసీపీ లోకి వెళ్ళారు, మనపై విమర్శలు చేస్తున్నారు, రేపు మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మీరు మొహం ఎక్కడ పెట్టుకుంటారు. డబ్బులు లేక పోతే పార్టీ నడపలేం అని అంటే మనం 10 ఏళ్లుగా నడిపి చూపించాం” అని వ్యాఖ్యానించారు పవన్.

అలాంటి వాళ్లు వెళ్లిపోవచ్చు - పవన్

“మనం టీడీపీ వెనుక నడవడం లేదు, కలిసి నడుస్తున్నాం.ప్రతీ ఒక్కరూ ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు తీసుకురావాలి, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు వేస్తారు అనే అపోహ నుండి బయటకు రావాలి, మీరు స్థానిక నాయకుల నుండి అవగాహన కల్పించాలి, ప్రతీ ఓటు కీలకం.చాలా మంది MLA టిక్కెట్ రాకపోతే వెంటనే రాజీనామా చేస్తాం అన్నట్లుగా మాట్లాడుతారు, ఇంకా చాలా ఉన్నాయి, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు ఉన్నాయి, కాబట్టి దూరదృష్టితో ఆలోచించాలి.రాష్ట్రానికి అమరావతి రాజధాని, జగన్ చెప్పినట్లు 3 రాజధానులు అనేవి అవ్వని పని, ఉత్తరాంధ్రకు అభివృద్ధి చేస్తాం, రాయలసీమ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ గా తీర్చిదిద్దుతాం.నేను షూటింగ్ చేస్తుంటే కనీసం నన్ను కలవడానికి కూడా అపాయింట్మెంట్ దొరకని వాళ్ళు ఈరోజు నన్ను విమర్శిస్తున్నారు, అయినా సరే నేను నిలబడ్డాను, పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాను.దశాబ్దం కాలం పాటు ఎవరు ఉన్నా లేకపోయినా పార్టీని నడిపాను, ముందుకు తీసుకెళ్ళాను, కాబట్టి నన్ను అర్దం చేసుకుని మా మాటను నమ్మి నడవండి, నా భావాలు జాతీయ నాయకులకు అర్దం అవుతున్నాయి, ఇక్కడ పుట్టిన కొంతమంది నాయకులకు అర్దం కావడం లేదు, ఎలా అర్దం చేసుకోలేని నాయకులు వెళ్లిపోవచ్చు” అన్నారు పవన్.

జనసేన - టీడీపీ పొత్తులపై ఏ నాయకుడైనా, కార్యకర్తలు తప్పుగా బయట గానీ, సోషల్ మీడియాలో కానీ మాట్లాడినా వారిని వైసీపీ కోవర్టులుగా చూడాలని కామెంట్స్ చేశారు పవన్ కల్యాణ్."మాట్లాడితే ఇది ఎన్నికల కురుక్షేత్రం అని సీఎం జగన్అం టాడు... నువ్వేమీ అర్జునుడు, శ్రీకృష్ణుడు కాదు, లక్ష కోట్లు దోచేసిన వాడివి, నీకు ఆ మాట అనే అర్హత లేదు.గతంలో ఇక్కడ రాజధాని విషయంలో కొన్ని గ్రామాల్లో ప్రజలు అభ్యంతరం చెప్పినప్పుడు నేను వెళ్లి చంద్రబాబు గారితో మాట్లాడాను, చర్చల తరవాత ఆ గ్రామాల్లో భూ సేకరణ చట్టం అమలు చేయలేదు, అది మన బలం, పొత్తు తాలూకు ఉపయోగం" అని అన్నారు.

Whats_app_banner