Odisha IRCTC Tour Package : కోణార్క్, పూరి, చిలికా సరస్సు సందర్శన- రూ.10 వేలలో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే!
Odisha IRCTC Tour Package : ఒడిశాలోని ప్రముఖ దేవాలయాలు కోణార్క్, పూరి సందర్శన, చిలికా లేక్, బీచ్ ల వీక్షణకు ఐఆర్సీటీసీ మూడ్రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గంలో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
Odisha IRCTC Tour Package : ఒడిశాలోని ప్రముఖ పర్యాట ప్రదేశాలు వీక్షించేందుకు ఐఆర్సీటీసీ భువనేశ్వర్ నుంచి మూడు రోజు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. చిలికా సరస్సు, కోణార్క్ , పూరి దేవాలయాల సందర్శన ఈ టూర్ ప్యాకేజీలో అందిస్తున్నారు. ఎక్సోటిక్ ఒడిశా పేరిట రూ.10760 ప్రారంభ ధరతో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ చిన్న పర్యటనలో పూరి జగన్నాథుని ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు చిలికా, బీచ్ లు సందర్శించవచ్చు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గంలో ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ప్రతి రోజూ ఈ టూర్ అందుబాటులో ఉంటుంది.
ఒక్కో వ్యక్తి ధర (01 నుంచి 03 పర్సన్స్)
క్లాస్ | సింగిల్ ఆక్యుపెన్సీ | డబుల్ ఆక్యుపెన్సీ | ట్రిపుల్ ఆక్యుపెన్సీ | చైల్డ్ విత్ బెడ్(5-11 Years) | చైల్డ్ వితవుట్ బెడ్(5-11 Years) |
కంఫర్ట్ | రూ.26870 | రూ.14365 | రూ.10655 | రూ.7005 | రూ.5630 |
ఒక్కో వ్యక్తి ధర (04 నుండి 06 పర్సన్స్)
క్లాస్ | డబుల్ ఆక్యుపెన్సీ | ట్రిపుల్ ఆక్యుపెన్సీ | చైల్డ్ విత్ బెడ్(5-11 Years) | చైల్డ్ వితవుట్ బెడ్(5-11 Years) |
కంఫర్ట్ | రూ.12200 | రూ.10760 | రూ.3645 | రూ.3645 |
ఒక్కో వ్యక్తికి ధర 07 నుండి 10 పర్సన్స్)
క్లాస్ | డబుల్ ఆక్యుపెన్సీ | ట్రిపుల్ ఆక్యుపెన్సీ | చైల్డ్ విత్ బెడ్(5-11 Years) | చైల్డ్ వితవుట్ బెడ్(5-11 Years) |
కంఫర్ట్ | రూ.11450 | రూ.10005 | రూ.3460 | రూ.3460 |
పర్యటన ఇలా
డే 01:
ఉదయం భువనేశ్వర్ విమానాశ్రయం/రైల్వే స్టేషన్ నుంచి పర్యాటకులను పికప్ చేసుకుని కోణార్క్ మీదుగా పూరికి తీసుకెళ్తారు. కోణార్క్ సూర్య దేవాలయం, చంద్ర భాగ బీచ్ సందర్శిస్తారు. సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం చేయాల్సి ఉంటుంది. తర్వాత పూరీకి వెళ్లి హోటల్‌లో డ్రాప్ చేస్తారు. రాత్రి డిన్నర్, బస హోటల్ లోనే ఉంటుంది.
డే 02:
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత, పూరి జగన్నాథ ఆలయ దర్శనం, ఆ తర్వాత చిలికా సరస్సును సందర్శిస్తారు. సతపద వద్ద సీ మౌత్ వరకు బోట్ రైడ్ (బోటింగ్ ఛార్జీలు ప్యాకేజీలో చేర్చలేదు) ఉంటుంది. తిరుగు ప్రయాణంలో అలర్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం పూరీకి తిరిగి వెళ్లి హోటల్ కు చేరుకుంటారు.
డే 03:
బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్-అవుట్ చేస్తారు. భువనేశ్వర్ పట్టణ టూర్ ఉంటుంది. ధౌలి స్థూపం, లింగరాజ్ ఆలయం, ఉదయగిరి, ఖండగిరి గుహలు, ముక్తేశ్వరాలయాన్ని సందర్శి్స్తారు. అనంతరం భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్ లేదా రైల్వే స్టేషన్‌లో పర్యాటకులను ట్రాప్ చేస్తారు.
- ఒడిశా టూర్ ప్యాకేజీ బుక్కింగ్, పూర్తి వివరాలను https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBH03 ఈ లింక్ లో పొందవచ్చు.
- విజయవాడ, హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ కు విమాన సర్వీసుల కోసం https://www.air.irctc.co.in/ ఈ లింక్ పై క్లిక్ చేయండి
- విజయవాడ, హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ కు రైళ్ల సేవల కోసం https://www.irctc.co.in/nget/train-search ఈ లింక్ పై క్లిక్ చేయండి.
సంబంధిత కథనం