NIA Raids :కర్నూలు, కరీంనగర్‌లో ఎన్ఐఏ సోదాలు-nia raids in telangana and andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nia Raids :కర్నూలు, కరీంనగర్‌లో ఎన్ఐఏ సోదాలు

NIA Raids :కర్నూలు, కరీంనగర్‌లో ఎన్ఐఏ సోదాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 10, 2023 01:42 PM IST

NIA Raids in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయి. కర్నూలు ఓల్డ్ సిటీకి చెందిన అబ్దుల్లా, మావియా ఇళ్లలో సోదాలు చేపట్టింది.

ఏపీలో ఎన్ఐఏ సోదాలు
ఏపీలో ఎన్ఐఏ సోదాలు

NIA Raids in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీలోని కర్నూలుతో పాటు తెలంగాణలోని కరీంనగర్ ఈ సోదాలు చేస్తున్నారు. కర్నూలు ఓల్డ్ సిటీకి చెందిన అబ్దుల్లా, మావియా ఇళ్లలో సోదాలు చేస్తోంది. ఇప్పటికే వీరిద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. కరీంగనగర్ జిల్లాకు చెందిన తఫ్రీజ్ ఖాన్ ఇంట్లో సోదాలు చేశారు అధికారులు. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా(PFI)తో సంబంధాలున్నాయన్న అనుమానంతో ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజాము 4 గంటల నుంచే సోదాలు కొనసాగుతున్నాయి.

కరీంగనర్ లోని హుస్సేనీపురలో ఉంటుంటున్న నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI) చెందిన తఫ్రీజ్ ఖాన్ ఇంట్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. సుమారు ఐదు గంటలుగా ఈ రైడ్స్ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో పలు కీలక డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తనిఖీల సమయంలో సంబంధిత వ్యక్తులు ఇంట్లో లేరని… విదేశాల్లో ఉంటున్నట్లు గుర్తించారు. ఇక నగరంలోని పలు కాలనీల్లో కూడా ఎన్ఐఏ సోదాలు చేపట్టారు.

గతంలోనూ ఇదే సంస్థకు చెందిన పలువురుపై ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. పీఎఫ్‌ఐ లింకులపై ఎన్‌ఐఏ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కుపాదం మోపింది. గతేడాది సెప్టెంబర్‌లో సోదాలు చేసింది. నిజామాబాద్, నిర్మల్‌, జగిత్యాలతోపాటు ఏపీలోని కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో దాడులు చేపట్టింది. గతంలో చేపట్టిన సోదాల సమయంలో డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్స్‌ ను స్వాధీనం చేసుకుంది ఎన్‌ఐఏ. తాజాగా మరోసారి సోదాలు చేపట్టడంతో… కరీంనగర్‌లో పీఎఫ్‌ఐ కదలికలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే…. కరీంనగర్ తో పాటు కర్నూలులో ప్రధానంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Whats_app_banner