Gundlakamma-Darsi: గుండ్లకమ్మ-దర్శి మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభం, పుష్కరం తర్వాత పూర్తైన రెండో దశ పనులు-new railway line started between gundlakamma darshi second phase works completed after pushkaram ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gundlakamma-darsi: గుండ్లకమ్మ-దర్శి మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభం, పుష్కరం తర్వాత పూర్తైన రెండో దశ పనులు

Gundlakamma-Darsi: గుండ్లకమ్మ-దర్శి మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభం, పుష్కరం తర్వాత పూర్తైన రెండో దశ పనులు

Sarath chandra.B HT Telugu
Apr 02, 2024 06:15 AM IST

Gundlakamma-Darsi: తుఫాన్లు, ప్రకృతి విపత్తులతో తరచూ అంతరాయాలు తలెత్తే గ్రాండ్ ట్రంక్ మార్గానికి ప్రత్యామ్నయంగా మరో రైల్వే లైన్ సిద్ధం చేస్తున్నారు. గుండ్లకమ్మ-దర్శి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణంలో రెండో దశ పూర్తి చేశారు.

దర్శిలో నిర్మాణం పూర్తైన రైల్వే స్టేషన్
దర్శిలో నిర్మాణం పూర్తైన రైల్వే స్టేషన్

Gundlakamma-Darsi: గుండ్లకమ్మ gundlakamma - దర్శి Darsi మధ్య కొత్త రైల్వే లైన్‌ను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. నడికుడి - శ్రీకాళహస్తి సెక్షన్‌లో 27 కిలోమీటర్ల లైన్‌ నిర్మాణం New Railway line పూర్తి చేశారు. కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించారు.

గుండ్లకమ్మ - దర్శి మధ్య 27 కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గాన్ని పూర్తి చేసి రైళ్ల రాకపోకలకు రెండు రోజుల క్రితం ప్రారంభించారు. ఈ కొత్త రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నడికుడి - శ్రీకాళహస్తి మధ్య కొత్త రైల్వే లైన్ New Railway line ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించారు.

విద్యుదీకరించని రైలు విభాగంలోని రైళ్లు గరిష్టంగా 75 కి.మీ / వేగం తో నడపడానికి అనుమతించినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. నడికుడి - శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ దక్షిణ మధ్య రైల్వే South central railway ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ముఖ్యమైన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

గుంటూరు Guntur, ప్రకాశం Prakasamమరియు నెల్లూరు Nellore జిల్లాలలోని ఎగువ ప్రాంతాలను కలుపుతూ కొత్త ప్రాంతాలతో ఏర్పాటు చేసిన రైలు నెట్‌వర్క్‌‌‌తో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టును 2011-12 సంవత్సరంలో 309 కి.మీ.ల మేర రూ. 2,289 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేశారు .

భారతీయ రైల్వేలతో పాటు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య 50% వ్యయ భాగస్వామ్య ప్రాతిపదికతో, అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించే ఒప్పందంపై ఈ నిర్మాణం చేపట్టారు.

ఐదు దశల్లో ప్రాజెక్టు నిర్మాణం…

మొదటి దశ : పిడుగురాళ్ల - శావల్యపురం (47 కి.మీ)

రెండవ దశ-: గుండ్లకమ్మ - దర్శి (27 కి.మీ)

మూడవ దశ-: దర్శి - కనిగిరి (52 కి.మీ) & వెంకటగిరి - ఆల్తూరిపాడు (15 కి.మీ)

నాలుగవ దశ-: కనిగిరి - పామూరు (35 కిమీ) & అట్లూరిపాడు - వెంకటాపురం (43 కిమీ)

ఐదవ దశ-: పామూరు - ఓబులాయపల్లె - వెంకటాపురం (90 కి.మీ) మధ్య చేపడతారు.

ఇప్పటికే మొదటి సెక్షన్ పూర్తి…

పిడుగురాళ్ల - శావల్యాపురం మధ్య 47 కిలోమీటర్ల మేర మొదటి సెక్షన్‌ ఇప్పటికే పూర్తి చేసి విద్యుదీకరణతో పాటుగా ప్రారంభించింది. నడికుడే-పిడుగురాళ్ల మధ్య ఉన్న సెక్షన్ బీబీనగర్‌ను గుంటూరుతో కలిపే లైన్‌లో ఉంది . శావల్యాపురం-గుండ్లకమ్మ మధ్య ఉన్న సెక్షన్ గుంటూరును గుంతకల్‌తో కలిపే ప్రస్తుత రైలు మార్గంలో వస్తుంది. ఇప్పుడు, గుండ్లకమ్మ - దర్శి మధ్య 27 కి.మీల విస్తరణ పూర్తి చేయడంతో పాటు ప్రారంభించడంతో, నడికుడి - దర్శి మధ్య నిరంతరాయంగా 122 కిలోమీటర్ల రైలు మార్గము, రైలు రాకపోకలు నిర్వహణకు అందుబాటులో ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైలు నెట్‌వర్క్ విస్తరణలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. విజయవాడ మరియు చెన్నై మధ్య ప్రస్తుత కోస్టల్ రైల్వే లైన్‌కు ప్రత్యామ్నాయ మార్గంగా దీనిని ఉపయోగించవచ్చు.

ప్రస్తుత మార్గం మెరుగ్గా ఉన్నా ఈ మార్గం కొన్నిసార్లు తుఫానులు వరదలకు గురవుతుంది. ఫలితంగా పలుమార్లు రైళ్లు రద్దు చేయాల్సి వస్తోందని రైల్వే వర్గాలు తెలిపాయి. రైలు ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా ప్రతిపాదిత కొత్త మార్గం ప్రత్యామ్నాయ మార్గంగా పని చేయనుంది.

ఖనిజ సంపన్న ప్రాంతంలో సరుకు రవాణాను సులభతరం చేస్తుందని, గణనీయమైన ప్రయాణీకుల రాకపోకలు సాగించేందుకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు - తిరుపతి పట్టణాల మధ్య తక్కువ దూరం గల మార్గంగా ఉపయోగపడుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం