Nandyal ICDS Recruitment : నంద్యాల జిల్లాలో 68 అంగన్వాడీ పోస్టుల భర్తీ, దరఖాస్తు విధానం ఇలా?-nandyal icds recruitment 68 anganwadi posts notification released application process ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nandyal Icds Recruitment : నంద్యాల జిల్లాలో 68 అంగన్వాడీ పోస్టుల భర్తీ, దరఖాస్తు విధానం ఇలా?

Nandyal ICDS Recruitment : నంద్యాల జిల్లాలో 68 అంగన్వాడీ పోస్టుల భర్తీ, దరఖాస్తు విధానం ఇలా?

Bandaru Satyaprasad HT Telugu
Oct 09, 2024 05:11 PM IST

Nandyal ICDS Recruitment : నంద్యాల జిల్లాలోని ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 68 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 10 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.

నంద్యాల జిల్లాలో 68 అంగన్వాడీ పోస్టుల భర్తీ, దరఖాస్తు విధానం ఇలా?
నంద్యాల జిల్లాలో 68 అంగన్వాడీ పోస్టుల భర్తీ, దరఖాస్తు విధానం ఇలా?

Nandyal ICDS Recruitment :నంద్యాల జిల్లా పరిధిలో 6 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, మిని అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ ఆయాల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

మొత్తం 68 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. 6 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మెయిన్ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు 6, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 2, అంగన్వాడీ ఆయా పోస్టులు 60 ఉన్నట్లు నోటిఫికేషన్ తెలిపారు.

రేపటి నుంచి(అక్టోబర్‌ 10) నుంచి సీడీపీఓలు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబరు 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నంద్యాల అర్బన్, బనగానపల్లి, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్‌, నందికొట్కూరు ప్రాజెక్టుల పరిధిలో 68 ఖాళీలు ఉన్నాయి.

ఖాళీలు

1. మెయిన్‌ అంగన్వాడీ కార్యకర్తలు : 06

2. మినీ అంగన్వాడీ కార్యకర్తలు : 02

3. అంగన్వాడీ ఆయాలు : 60

అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు అర్హతలు

1. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

2. అభ్యర్థినులు 01.07.2024 నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 ఏళ్ల వయస్సు లోపు వారై ఉండాలి.

3. అభ్యర్థినులు తప్పనిసరిగా వివాహితురాలై, స్థానికంగా నివసిస్తుండాలి.

4. ఎస్సీ, ఎస్టీ నివాస ప్రాంతాలలో అభ్యర్థినులు 21 ఏళ్ల వయసు నిండిన వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారిని పరిగణలోనికి తీసుకుంటారు.

మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ ఆయా పోస్టులకు అర్హతలు

1. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఒకవేళ 10వ తరగతి వాళ్లు ఎవరూ లేకపోతే దిగువ తరగతుల్లో ఎక్కువ చదువు చదివి ఉత్తీర్ణులైన వారు అర్హులు.

2. అభ్యర్థినులు 01.07.2024 నాటికి 21 వ సంవత్సరాల వయస్సు నిండి 35 ఏళ్ల వయస్సు లోపు వారై ఉండాలి.

3. అభ్యర్థినులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండి, స్థానికంగా నివసిస్తుండాలి.

4. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలలో 21 ఏళ్ల అభ్యర్థినులు లేకపోతే 18 ఏళ్లు నిండిన వారిని పరిగణలోకి తీసుకుంటారు.

అవసరమయ్యే ధ్రువపత్రాలు

1. పుట్టిన తేదీ/ వయస్సు ధ్రువీకరణ పత్రం

2. కుల ధ్రువీకరణ పత్రం

3. విద్యార్హత ధ్రువీకరణ పత్రం - ఎస్ఎస్సీ మార్క్‌ లిస్ట్‌, టీసీ, ఎస్ఎస్సీ లోపు ఎక్కువ తరగతి చదివిన మార్క్‌ లిస్ట్‌, టీసీ

4. నివాస ధ్రువీకరణ పత్రం

5. వితంతువు అయితే భర్త డెత్ సర్టిఫికెట్, 18 సంవత్సరాల పిల్లలు ఉంటే వారి వయస్సు ధ్రువీకరణ పత్రం

6. వికలాంగులు అయితే పి.హెఎచ్‌ సర్టిఫికేట్‌

7. ఆధారు కార్డ్‌

8. రేషన్‌ కార్డు

దరఖాస్తుదారులు ఈ సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలను (సెల్ఫ్‌ అట్టెస్టేషన్‌) సీడీపీవో ఆఫీసులో అక్టోబర్ 10 ఉదయం 10.30 గంటల నుంచి అక్టోబర్ 21 సాయంత్రం 5.00 గంటల లోపు సమర్పించాలి.

Whats_app_banner

సంబంధిత కథనం