Kuppam Walls With Jagan Slogans : కుప్పం ఫస్ట్ టార్గెట్.. వై నాట్ 175-kuppam walls with ysrcp slogans why not 175 and first target kuppam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kuppam Walls With Jagan Slogans : కుప్పం ఫస్ట్ టార్గెట్.. వై నాట్ 175

Kuppam Walls With Jagan Slogans : కుప్పం ఫస్ట్ టార్గెట్.. వై నాట్ 175

Anand Sai HT Telugu
Sep 21, 2022 08:53 PM IST

CM Jagan kuppam Tour : ఏపీలో రోజురోజుకు రాజకీయం వేడెక్కుతోంది. సీఎం జగన్ కుప్పం పర్యటన నేపథ్యంలో అక్కడ మెుత్తం వైసీపీ నినాదాలే కనిపిస్తున్నాయి. వై నాట్ 175 అనే లైన్లు దర్శనమిస్తున్నాయి. జగన్ కుప్పం పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సహం పెరుగుతోంది.

కుప్పంలోని గోడలు
కుప్పంలోని గోడలు

సీఎం జగన్(CM jagan) శుక్రవారం కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దీంతో అధికార వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. కుప్పం(Kuppam)లో వైఎస్ఆర్ చేయూత పథకం మూడో విడత ప్రారంభోత్సవంతోపాటు రూ.66 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

ముఖ్యమంత్రి పర్యటనను కుప్పం లోకల్ లీడర్లు సైతం చాలా సీరియస్ గా తీసుకున్నారు. పట్టణాన్ని అలంకరించారు. గోడలపై జగన్, పార్టీ సీనియర్ నాయకుల చిత్రాలను గీస్తూ నినాదాలు రాస్తున్నారు. '175/175 ఎందుకు కాదు?'(Why Not 175/175) వంటి నినాదాలతో గోడలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ టార్గెట్ కుప్పం(First Target Kuppam) అనే ట్యాగ్ లైన్ తో శ్రేణులు సంబరపడి పోతున్నారు.

2024 ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ విజయం సాధించాలని కొన్ని నెలలుగా జగన్(Jagan) తన పార్టీ నేతలను ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) వరుసగా ఏడుసార్లు గెలిచిన కుప్పం నుంచి 'మిషన్ 175'(Mission 175) ప్రారంభం కావాలని చెప్పారు.

ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ చేయూత(YSR Cheyutha) కింద సహాయాన్ని అందించడానికి కుప్పం సెగ్మెంట్‌ను ఎంచుకోవడం పెద్ద ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలుపొందడం పక్కా అసాధ్యమన్న భావనను జనాల్లో బలపరిచే వ్యూహంలో భాగంగానే సీఎం జగన్ పర్యటన(CM Jagan Tour) అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు స్థానిక వైసీపీ సీనియర్ నేతలు(YCP Senior Leaders) ఎప్పటికప్పుడు పార్టీ బలాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో అనేక మంది టీడీపీ నేతల(TDP Leaders)ను వైసీపీలోకి తీసుకురాగలిగారు. స్థానిక ఎన్నికల్లోనూ.. అధికార పార్టీ విజయం సాధించింది. పట్టణ మరియు గ్రామీణ స్థానిక సంస్థలను గెలుచుకుంది. అయితే ఇలాంటి సమయంలో కుప్పంలోని టీడీపీ లీడర్లకు ఏం చేయాలో తెలియట్లేదనే అభిప్రాయం ఉంది.

చివరిసారిగా చంద్రబాబు కుప్పం పర్యటన(Chandrababu Kuppam Tour)లో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే అప్పుడు వైసీపీపై విమర్శలు వచ్చాయని.. డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకేనని జగన్ పర్యటన అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

' చంద్రబాబు నుంచి కుప్పం తీసుకోవచ్చని కలలు కంటారు. 175/175 ప్లాన్‌ అంటే అంత ఈజీ కాదు. మైనింగ్ మాఫియాను, అభివృద్ధి పనుల్లో వివక్షను చంద్రబాబు బయటపెట్టారు. వైసీపీకి ఇప్పటికే దెబ్బ తగిలింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన ఆందోళనతో ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయారు. ఏం చేసినా కుప్పంలో ఏం చేయలేరు.'అని టీడీపీ సీనియర్ నేత ఒకరు అన్నారు.

IPL_Entry_Point