TDP Sitting MLAs : టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టిక్కెట్లు.... చంద్రబాబు-tdp president chandra babu naidu bumper offer to sitting mlas ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tdp President Chandra Babu Naidu Bumper Offer To Sitting Mlas

TDP Sitting MLAs : టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టిక్కెట్లు.... చంద్రబాబు

B.S.Chandra HT Telugu
Sep 16, 2022 09:00 AM IST

TDP Sitting MLAs తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బంపరాఫర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికి మళ్లీ సీట్లు గ్యారంటీ అని ప్రకటించారు. 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరపున గెలిచిన వారందరికీ మళ్లీ టిక్కెట్లు ఖాయమని ఆఫర్‌ ఇచ్చేశారు. చంద్రబాబు బ్రహ్మాండమైన ఆఫర్‌ ఇచ్చినా ఆ పార్టీలో కొంతమంది దానిని వాడుకోలేని పరిస్థితి ఉంది.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు

TDP Sitting MLAs వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం చంద్రబాబు బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించారు. టీడీపీ తరపున గెలిచిన వారందరికి మళ్లీ టిక్కెట్లు ఖాయమని ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున 23మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారందరికి మళ్లీ పార్టీ టిక్కెట్టు ఖాయమని చంద్రబాబు ప్రకటించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలుTDP Sitting MLAs అందరికీ ఈసారి టికెట్లు ఖాయమైనట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సందర్భంగా గురువారం సాయంత్రం తన నివాసంలో జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. అసెంబ్లీలోను, బయటా టీడీపీ ఎమ్మెల్యేలు వీరోచితంగా పోరాడుతున్నారని వారందరికీ మళ్లీ టికెట్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చేశారు. పోటీ చేసిన వారందరినీ గెలిపించుకొని తీసుకువస్తానని చెప్పారు.

1994లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమతో ఉన్న మొత్తం 74మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలకుTDP Sitting MLAs టికెట్లు ఇచ్చామని వారిలో ఒకరు తప్ప అందరూ తిరిగి గెలిచారని’ చంద్రబాబు చెప్పారు. అప్పట్లో కళా వెంకట్రావు ఒక్కరే గెలవలేదని, ఆయనకు కూడా తర్వాత రాజ్యసభ టికెట్టు ఇచ్చి ప్రమోషన్‌ కల్పించారని ఒక ఎమ్మెల్యే గుర్తు చేశారు. వైసీపీలో 70మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వొద్దని పీకే బృందం సిఫారసు చేసిందంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్త ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ‘వైసీపీలో పరస్పరం బ్లాక్‌ మెయిల్‌ చేసుకొంటున్నారని టికెట్లు ఇవ్వబోనని ఎమ్మెల్యేలను జగన్‌ బెదిరిస్తున్నారని టికెట్లు ఇవ్వనప్పుడు చాకిరీ ఎందుకని ఎమ్మెల్యేలు పైపైన తిరుగుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు వీరోచితంగా పోరాడుతున్నారని చంద్రబాబు ప్రోత్సహించారు.

టీడీపీ ఎమ్మెల్యేల పోరాటాన్ని అభినందిస్తూ, TDP Sitting MLAs సిటింగ్‌ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతూ కేసుల్లో ఇరుక్కొంటున్న వారికి కింది స్థాయిలో కార్యకర్తలకు అండగా నిలుస్తూ ప్రజల్లో పనిచేస్తున్న వారికి కూడా టికెట్లు ఖాయంగా ఇస్తానని వెల్లడించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోరాటానికి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.

మరోవైపు అసెంబ్లీలో అమరావతిపై సీఎం జగన్‌ ద్వేషానికి అర్థంలేదని చంద్రబాబు అన్నారు. ‘అమరావతికి అంకురార్పణ, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగాయని, జగన్‌ కూడా అసెంబ్లీలో ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. అమరావతి వల్ల నాకు పేరు వస్తుందని దానిపై ద్వేషం పెంచుకొంటే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి నిర్మాణమై అక్కడ సంపద సృష్టి జరిగితే మొత్తం రాష్ట్రం ప్రయోజనం పొందుతుందని, హైదరాబాద్‌ నగరం అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం ప్రయోజనం పొందుతుందన్నారు.

ఆ‎ఫర్‌ అందరికీ వర్తిస్తుందా.....

TDP Sitting MLAs సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికి మళ్లీ టిక్కెట్లు ఇస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఆఫర్ ప్రకటించినా ఎంతమంది తీసుకుంటారనే చర్చ ప్రారంభమైంది. టీడీపీ 23 స్థానాలకు పరిమితమైన తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమైపోయారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌, గుంటూరులో మద్దాల గిరిలు అనధికారికంగా వైసీపీలో కొనసాగుతున్నారు. చంద్రబాబు ప్రకటించిన ఆఫర్ వారికి కూడా వర్తిస్తుందా అని సెటైర్లు వినిపిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రకటించిన ఆఫర్ ఎంపీలకు ఎందుకు ఇవ్వలేదనే చర్చ కూడా నడుస్తోంది.

IPL_Entry_Point

టాపిక్