Pawan Varahi Yatra : భీమవరంలో నేను ఓడిపోలేదు.. ఇదే నిదర్శనమన్న పవన్-janasena chief pawankalyan fires on cm jagan govt at bhimavaram ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Varahi Yatra : భీమవరంలో నేను ఓడిపోలేదు.. ఇదే నిదర్శనమన్న పవన్

Pawan Varahi Yatra : భీమవరంలో నేను ఓడిపోలేదు.. ఇదే నిదర్శనమన్న పవన్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 30, 2023 10:02 PM IST

Pawan Varahi Vijaya Yatra : జగన్ ప్రభుత్వంలో పచ్చని చెట్లు కూడా మౌన పోరాటం చేస్తున్నాయన్నారు పవన్ కల్యాణ్. భీమవరంలోని అంబేద్కర్ సెంటర్ ప్రసంగించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

Janasena Varahi Vijaya Yatra: జనసేన పార్టీకి ఓటమి, గెలుపు ఉండదని….. ప్రయాణమే ఉంటుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శుక్రవారం భీమవరంలోని అంబేద్కర్ సెంటర్ లో ప్రసంగించిన ఆయన… ఓ మార్పు కోసం జనసేన పోరాటం చేస్తుందన్నారు. దశాబ్ధి కాలంగా పోరాటం చేస్తున్నామని… ఇవన్నీ సరదాల కోసం చేయటం లేదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకెళ్తున్నామని చెప్పారు. భీమవరంలో తాను ఎప్పుడు ఓడిపోలేదని… ఇవాళ్టి జనసేన సభకు వచ్చిన ప్రజాధరణే అందుకు నిదర్శనమన్నారు.

"ప్రతిదానికి పోరాటం చేయక తప్పుదు. ఇవాళ్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి... పచ్చని చెట్లు కూడా మౌన పోరాటం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్తే పచ్చని చెట్లను నరికివేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ దళిత డ్రైవర్ ను ఎమ్మెల్సీ చనిపోతే ఎవరికి పట్టని పరిస్థితి. పదో తరగతి విద్యార్థిని పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. మద్యపాన నిషేధమని చెప్పి... లక్ష కోట్లు సంపాదించటంపై స్పందన లేదు. వ్యవస్థను వైసీపీ ఛిన్నాభిన్నం చేస్తుంటే చూస్తు ఉండటం సరికాదు. నిజానికి ఇది జనసేన ఒక్కరి సమస్య కాదు. ఇది అందరి సమస్య. అందుకే పోరాటం చేస్తున్నాం. భీమవరంలో ఇంత మంది వచ్చారంటే... ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం. 151 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీపై మనం పోరాడుతున్నాం. గుండా, దోపిడీ వ్యవస్థకు ఎదురొడ్డి నిలిచాం. మన లక్ష్యం మార్పు తీసుకురావటమే" అని పవన్ స్పష్టం చేశారు.

వైసీపీ పాలనలో అన్నివర్గాలను మోసం చేశారని పవన్ విమర్శించారు. జాబ్ క్యాలెండర్ లేదని… ఉద్యోగాల భర్తీ విషయంలో మాట తప్పారని దుయ్యబట్టారు. పరిశ్రమల విషయంలో అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి ఎంతో చేశామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. “యువత కోసం వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది. భీమవరం నుంచి ఎందరో విదేశాలకు వెళ్లి రాణించారు. విదేశాలకు బ్రెయిన్‌ డ్రెయిన్‌ ఎందుకు కొనసాగుతోంది? విదేశీ విద్యా పథకానికి అంబేడ్కర్‌ పేరు ఉండాలి. అలాంటి వ్యక్తి పేరు ఎందుకు పెట్టలేదు” అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తారని ఆశిస్తున్నానని చెప్పిన పవన్… జనసేన సత్తా ఏంటో చాటాలని అభిప్రాయపడ్డారు.

Whats_app_banner

సంబంధిత కథనం