Ys Sharmila: అన్న పార్టీ ఓటమిలో చెల్లెళ్ల పాత్ర ఎంత, తానోడి వైసీపీని ఓడించిందా? షర్మిల చేసిన చేటు ఎంత?-how did the andhra pradesh elections shake up political families ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila: అన్న పార్టీ ఓటమిలో చెల్లెళ్ల పాత్ర ఎంత, తానోడి వైసీపీని ఓడించిందా? షర్మిల చేసిన చేటు ఎంత?

Ys Sharmila: అన్న పార్టీ ఓటమిలో చెల్లెళ్ల పాత్ర ఎంత, తానోడి వైసీపీని ఓడించిందా? షర్మిల చేసిన చేటు ఎంత?

Sarath chandra.B HT Telugu
Jun 10, 2024 02:02 PM IST

Ys Sharmila: ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన ఆయన సోదరి వైఎస్ షర్మిల నుంచి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి గట్టి సవాల్ ఎదురైంది. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంలో షర్మిల పాత్ర కూడా ఉంది.

వైఎస్ జగన్ ఓటమిలో షర్మిల పాత్ర ఎంత?
వైఎస్ జగన్ ఓటమిలో షర్మిల పాత్ర ఎంత? (Twitter)

Ys Sharmila: ఆంధ్రప్రదేశ్‌‌లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వైసీపీ పరాజయంలో షర్మిల సైతం తన వంతు పాత్ర పోషించారు. తాజా ఎన్నికల్ల షర్మిల ఓటమిని మూటగట్టుకున్న సొంత సోదరుడిని అధికారం నుంచి దించడంలో మాత్రం విజయం సాధించారు.

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా హింసాత్మకంగా మారాయి. ఎన్నికలకు ముందే రాష్ట్రంలోని పలు రాజకీయ కుటుంబాల్లో విభేదాలు తలెత్తాయి. తోబుట్టువులు రాజకీయంగా ఎదురుపడ్డారు, ఉత్తరాంధ్రలో సొంత కొడుకే తండ్రిని ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. భర్తపై పోటీకి దిగిన భార్య చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నా భర్తకు ఓటమి మాత్రం తప్పలేదు.

కుటుంబ కలహాల నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల నుంచి గట్టి సవాల్ ఎదురైంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో తెలంగాణలో రాజకీయాల్లోకి ప్రవేశించి, ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం అయిన తర్వాత షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పగ్గాలను చేపట్టి అన్నను ఓడించడమే లక్ష్యంగా పనిచేశారు. సోదరుడిని నేరుగా విమర్శించడంతో పాటు వివేకా హత్య కేసులో నిందితులను కాపాడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో సునీతా నర్రెడ్డితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.

జగన్ వైఎస్సార్ రాజకీయ వారసుడు కాదని, వైయస్ పాలనకు, జగన్ నేతృత్వంలోని ప్రభుత్వాలకు పోలిక లేదని... జగన్ పాలన హంతక రాజకీయాలతో కళకళలాడుతోంది' అని షర్మిల ఏప్రిల్ 8న కడప జిల్లా మైదుకూరులో విమర్శించారు.

కడప లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షర్మిల వివేకానందరెడ్డి పోటీ చేశారు. ఆమె ప్రత్యర్థిగా వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌ రెడ్డిని వైఎస్సార్సీపీ తరపున బరిలోకి దింపారు. ఎన్నికల్లో తాను ఓడిపోయినా షర్మిల 1.4 లక్షల పైచిలుకు ఓట్లు సాధించి 62,695 ఓట్ల తేడాతో గెలిచిన అవినాష్ రెడ్డికి నష్టం కలిగించ గలిగారు.

తన చిన్నాన్న వివేకానందరెడ్డిని ఎవరు చంపారో కడప ప్రజలకు తెలుసునని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి… ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి పూర్తి మద్దతు పలికారు. అవినాష్ రెడ్డి జీవితాన్ని నాశనం చేసేందుకు కుట్ర జరుగుతోందని, అందులో తన చెల్లెళ్లు షర్మిల, నర్రెడ్డి భాగస్వాములని ఆరోపించారు.

అవినాష్ రెడ్డికి జగన్ మోహన్ రెడ్డి మద్దతు తెలపడంతో రాజశేఖర్ రెడ్డి సతీమణి, తోబుట్టువుల తల్లి వైయస్ విజయమ్మ తన కుమార్తె షర్మిలకు మద్దతు తెలుపుతూ కడప లోక్ సభ ఓటర్లను తన కుమార్తెకు ఓటు వేయాలని కోరారు. ఎన్నికల్లో షర్మిల ఓటమి పాలైనా రాష్ట్రంలో 151 స్థానాలతో 2019లో గెలిచిన వైఎస్సార్సీపీ 2024నాటికి 11 స‌్థానాలకు పరిమితం చేయడంలో షర్మిల తన వంతు పాత్ర పోషించారు.

విజయవాడ లోక్ సభ నియోజకవర్గంలో అన్నదమ్ములు కేశినేని శ్రీనివాస్, కేశినేని శివనాథ్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. టీడీపీలో టిక్కెట్ నిరాకరించడంతో వైసీపీలో చేరిన కేశినేని నానిని విజయవాడ ఎంపీగా వైసీపీ ప్రకటించింది. ఆయన తమ్ముడు శివనాథ్‌ను టీడీపీ నుంచి బరిలోకి దింపారు. కేశినేని శ్రీనివాస్ కొన్ని నెలల క్రితం వరకు టీడీపీలో కీలక నేతగా ఉన్నప్పటికీ పార్టీ నేతలతో విభేదాలు రావడంతో జనవరిలో వైసీపీలోకి జంప్ చేశారు. వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నాని చివరకు పరాజయం పాలయ్యారు.


ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసీపీ టెక్కలి అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి పలు కారణాలతో తన భర్తపై పోటీకి సిద్ధమయ్యారు. చివరి క్షణంలో పార్టీ సీనియర్ నేతలు ఆమెకు నచ్చజెప్పడంలో సఫలమయ్యారు. ఆమె పోటీ నుంచి విరమించుకున్నా ఓటమి తప్పలేదు.

వైఎస్సార్సీపీ అనకాపల్లి లోక్‌సభలో ఉపముఖ్యమంత్రి బి.ముత్యాలనాయుడు కుమారుడు రవికుమార్ మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచి తన సవతి సోదరి ఇ.అనురాధపై పోటీ చేసి ఓడిపోయారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం