AP EdCET Final Admissions: ఏపీ ఎడ్‌సెట్‌ 2024 తుది విడత అడ్మిషన్లకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్-higher education council notification for ap edcet 2024 final batch admissions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Edcet Final Admissions: ఏపీ ఎడ్‌సెట్‌ 2024 తుది విడత అడ్మిషన్లకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్

AP EdCET Final Admissions: ఏపీ ఎడ్‌సెట్‌ 2024 తుది విడత అడ్మిషన్లకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 19, 2024 10:17 AM IST

AP EdCET Final Admissions: ఏపీ ఎడ్‌ సెట్‌ 2024 తుది విడత అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఎడ్‌ సెట్‌ 2024 అడ్మిషన్లు పూర్తయ్యాయి. రెండో విడత అడ్మిషన్ల కోసం ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నేటి నుంచి సెప్టెంబర్ 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఏపీ ఎడ్‌సెట్‌ తుది విడత అడ్మిషన్లకు నోటిఫికేషన్
ఏపీ ఎడ్‌సెట్‌ తుది విడత అడ్మిషన్లకు నోటిఫికేషన్

AP EdCET Final Admissions: ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల బిఇడి కోర్సుల్లో అడ్మిషన్ల కోసం తుది విడత అడ్మిషన్ నోటిఫికేషన్‌ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. సెప్టెంబర్ 19 నుంచి 21వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బిఇడి, బిఇడి స్పెషల్ ఎడ్యుకేషన్‌ రెండేళ్ల కోర్సుల్లో ప్రవేశాల కోసం తుది విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. 2024-5 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం బిఇడి కోర్సులో ప్రవేశాల కోసం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ చేపడుతున్నారు.

రెండో విడత కౌన్సిలింగ్‌ హాజరయ్యే అభ్యర్థులు నిర్ణీత రుసుము చెల్లించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులు కౌన్సిలింగ్ కోసం రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.600చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను ఉన్నత విద్యామండలి కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్స్‌ సైట్‌లో అందుబాటులో ఉంచారు.

AP EdCET ఏపీ ఎడ్ సెట్-2024 అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఎడ్ సెట్-2024లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉన్నత విద్యామండలి తెలిపింది. బీఈడీ మొదటి సంవత్సరం, స్పెషల్ బీఈడీలో ప్రవేశాలకు ఏపీ ఎడ్ సెట్-2024 నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు 2024-25 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ, అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 28 నుంచి కాలేజీల్లో చేరాల్సి ఉంటుుంది.

రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు

అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లింక్ https://edcet-sche.aptonline.in/EdCET2024/Views/index.aspx లో అవసరమైన డాక్యుమెంట్ల స్కాన్ కాపీలు సమర్పించాలని అధికారులు తెలిపారు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ, ఎస్సీ, పీహెచ్ అభ్యర్థులు రూ.600 ప్రాసెసింగ్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచిన నోటిఫికేషన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఈ లింకును అనుసరించండి..

సర్టిఫికెట్ల జాబితా ఇదే

1) A.P. Ed.CET-2024 హాల్ టికెట్

2) A.P. Ed.CET-2024 ర్యాంక్ కార్డు

3) బదిలీ సర్టిఫికేట్ (T.C.)

4) డిగ్రీ మార్కుల మెమోలు/కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో

5) డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్

6) ఇంటర్మీడియట్ మార్కుల మెమో/డిప్లొమా మార్కుల మెమో

7) ఎస్.ఎస్.సి. లేదా దానికి సమానమైన మార్క్స్ మెమో

8) 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు

9) నివాస ధృవీకరణ పత్రం ( ప్రైవేట్ అభ్యర్థులకు)

10) 10 సంవత్సరాలుగా ఏపీ బయట ఉద్యోగం చేస్తుంటే...తల్లిదండ్రుల్లో ఎవరిదైనా నివాస ధృవీకరణ పత్రం

11) ఆదాయ ధృవీకరణ పత్రం లేదా రేషన్ కార్డు

12) SC/ST/BC లకు సంబంధిత అధికారుల జారీచేసిన కుల ధృవీకరణ పత్రం

13) ఇటీవల తీసుకున్న EWS సర్టిఫికేట్

14) 2014 జూన్ 2 నుంచి ఏడేళ్ల లోపు ఏపీకి వలసవచ్చిన వారిని స్థానిక అభ్యర్థులుగా గుర్తించారు. వారు లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://edcet-sche.aptonline.in/EdCET2024/Views/index.aspx

రెండో విడత కౌన్సిలింగ్‌లో అడ్మిషన్లు పొందిన విద్యార్ధులు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన తేదీలు దిగువున ఉన్నాయి.