Kidney Patients : కిడ్నీ బాధిత ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలు….-health minister rajini assures separate dialysis centre for kidney patients in ntr distirct ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kidney Patients : కిడ్నీ బాధిత ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలు….

Kidney Patients : కిడ్నీ బాధిత ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలు….

HT Telugu Desk HT Telugu
Nov 20, 2022 09:45 AM IST

Kidney Patients ఆంధ్రప్రదేశ్‌లో ఉద్దానం తర్వాత అత్యధిక స్థాయిలో కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్న ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు, ఏ కొండూరు ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్న ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ మంత్రితో పాటు, వైద్య శాఖ కార్యదర్శి పర్యటించి బాధితుల నుంచి వివరాలను సేకరించారు.

ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరులో కిడ్నీ వ్యాధి బాధితలతో మాట్లాడుతున్న మంత్రి రజిని
ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరులో కిడ్నీ వ్యాధి బాధితలతో మాట్లాడుతున్న మంత్రి రజిని

Kidney Patients ఎన్టీఆర్‌ జిల్లా ఏ కొండూరులో కిడ్నీ వ్యాధులతో జనం పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతుండటంతో ప్రభుత్వం స్పందించింది. ఏ కొండూరు కిడ్నీ వ్యాధి బాధితులకు అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. శాశ్వ‌త ప‌రిష్కారం దిశ‌గా సత్వ‌ర చ‌ర్య‌లు చేపడతామని మంత్రి రజిని హామీ ఇచ్చారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా సాయం చేపడతామని ప్రకటించారు. వారం రోజుల్లో ఏ కొండూరులో నూత‌న డ‌యాల‌సిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఫ్యామిలీ డాక్ట‌ర్ విధానం ద్వారా కిడ్నీ వ్యాధులకు మందులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.

ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ప్ర‌భావం చూపుతున్న నేప‌థ్యంలో స్థానిక ప్ర‌జ‌ల‌కు అందుతున్న వైద్య సేవ‌లు, ప్ర‌భుత్వం నుంచి అందుతున్న ఫ‌లాలు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను క్షేత్ర‌స్థాయిలో తెలుసుకునేందుకు మంత్రి విడ‌ద‌ల ర‌జినితో పాటు, వైద్య ఆరోగ్య‌శాఖ ఉన్న‌తాధికారులు గ్రామాలను పరిశీలించారు.

ఎ.కొండూరు మండ‌లం మాంసింగ్ తండాకు వెళ్లారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌తో స‌మావేశ‌మ్యారు. కిడ్నీ రోగుల‌తో ప్ర‌త్య‌క్షంగా మాట్లాడారు. అనంత‌రం దీప్లాన‌గ‌ర్‌కు వెళ్లారు. అక్క‌డి కిడ్నీ వ్యాధి బాధితుల‌తో మాట్లాడారు. స్థానిక స‌మ‌స్య‌ల‌పై అక్క‌డి వారితో చ‌ర్చించారు. అక్క‌డి నుంచి ఎ.కొండూరు పీహెచ్‌సీని సంద‌ర్శించారు. కిడ్నీ వ్యాధి రోగుల‌కు అక్క‌డ అందుతున్న సేవ‌ల‌పై ఆరా తీశారు. అందుబాటులో ఉన్న మందులు, వ్యాధి నిర్థార‌ణ‌ ప‌రిక‌రాలను ప‌రిశీలించారు. ఆయుష్ వైద్య‌శాల‌లో కొత్త‌గా ఏర్పాటుచేయ‌బోతున్న డ‌యాల‌సిస్ కేంద్రాన్ని త‌నిఖీచేశారు.

ఏ.కొండూరు మండలంలో కిడ్నీ బాధితుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో హెల్త్ సెక్రెటరీ కృష్ణబాబు అడిగిన ప్రశ్నలకు స్థానిక వైద్యాధికారులు నీళ్లు నమిలడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సమాచారం లేకుండా పొంతన లేకుండా జవాబులు ఇచ్చిన వైద్య సిబ్బందిపై హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ఏం జరుగుతుందో సమాచారం లేకుండా ఎలా ఉన్నారని, మందలించి ఇంకో సారి ఇలాంటివి జరిగితే మీ స్థానంలో కొత్తవారు వస్తారని హెచ్చరించారు.

తిరువూరు నియోజకవర్గ ప్రజలకు ఇప్పటికే తిరువూరులో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేశామని,ఏ. కొండూరులో కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఇంటింటికి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని చెప్పారు.

ప్రభుత్య ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని ,టెస్టులు చేయించుకోవాడికి అన్ని సౌకర్యాలు పి.హెచ్.సి లో ఉన్నాయని,విజయవాడ వెళ్లే కిడ్నీ బాధితుల కోసం బస్సును ఏర్పాటు చేశామన్నారు. ఏ. కొండూరు మండలంలోని తండాల్లో కిడ్నీ సమస్యలను తెలుసుకొనేందుకు జగన్ ఆదేశాల మేరకు ప్రవేటు ఆసుపత్రిలో కొనే మందులు ప్రభుత్య ఆసుపత్రిలో ఇస్తున్నామని, నెప్రలాజిస్టు సలహా మేరకు 15 రకాల మందులు కూడా ప్రభుత్వ హాస్పిటల్ లో ఉచితంగా ఇస్తున్నామని మంత్రి విడదల రజని చెప్పారు.

విజయవాడలో 12 హాస్పిటల్స్ లో కిడ్నీబాధితులు కోసం ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని మంత్రి విడదల రజని చెప్పారు. 6 నెలలలో 35 కోట్ల రూపాయలతో జల జీవన్ మిషన్ క్రింద శాశ్వతంగా ఇంటి ఇంటికి మంచినీటిని సరఫరా చేస్తామని చెప్పారు.

Whats_app_banner