AP TET Free Coaching 2024 : ఉచితంగా 'ఏపీ టెట్' కోచింగ్ - ఆగస్టు 1 నుంచే ప్రారంభం-free coaching for ap tet 2024 for minority students ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet Free Coaching 2024 : ఉచితంగా 'ఏపీ టెట్' కోచింగ్ - ఆగస్టు 1 నుంచే ప్రారంభం

AP TET Free Coaching 2024 : ఉచితంగా 'ఏపీ టెట్' కోచింగ్ - ఆగస్టు 1 నుంచే ప్రారంభం

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 27, 2024 11:36 AM IST

AP TET Free Coaching 2024 : ఏపీ టెట్ ఉచిత కోచింగ్ పై రాష్ట్ర మైనార్టీ శాఖ ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 19 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు.

ఏపీ టెట్ ఉచిత కోచింగ్
ఏపీ టెట్ ఉచిత కోచింగ్

AP TET Free Coaching 2024 : రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు టెట్ పరీక్ష కోసం ఉచిత కోచింగ్ ను అందిచనున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ ఎం డి ఫరూక్ శుక్రవారం అమరావతి నుంచి ఒక ప్రకటనలో వెల్లడించారు.

రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్(బీసీ-సీ), సిక్కులు, బుద్ధులు,జైనులు తదితర మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.ఏపీ- టెట్ 2024 కు ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉర్దూ, తెలుగు మీడియం లో శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు.ఈ శిక్షణ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సి ఈ డి ఎం ) మైనార్టీ సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని జిల్లాల వారీగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉచిత శిక్షణ కోసం మైనారిటీ విద్యార్థులు రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ఆయా కేంద్రాల ద్వారా శిక్షణ పొంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వ హయాంలో మైనార్టీ విద్యార్థుల సంక్షేమాన్ని, విద్యా అవకాశాలలో జగన్ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించి మైనార్టీలకు తీరని అన్యాయం చేశారని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రగతి జగన్ ప్రభుత్వం లో పూర్తిగా కుంటుపడిందని పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వ ధోరణితో విసిగిన రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీతో పట్టం కట్టారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలును కార్యాచరణ బద్ధంగా ముందుకు తీసుకెళుతుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ ఎండి ఫరూక్ తెలిపారు.

మైనారిటీ విద్యార్థులకు టెట్ లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు జిల్లాల వారీగా 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సిఈడిఎం ప్రధాన కార్యాలయం(విజయవాడ),ఆర్ సిఈడిఎం ఏఎం కాలేజ్ (గుంటూరు),ఉస్మానియా కాలేజ్ (కర్నూల్),ఆర్ సిఈడిఎం ఆంధ్ర యూనివర్సిటీ పీజీ సెంటర్ (విశాఖపట్నం), ఆర్కే బ్రిలియంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ(గుంటూరు), జోయా కోచింగ్ సెంటర్(నంద్యాల),సీఈడీఎం స్టడీ సెంటర్ (కదిరి), గవర్నమెంట్ యుహెచ్ స్కూల్(రాయదుర్గం), కుట్టి ఎడ్యుకేషనల్ సొసైటీ(అనంతపురం), ఎంయుహెచ్ స్కూల్ (మదనపల్లె), శ్రీ వెంకటేశ్వర కోచింగ్ సెంటర్ (తిరుపతి), శ్రీ విద్యా కోచింగ్ సెంటర్ (తిరుపతి), డజలింగ్ టాలెంట్ అకాడమీ,మున్సిపల్ ఉర్దూ హై స్కూల్ (పొద్దుటూరు), ఆజాద్ కోచింగ్ సెంటర్ (రాయచోటి),గవర్నమెంట్ హై స్కూల్ (కంభం), భావపురి విద్యాసంస్థలు (బాపట్ల),నోబుల్ కాలేజ్ (మచిలీపట్నం), వెంకట సాయి అకాడమీ (కడప) కేంద్రాలు ఉన్నాయి.

రాష్ట్రంలోని టెట్ కు హాజరయ్యే మైనారిటీ విద్యార్థిని విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ కోరారు.

Whats_app_banner

సంబంధిత కథనం