AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు-four more days of rains in andhrapradesh imd latest weather updates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
May 17, 2024 07:45 PM IST

AP Rains Updates : ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు
ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు (Image Source @APSDMA Twitter)

AP Weather Updates :  ఐఎండీ సూచనల ప్రకారం రాయలసీమను అనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో రాబోవు నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ(AP Disaster Management Authority) ఎండీ రోణంకి కూర్మనాథ్ వివరించారు.

18 మే, శనివారం :

• అల్లూరి సీతారామ రాజు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు మరియు బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

19 మే, ఆదివారం :

• అల్లూరి సీతారామ రాజు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

20 మే, సోమవారం :

• అల్లూరి సీతారామ రాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

21 మే, మంగళవారం :

• శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• కర్నూలు, నంద్యాల, అనంతపురం శ్రీసత్యసాయి, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

అప్రమత్తంగా ఉండాలి - ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

గురువారం ఉదయం 8.30గంటల నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలో 131.2మిమీ, టి.సుండారులో 96.4మిమీ, గుంటూరు జిల్లా చేబ్రోలులో 67మిమీ అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు. 

బాపట్ల జిల్లాలో 28మిమీ, గుంటూరు జిల్లాలో 21.5మిమీ, కృష్ణా జిల్లాలో 18.9మిమీ, కర్నూలు జిల్లాలో 13మిమీ, ప్రకాశం జిల్లాలో 9.3మిమీ సగటు వర్షపాతం రికార్డైనట్లు ఆయన చెప్పారు.

శుక్రవారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీసత్యసాయి జిల్లా నంబుల పూలకుంటలో 84మిమీ, బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో 78మిమీ,నంద్యాల జిల్లా బేతంచెర్లలో 73.5మిమీ వర్షపాతం నమోదైనట్లు వివరించారు.  దాదాపు 55 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడినట్లు తెలిపారు.

Whats_app_banner